
సాక్షి, ముంబై : లాభాలతో ఉత్సాహంగా కదుతున్న దేశీ స్టాక్‌మార్కెట్లు ఉన్నట్టుండి నష్టాల్లోకి జారుకున్నాయి. 150 పాయింట్లకు పైగా ఎగిసినా.. అమ్మకాలు వెల్లువెత్తడంతో 100పాయింట్లకు పైగా పతనమైంది. ఆరంభంలో స్వల్ప ఒడిదొడుకులకు లోనైనా మిడ్‌సెషన్ తరువాత కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అనంతరం మళ్లీ బలహీన పడ్డాయి. కేవలం పది-పదిహేను నిమిషాల్లో ట్రెండ్ రివర్స్ అవుతున్న ధోరణి కనిపిస్తోంది. సెన్సెక్స్ 111 పాయింట్లు పతనమై 38,711 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 11,546 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ 11600 దిగువకు చేరింది.
మెటల్, రియల్టీ, మీడియా రంగాలు లాభపడుతుండగా, ప్రయివేట్ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోతున్నాయి. టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, వేదాంతా, యూపీఎల్, హీరో మోటో, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ లాభపడుతున్నాయి. మరోవైపు విప్రో, ఎల్ అండ్ టీ, యాక్సిస్, ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐవోసీ, పవర్‌గ్రిడ్, ఇన్‌ఫ్రాటెల్ స్వల్పంగా నష్టపోతున్నాయి. అలాగే క్యూ1 ఫలితాల్లో నిరాశపర్చడంతో ఇండస్ ఇండ్ బ్యాంకులో అమ్మకాలు కొనసాగుతున్నాయి. టెక్ మేజర్ ఇన్ఫోసిస్ ఇవాళ క్యూ1 ఫలితాలును విడుదల చేయనుంది. పాజిటివ్ అంచనాలతో ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment