ప్రతికూల విదేశీ సంకేతాలతో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 38,205కు చేరగా.. నిఫ్టీ 31 పాయింట్లు నీరసించి 11,303 వద్ద ట్రేడవుతోంది. 38,285 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,454 ఎగువన గరిష్టాన్నీ, 38,196 వద్ద కనిష్టాన్నీ చేరింది. టెక్ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా రెండు రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రయివేట్ బ్యాంక్స్ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం చొప్పున క్షీణించగా.. మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ప్రాటెల్, టాటా మోటార్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఐషర్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐవోసీ, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్, ఓఎన్‌జీసీ 3-0.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎంఅండ్‌ఎం, కొటక్ బ్యాంక్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జీ 1-0.5 శాతం మధ్య నీరసించాయి.
ఐడియా జోరు
డెరివేటివ్స్‌లో ఐడియా 5 శాతం జంప్‌చేయగా.. ఎన్‌ఎండీసీ, ఎస్కార్ట్స్, వేదాంతా, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, సెయిల్, అదానీ ఎంటర్, బాష్, మదర్‌సన్, అపోలో టైర్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. బంధన్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, టాటా కన్జూమర్, పీవీఆర్, బీవోబీ, టాటా పవర్, కాల్గేట్ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 965 నష్టపోగా.. 862 లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment