Volatile Session
-
ఓలటైల్ సెషన్: లాభాల్లోనే సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలనను కోల్పోయాయి. తీవ్ర ఓలటాలిటీ మధ్యసెన్సెక్స్ 145 పాయింట్లు ఎగిసి 57291 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 17048 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఇండస్ ఇండ్, డా.రెడ్డీస్ లాభపడుతుండగా, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, టైటన్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు కుప్పకూలి 81.38 వద్ద కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయిన సంగతి తెలిసిందే. -
ఆఖరి గంటలో అమ్మకాలు, హై నుంచి 800 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.ఆరంభం లాభాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత ఎగిసినప్పటికీ, ఆ తరువాత ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కురిసింది. ఫలితంగా డే హైనుంచి సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైన కుప్పకూలింది. చివర్లో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 310 పాయింట్ల పతనమై 58774 వద్ద,నిఫ్టీ83 పాయింట్లు క్షీణించి 17522 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల నష్టాలు ప్రభావితం చేశాయి. ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. శ్రీ సిమెంట్, దివీస్, హిందాల్కో, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. -
రోజంతా అలజడి: చివరికి లాభాల ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మొత్తానికి లాభాల్లో ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఒడిదుడుకులనెదుర్కొన్న సూచీలు చివరకు పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59085 వద్ద, నిఫ్టీ 27పాయింట్ల లాభంతో 17604 వద్ద స్థిరపడ్డాయి.తద్వారా కీలక మద్దతు స్థాయిల వద్ద బలంగా నిలబడటం విశేషం. అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గ్రాసిం, లాభపడగా, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీస్, టైటన్, ఐటీసీ నష్టపోయాయి. మరోవైపుడాలరు బలహీనత నేపథ్యంలో రూపాయి 8పైసలు ఎగిసి 79.80 వద్ద ముగిసింది. -
కొనసాగుతున్న వోలటాలిటీ, ఆదుకుంటున్న బ్యాంకులు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల లా భపడగా,నిఫ్టీ 20 పాయింట్లు ఎ గిసి 17597వద్ద ట్రేడ్ అయ్యాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. లాభనష్టాల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 50, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయాయి. ఐటీసీ, అపోలో హాస్పిటల్ సిప్లా,విప్రో, ఇండస్ బ్యాంక్ లాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. సెభారతి ఎయిర్టెల్, దివీస్, మారుతి గగ్రాసిం, టైటన్, రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్షీణించాయి. -
రోజంతా ఊగిసలాడినా, చివరికి మద్దతు స్థాయిలపైకి
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలకుపరిమితమైనాయి. వరుస లాభాలు, హై స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు ఆరంభంలో దాదాపు 300పాయింట్లు కుప్పకూలాయి. రోజంతా నష్టాలతో ఊగిసలాడాయి. కానీ చివరికి సెన్సెక్స్ 58 పాయింట్లు ఎగిసి 60298 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17956 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు,నిఫ్టీ 17900ఎగువన ముగియం విశేషం. బ్యాంకింగ్, పవర్ రియాల్టీ షేర్ల లాభాలకుమార్కెట్లకుబలాన్నిచ్చాయి. మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 22 పాయింట్లు నష్టంతో 79.67 వద్ద ముగిసింది. -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్‌మంటున్నాయి. 2021 అక్టోబర్‌లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్‌కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్‌చేయడం ఇందుకు సహకరించింది. -
లాభనష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాట
ముంబై : క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు, వరుసగా వెలువడుతున్న క్యూ త్రీ ఫలితాల నడుమ స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోళ్లకు పాల్పడుతుండటంతో క్షణక్షణానికి లాభనష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాడుతుంది. ప్రతీ పది నిమిషాలకు మార్కెట్లో పరిస్థితి తారుమారు అవుతోంది. అస్థిరంగా ఉన్న మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉదయం 9:40 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 60,644 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,054 దగ్గర కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీసిమెంట్ షేర్లు నష్టపోగా ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. -
భారీ ఒడిదుడుకులు : 850 పాయింట్లు రికవరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. రోజంతా కొనసాగిన తీవ్ర ఒడిదుడుకులు సామాన్య ట్రేడర్లను అయోమయంలో పడేశాయి. ఒక దశలో 600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్ వెంటనే తేరుకుంది. చివరి గంటలో 120 పాయింట్ల మేర లాభపడింది.అంటేడే కనిష్టంనుంచి దాదాపు 850 పాయింట్లు మేర పుంజుకుంది. కానీ వారాంతంలో ఇన్వెస్టర్ల అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభానికి పరిమితం కాగా, నిఫ్టీ 8 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ తప్ప దాదాపు అన్నిరంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ప్రధానంగా ఐటీ, మీడియా, ఫార్మా ,మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 52350కి దిగువన, నిఫ్టీ 15700కి దిగువన ముగిసింది. ఓఎన్జిసి, కోల్ ఇండియా, ఎన్టిపిసి, యుపిఎల్, జెఎస్డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ 7 శాతం లాభపడి టాప్ విన్నర్‌గా ఉంది. ఇంకా హెచ్‌యుఎల్,బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. డాలరుమారకంలో భారత రూపాయి ఇంట్రాడే నష్టాలనుంచి తేరుకుని డాలర్‌కు 22 పైసలు ఎగిసి 73.86 వద్ద ముగిసింది. గురువారం నాటి ముగింపు 74.08 తో పోలిస్తే శుక్రవారం 74.10 వద్ద ఫ్లాట్ ప్రారంభమైంది. -
తీవ్ర ఒడుదుడుకుల్లో సూచీలు
సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 250 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. అలాగే నిఫ్టీ 14350 దిగువకు చేరింది. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నప్పటిక భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ 43పాయింట్ల ఫ్టీ మాత్రం 17 పాయింట్లు మైనస్‌లో ఉంది. అయితే సూచీలకు మద్దతు స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఆటో స్టాక్స్ కూడాలాభాల్లో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ స్టాక్స్ నష్టపోతున్నాయి. పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్‌గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఎన్టిపిసి లాభపడుతుండగా, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుపిఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. -
ఊగిసలాట: లాభాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో వరుసగా మూడో సెషన్లో కూడా నష్టపోయింది. అటు నిఫ్టీ 15100 దిగువకు చేరింది. అయితే ఆరంభంలో 260 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ ఆ తరువాత భారీగా పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. లాభనష్టాల మధ్య కదలాడుతున్నసెన్సెక్స్ సెన్సెక్స్ 66 పాయింట్ల ఎగిసి 51385 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. మెటల్స్, ఆటో కౌంటర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. గెయిల్, యూపీఎల్ ,హెచ్‌యూఎల్ , అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడుతున్నాయి. -
లాభనష్టాల ఊగిసలాట : నష్టాల్లో మార్కెట్
సాక్షి, ముంబై: వరుస భారీ లాభాల అనంతరం దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకున్నా..మళ్లీ అదే ధోరణి. ఇలా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణించి 51127 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంత 15053 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అమ్మకాల ఒత్తిడితోభారీగా నష్టపోతోంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసీం, హెచ్డీఎఫ్సీ లైఫ్, గెయిల్ లాభాల్లోనూ, అదాని పోర్ట్స్ యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ నష్టంతోనూ ట్రేడ్ అవుతున్నాయి. -
కన్సాలిడేషన్‌లో- మళ్లీ ఐటీ జోరు
ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్లు పెరిగి 46,079కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 13,484 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నమోదైన భారీ పతనం నుంచి మార్కెట్లు తిరిగి మంగళవారం కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 46,191- 45,899 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,517-13,432 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, రియల్టీ రంగాలు 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మెటల్ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్, టైటన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్జీసీ, దివీస్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐవోసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ 1.6-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, ఎస్కార్ట్స్, పిడిలైట్, అశోక్ లేలాండ్, అపోలో హాస్పిటల్స్, మెక్‌డోవెల్, మ్యాక్స్ ఫైనాన్స్, టాటా పవర్ 4-1.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. పీఎన్బీ, అంబుజా, ఎన్ఎండీసీ, ఇండస్ టవర్, ఏసీసీ, జీ, ఐజీఎల్, జిందాల్ స్టీల్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,428 లాభపడగా.. 487 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
లాభాలతో మొదలై పతన బాటలోకి..
ముంబై, సాక్షి: ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకుని స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే మళ్లీ అమ్మకాలు తలెత్తడంతో నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 396 పాయింట్లు పతనమై 45,158కు చేరగా.. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 13,197 వద్ద ట్రేడవుతోంది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 45,938- 45,141 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,447-13,194 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (మార్కెట్లను ముంచిన కరోనా సునామీ) ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా 3- 1 శాతం మధ్య నీరసించాయి. ఐటీ మాత్రమే(0.2 శాతం) ఎదురీదుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, ఐటీసీ 3.3-2.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌సీఎల్ టెక్, దివీస్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నేలచూపులో డెరివేటి స్టాక్స్‌లో పీవీఆర్, భెల్, పీఎన్బీ, ఐబీ హౌసింగ్, జీ, బీఈఎల్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, ఎస్కార్ట్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 8.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క బంధన్ బ్యాంక్, మైండ్‌ట్రీ, ఐజీఎల్ మాత్రమే అదికూడా 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,928 నష్టపోగా.. 321 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నేలచూపులతో- మెటల్, రియల్టీ ప్లస్
ముంబై, సాక్షి: జీడీపీ జోష్‌తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621కు చేరింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలహీనపడి 13,103 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,561 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,128-13,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మీడియా లాభాల్లో ఎన్ఎస్ఈలో మెటల్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, టాటా మోటార్స్, హిందాల్కో, యూపీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా 3.2-1.1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే 1.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి. నాల్కో అప్ డెరివేటివ్ కౌంటర్లలో నాల్కో, హెచ్‌పీసీఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎన్ఎండీసీ, వేదాంతా, టాటా కెమ్, ఎక్సైడ్ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క నౌకరీ, మదర్సన్, ఐజీఎల్, ముత్తూట్, బాలకృష్ణ, సన్ టీవీ, సీమెన్స్, అరబిందో, మెక్‌డోవెల్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,340 లాభపడగా.. 646 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
కన్సాలిడేషన్‌లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్‌కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో కోలుకున్నప్పటికీ తదుపరి ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 142 పాయింట్లు క్షీణించి 43,689 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 34 పాయింట్లు తక్కువగా 12,824 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,023 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,683 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీలో 12,917-12,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తారని, దీంతో ఆటుపోట్లకు అవకాశమున్నదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ0.6-0.2 శాతం మధ్య బలహీనపడగా.. ఫార్మా 0.15 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, టైటన్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, శ్రీ సిమెంట్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎంఅండ్ఎం, దివీస్ 1.2-0.25 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, ఐషర్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఐవొసీ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 7 శాతం జంప్‌చేయగా.. భారత్ ఫోర్జ్, ఐసీఐసీఐ లంబార్డ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, మదర్సన్, అపోలో హాస్పిటల్స్, ఆర్ఈసీ, భెల్ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బాష్, ఎస్కార్ట్స్ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 948 లాభపడగా.. 1,023 నష్టాలతో ట్రేడవుతున్నాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డ్ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి బోర్లా పడ్డాయి. అయితే తొలుత యథావిధిగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఉధృతంకావడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్ 695 పాయింట్లు కోల్పోయి 43,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు వొదులుకుని 12,858 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్ 44,825 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 43,758 వరకూ జారింది. వెరసి ఇంట్రాడే గరిష్టం నుంచి 1,050 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 13,146 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,834 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. తొలుత ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. 30,198కు చేరి రికార్డ్ నెలకొల్పింది. పీఎస్‌యూ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ2.5-1 శాతం మధ్య క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.7 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6 శాతం జంప్‌చేయగా.. గెయిల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా మాత్రమే అదికూడా 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐషర్, యాక్సిస్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో, యూపీఎల్, సిప్లా, ఎయిర్టెల్ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, మణప్పురం, టాటా పవర్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, పీవీఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, జూబిలెంట్ ఫుడ్, ఎస్ఆర్ఎఫ్, డీఎల్ఎఫ్, ఇండిగో, జిందాల్ స్టీల్, ఎంఆర్ఎఫ్, కాల్గేట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.4-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,126 లాభపడగా.. 1,660 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
హుషారుగా మొదలై.. నష్టాల్లోకి
ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తొలుత సెన్సెక్స్ లాభాల సెంచరీ చేసింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 39,482కు చేరింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,612 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 39,880 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,407 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ 11,697- 11,581 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో మళ్లీ లాక్డవున్లు విధించడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచుతున్నట్లు తెలియజేశారు. ఫార్మా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ ఇండెక్స్ 1.2 శాతం పుంజుకోగా.. మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా 1.6-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, యూపీఎల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, టీసీఎస్, ఐషర్, విప్రో, బ్రిటానియా, బీపీసీఎల్ 4-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం జంప్‌చేయగా.. ఇండస్ఇండ్, హీరో మోటో, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్, సిప్లా, ఎస్బీఐ 3-1 శాతం మధ్య ఎగశాయి. మీడియా వీక్ డెరివేటివ్ కౌంటర్లలో జీ, ఐడియా, ఇన్ఫ్రాటెల్, పేజ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 2.6-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, హావెల్స్, బీవోబీ, మారికో 4-1.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 855 నష్టపోగా.. 811 లాభాలతో కదులుతున్నాయి. -
చివరికి నష్టాలే- రియల్టీ, మెటల్ జోరు
ఆటుపోట్ల మధ్య నవంబర్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు నీరసంగా ముగిసింది. సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 వద్ద నిలవగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,642 వద్ద స్థిరపడింది. తొలుత స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్ 39,988 వరకూ ఎగసింది. మిడ్‌సెషన్‌కల్లా 39,242కు వెనకడుగు వేసింది. వెరసి ఇంట్రాడేలో 750 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఇక నిఫ్టీ సైతం 11,749- 11,535 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతుండటం, యూఎస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు 1.2-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ 2.2 శాతం పుంజుకోగా.. మెటల్, మీడియా 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.2 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్, హీరో మోటో, మారుతీ, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, బ్రిటానియా, బజాజ్ ఆటో 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, ఆర్ఐఎల్, టాటా స్టీల్, గెయిల్, నెస్లే 4.5-1.7 శాతం మధ్య ఎగశాయి. చోళమండలం జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, బీవోబీ, గోద్రెజ్ సీపీ, అపోలో టైర్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, లుపిన్, కమిన్స్, మారికో, నౌకరీ. టాటా కెమికల్స్ 3.5-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు చోళమండలం, టీవీఎస్ మోటార్, ఐడియా, హెచ్‌పీసీఎల్, జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, పిరమల్, అమరరాజా, పీఎఫ్సీ, ఆర్ఈసీ 8.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,338 లాభపడగా.. 1,240 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైలంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి -
నష్టాలతో మొదలై లాభాల్లోకి మార్కెట్లు
స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 69 పాయింట్లు పుంజుకుని 40,591కు చేరగా.. నిఫ్టీ 22 పాయింట్లు బలపడి 11,911 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,664 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,406 వద్ద కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 11,929- 11,858 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మంగళవారం యూఎస్ మార్కెట్లు అటూఇటూ అన్నట్లు ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో బలహీన ధోరణి కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు 0.5-0.2 శాతం మధ్య నీరసించగా.. ఐటీ, ఫార్మా, ఆటో, మీడియా 0.7-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్ 8 శాతం జంప్ చేయగా.. హీరో మోటో, ఎంఅండ్ఎం, యాక్సిస్, యూపీఎల్, దివీస్, టాటా మోటార్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 3-1 శాతం మధ్య పెరిగాయి. అయితే కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, అల్ట్రాటెక్, టైటన్, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, టాటా స్టీల్ 2-0.4 శాతంమధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో వేదాంతా, ఐడియా, భారత్ ఫోర్జ్, ఎస్కార్ట్స్, జిందాల్ స్టీల్, వోల్టాస్, బాటా, బెర్జర్ పెయింట్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. శ్రీరామ్ ట్రాన్స్, జీ, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్, డీఎల్ఎఫ్, భెల్, పీవీఆర్, అశోక్ లేలాండ్, అంబుజా, పెట్రోనెట్, పీఎఫ్సీ 2.3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 978 లాభపడగా.. 646 నష్టాలతో కదులుతున్నాయి. -
ఒడిదొడుకుల మధ్య- ఎఫ్ఎంసీజీ అప్
ముందురోజు నమొదైన భారీ అమ్మకాల నుంచి కోలుకుంటూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 97 పాయింట్లు తక్కువగా 40,048కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 11,747 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,291- 39,978 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటం, సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్, రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్ 1.4- 0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎస్బీఐ, గెయిల్, టాటా మోటార్స్, యాక్సిస్, ఇన్ఫోసిస్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే కొటక్ బ్యాంక్ 6 శాతం జంప్‌చేయగా.. ఎన్టీపీసీ, శ్రీసిమెంట్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి. డెరివేటివ్స్ తీరిలా ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, టొరంట్ పార్మా, బంధన్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఐడియా, బీవోబీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎల్ఐసీ హౌసింగ్, పీఎన్బీ, అపోలో టైర్, పీవీఆర్ 3.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. ఏసీసీ, జీ, ఇన్ఫ్రాటెల్, కాల్గేట్, ఎంఆర్ఎఫ్, కోఫోర్జ్, పిడిలైట్ 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,072 నష్టపోగా.. 639 లాభాలతో కదులుతున్నాయి. -
ఆద్యంతం ఆటుపోట్లు- చివరికి అక్కడక్కడే
ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,973 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద స్థిరపడింది. అయితే వరుసగా మూడో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్‌చేసి 38,236ను తాకగా.. నిఫ్టీ 11,305 వరకూ ఎగసింది. అయితే ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 37,831 వద్ద, నిఫ్టీ 11,181 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చవిచూశాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా 2.2-0.7 శాతం మధ్య నీరసించగా.. మెటల్ 2 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటో, ఐటీ 0.3 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కొ, అల్ట్రాటెక్, హీరో మోటో, టైటన్, టీసీఎస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, శ్రీ సిమెంట్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, పవర్‌గ్రిడ్, యాక్సిస్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, గ్రాసిమ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ 3.5-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి. ఐడియా పతనం డెరివేటివ్ కౌంటర్లలో జిందాల్ స్టీల్, పేజ్, మైండ్‌ట్రీ, ముత్తూట్, మదర్సన్, బాలకృష్ణ, అంబుజా, ఎస్కార్ట్స్, అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్, సీమెన్స్ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, భెల్, బీవోబీ, ఇన్ఫ్రాటెల్, పీఎన్బీ, జీఎంఆర్, మెక్‌డోవెల్, ఇండిగో, ఐజీఎల్, టాటా కన్జూమర్, మ్యాక్స్ ఫైనాన్స్, పిరమల్, హావెల్స్, ఫెడరల్ బ్యాంక్ 6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,178 లాభపడగా.. 1,436 నష్టాలతో నిలిచాయి. డీఐఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
ఆటుపోట్లలోనూ ఈ చిన్న షేర్లు జూమ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో మూడో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం లాభాలు పోగొట్టుకుని స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. తద్వారా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం ఊపందుకోగా.. కొన్నిటిలో తగ్గింది. జాబితాలో డెల్టా కార్ప్ లిమిటెడ్, కజారియా సిరామిక్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, గ్యూఫిక్ బయోసైన్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. డెల్టా కార్ప్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.06 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.07 లక్షల షేర్లు చేతులు మారాయి. కజారియా సిరామిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.6 శాతం దూసుకెళ్లి రూ. 550 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 556 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 48,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 21,000 షేర్లు చేతులు మారాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం ర్యాలీ చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 63,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.34 లక్షల షేర్లు చేతులు మారాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 714 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 81,000 షేర్లు చేతులు మారాయి. బ్లిస్ జీవీఎస్ ఫార్మా బీఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.7 శాతం పెరిగి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.35 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.21 లక్షల షేర్లు చేతులు మారాయి. గ్యూఫిక్ బయోసైన్సెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ఎగసి రూ. 91 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 23,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.38 లక్షల షేర్లు చేతులు మారాయి. -
భారీ ఆటుపోట్లు- చివరికి స్వల్ప నష్టాలు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ తొలుత హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 37,668 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగసి 38,140ను తాకింది. మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు.. 400 పాయింట్లు పతనమైంది. వెరసి 37,313కు చేరింది. ఇదే విధంగా ఇంట్రాడేలో నిఫ్టీ 11,260 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,024 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో తొలుత ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనుండటం ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో చివర్లో అమ్మకాలదే పైచేయిగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. ప్రయివేట్ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.4-1.5 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ 0.8 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, నెస్లే, బ్రిటానియా, టైటన్, ఆర్ఐఎల్, మారుతీ, హిందాల్కో, విప్రో, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, ఎల్అండ్టీ, యూపీఎల్ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్ 8.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో టాటా స్టీల్, జీ, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్బీఐ 3.5-1 శాతం వెనకడుగు వేశాయి. టాటా కెమ్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో టాటా కెమ్, పేజ్, టాటా పవర్, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఇండిగో, కోఫోర్జ్, బాష్, గ్లెన్‌మార్క్, బాలకృష్ణ, వేదాంతా, రామ్‌కో సిమెంట్ 7.3-2.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా, సన్ టీవీ, శ్రీరామ్ ట్రాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, భెల్, మదర్సన్, టాటా కన్జూమర్, టొరంట్ ఫార్మా, లుపిన్, మారికో, అరబిందో, ఐబీ హౌసింగ్, కేడిలా 11-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,217లాభపడగా.. 1,416 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఆటుపోట్లలోనూ ఈ మిడ్ క్యాప్స్ జోరు
తొలుత నమోదైన భారీ నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బలహీన మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో కేపీఐటీ టెక్నాలజీస్, వైభవ్ గ్లోబల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. కేపీఐటీ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.67 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.02 లక్షల షేర్లు చేతులు మారాయి. వైభవ్ గ్లోబల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 1,839 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,878 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి. సెంట్రల్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసి రూ. 16.75 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3.5 శాతం లాభపడి రూ. 683 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 688 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం ఎగసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.55 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.18 లక్షల షేర్లు చేతులు మారాయి.