
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. బలహీనంగా ప్రారంభమైన ప్రస్తుతం సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 40,265 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నీరసించి 11,888 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్ స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, జీ, ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, బ్రిటానియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్, నెస్లే, హెచ్‌సీఎల్ టెక్, ఇన్‌ఫ్రాటెల్, ఎల్‌అండ్‌టీ, ఏషియన్ పెయింట్స్, ఐషర్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరోవైపు మూడీస్ ఇన్వస్టర్ సర్వీసెస్ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో శుక్రవారం అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment