ముంబై : క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు, వరుసగా వెలువడుతున్న క్యూ త్రీ ఫలితాల నడుమ స్టాక్ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోళ్లకు పాల్పడుతుండటంతో క్షణక్షణానికి లాభనష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాడుతుంది. ప్రతీ పది నిమిషాలకు మార్కెట్‌లో పరిస్థితి తారుమారు అవుతోంది. అస్థిరంగా ఉన్న మార్కెట్‌లో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
ఉదయం 9:40 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 60,644 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,054 దగ్గర కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీసిమెంట్ షేర్లు నష్టపోగా ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment