దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. వెరసి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 43 పాయింట్లు క్షీణించి 38,374కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు నీరసించి 11,347 వద్ద ట్రేడవుతోంది. 38,498 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,507 ఎగువన గరిష్టాన్నీ, 38,332 వద్ద కనిష్టాన్నీ చేరింది. విదేశీ సంకేతాలు సానుకూలంగానే ఉన్నప్పటికీ చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
బ్లూచిప్స్ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్, మెటల్, ఆటో 0.4 శాతం స్థాయిలో డీలాపడగా.. ఐటీ, ఫార్మా 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, బీపీసీఎల్, ఆర్‌ఐఎల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హీరో మోటో, విప్రొ, యాక్సిస్, అదానీ పోర్ట్స్ 1.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హెచ్‌డీఎఫ్‌సీ, జీ, హిందాల్కో, టైటన్, పవర్‌గ్రిడ్, నెస్లే, ఎన్‌టీపీసీ 2.4-0.7 శాతం మధ్య క్షీణించాయి.
ఐడియా వీక్
డెరివేటివ్స్‌లో ఐడియా 4 శాతం పతనంకాగా.. ఆర్‌బీఎల్ బ్యాంక్, పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, మణప్పురం, బీవోబీ, నాల్కో, ఏసీసీ 2.8-1.2 శాతం మధ్య నీరసించాయి. కాగా.. ఇండిగో, నౌకరీ, పిరమల్, పెట్రోనెట్, గ్లెన్‌మార్క్, అదానీ ఎంటర్, అరబిందో 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 847 లాభపడగా.. 624 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment