
సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభ సెంచరీ లాభాలను కోల్పోయి దాదాపు 150 పాయింట్ల నష్టాలలోకి జారుకుంది. కానీ మిడ్ సెషన్ తరువాత మళ్లీ పుంజుకుని సెంచనీ లాభాలవైపు పయనిస్తోంది. సెన్సెక్స్ 71 పాయింట్లు ఎగిసి 39757 వద్ద, నిఫ్టీ సైతం 21 పాయింట్ల లాభంతో 11,888 వద్ద ట్రేడవుతోంది.
రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో నష్టపోతుండగా ఎఫ్‌ఎంసీజీ లాభపడుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ నష్టాలు బాగా ప్రభావం చూపిస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్ 6 శాతానికిపైగా పతనం కాగా.. ఐసీఐసీఐ, యాక్సిస్, తదితర బ్యాంకులు నష్టపోతున్నాయి. ఇంకా సన్ ఫార్మా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హీరో మోటో, బజాజ్ ఫిన్, టైటన్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు యూపీఎల్, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్, ఐవోసీ, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, జీ ఎంటర్‌టైన్ మెంట్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment