
మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 55.15 పాయింట్ల లాభంతో 81,410.99 వద్ద, నిఫ్టీ 1.85 పాయింట్ల లాభంతో 24,837.95 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ వంటివి చేరాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ (LTIMindtree), సిప్లా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment