Consolidation
-
ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా కొత్త ఏడాది.. కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్‌లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్‌పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు. సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ పార్ట్నర్ రజత్ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఓఎన్డీసీ (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు. ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి .. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్, రిటైల్) అంశుమన్ భట్టాచార్య తెలిపారు. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే .. ► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్ ఖోస్లా (ఏజేఎస్కే), పర్పుల్ పాండా ఫ్యాషన్స్ మొదలైన పలు ఫ్యాషన్స్ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్ కంపెనీ యాడ్వర్బ్లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్ కేటగిరీలో ఎనిమిది డిజిటల్ ఫస్ట్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది. ► ఆన్లైన్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా వీ–మార్ట్ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది. ► దేశీ రిటైల్ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్ రిటైల్ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. -
కన్సాలిడేషన్‌లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్‌కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
టెల్కోల ఆదాయానికి బూస్ట్
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త చోదకాలు..: ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్), ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ వంటి వ్యాపార విభాగాలు భవిష్యత్‌లో వృద్ధికి కొత్త చోదకాలుగా మారగలవని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. ఈ రెండు విభాగాల్లో జియో వాటా 5–10 శాతం స్థాయిలోనే ఉండటంతో అది చౌక పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో జియో యూజర్ల సంఖ్య పెరగడం కొనసాగుతుందని వివరించింది. వొడాఫోన్ ఐడియా యూజర్లను కొల్లగొట్టడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50% మార్కెట్ వాటా లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎయిర్టెల్ మాత్రం తన 30% వాటాను రక్షించుకోగలదని నివేదిక అభిప్రాయపడింది. -
రెండో రోజూ కన్సాలిడేషన్- మెటల్స్ వీక్
వరుసగా రెండో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటనే ఎంచుకున్నాయి. దీంతో ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బీపీసీఎల్ బోర్లా ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 2 శాతం డీలాపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్ఎంసీజీ 1.4 శాతం పుంజుకుంది. ఫార్మా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, టెక్ మహీంద్రా, టైటన్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, సిప్లా, యూపీఎల్, బ్రిటానియా, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బీపీసీఎల్ 9 శాతం పతనంకాగా.. ఎయిర్టెల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, గెయిల్, ఐవోసీ, హిందాల్కో, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ 3.7-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఫార్మా భళా డెరివేటివ్ కౌంటర్లలో టొరంట్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, గోద్రెజ్ సీపీ, ఐబీ హౌసింగ్, డాబర్, రామ్‌కో సిమెంట్, కేడిలా హెల్త్, శ్రీరామ్ ట్రాన్స్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐడియా, భెల్, హెచ్‌పీసీఎల్, కంకార్, ఇన్ఫ్రాటెల్, నాల్కో, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, బయోకాన్, పీఎన్బీ, డీఎల్ఎఫ్ 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1,241 లాభపడగా.. 1,370 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
కన్సాలిడేషన్ బాటలో- చిన్న షేర్లు ఓకే
దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. వెరసి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 43 పాయింట్లు క్షీణించి 38,374కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు నీరసించి 11,347 వద్ద ట్రేడవుతోంది. 38,498 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,507 ఎగువన గరిష్టాన్నీ, 38,332 వద్ద కనిష్టాన్నీ చేరింది. విదేశీ సంకేతాలు సానుకూలంగానే ఉన్నప్పటికీ చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, మెటల్, ఆటో 0.4 శాతం స్థాయిలో డీలాపడగా.. ఐటీ, ఫార్మా 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, బీపీసీఎల్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హీరో మోటో, విప్రొ, యాక్సిస్, అదానీ పోర్ట్స్ 1.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, జీ, హిందాల్కో, టైటన్, పవర్‌గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ 2.4-0.7 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 4 శాతం పతనంకాగా.. ఆర్బీఎల్ బ్యాంక్, పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, మణప్పురం, బీవోబీ, నాల్కో, ఏసీసీ 2.8-1.2 శాతం మధ్య నీరసించాయి. కాగా.. ఇండిగో, నౌకరీ, పిరమల్, పెట్రోనెట్, గ్లెన్‌మార్క్, అదానీ ఎంటర్, అరబిందో 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 847 లాభపడగా.. 624 నష్టాలతో కదులుతున్నాయి. -
కన్సాలిడేషన్ కొనసాగుతుంది..!
భారత–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలతో పాటు కరోనా వైరస్ సంబంధిత వార్తలు కూడా ఈ వారం మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం... తదితర అంశాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మరోవైపు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ విషయమై తదుపరి విచారణ ఈ నెల 10న జరగనున్నది. దీనికి సంబంధించిన పరిణామాలను బట్టి బ్యాంక్ షేర్ల కదలికలుంటాయి. ఫలితాల సీజన్ ముగింపు...! గత వారం విడుదలైన వివిధ గణాంకాలు ఆర్థిక రికవరీకి చాలా కాలమే పడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. ఇక ఈ వారంతో జూన్ క్వార్టర్ ఫలితాల సీజన్ ముగియనున్నది. ఈ వారంలో మొత్తం 341 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ వారంలో భెల్, ఐఆర్సీటీసీ, ఫ్యూచర్ కన్సూమర్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి. కన్సాలిడేషన్ కొనసాగుతుంది...! మార్కెట్ కన్సాలిడేటెడ్ మూడ్‌లో ఉందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. లాభాల స్వీకరణ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించారు. ఆగస్టులో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వారంలో మాత్రం రూ.3,800 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారని గణాంకాలు వెల్లడించాయి. -
కన్సాలిడేషన్‌లో.. ఫార్మా షేర్ల జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ నేడు ముగియనుండటంతో స్వల్ప ఆటుపోట్లు చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 38,015కు చేరగా.. 21 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,182 వద్ద కదులుతోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2.5 శాతం ఎగసింది. డాక్టర్ రెడ్డీస్ జూమ్ క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 5 శాతం జంప్‌చేసింది. రూ. 4520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4560 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో దివీస్ ల్యాబ్స్ 5 శాతం ఎగసి రూ. 2537 వద్ద, గ్లెన్‌మార్క్ 4.4 శాతం జంప్‌చేసి రూ. 443 వద్ద, అపోలో హస్పిటల్స్ 4.2 శాతం పెరిగి రూ. 1710 వద్ద ట్రేడవుతున్నాయి. లాభాల బాటలో ఇతర ఫార్మా కౌంటర్లలో లుపిన్ 3.6 శాతం పుంజుకుని రూ. 890కు చేరగా.. టొరంట్ ఫార్మా 3 శాతం బలపడి రూ. 2450ను తాకింది. ఇదేవిధంగా సన్ ఫార్మా, బయోకాన్, అరబిందో ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్ 1.2 శాతం స్థాయిలో లాభపడి కదులుతున్నాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో ఐవోసీ, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, పవర్‌గ్రిడ్, హీరో మోటో, యాక్సిస్, గెయిల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. -
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
‘కార్వీ’ ఉదంతంతో కన్సాలిడేషన్ వేగవంతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ ఉదంతంతో బ్రోకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ మరింత వేగవంతమయ్యే అవకాశముందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్) రష్మిక్ ఓఝా అంచనా వేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో క్లయింట్స్.. క్రమంగా చిన్న సంస్థల నుంచి పటిష్టమైన, పెద్ద సంస్థల వైపు మళ్లే అవకాశాలున్నాయని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరవచ్చని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నట్లు ఓఝా చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు నిరాశావహంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్ మాత్రం సానుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రాకతో పాటు దేశీయంగా సిప్ రూపంలో పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లకు దోహదపడుతోందని ఓఝా తెలిపారు. మార్కెట్లు, ఎకానమీ మధ్య వైరుధ్యాలు మరికొంత కాలం కొనసాగవచ్చని, బడ్జెట్లో తాయిలాలపై ఆశలతో మార్కెట్లు అధిక స్థాయిలోనే ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వంటి అంశాలు వచ్చే ఏడాది కీలకంగా ఉండగలవని చెప్పారు. మందగమనం, ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేకపోవడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఓఝా చెప్పారు. ఆకర్షణీయంగా ఈ రంగాలు.. కార్పొరేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (పటిష్టమైన మాతృసంస్థల మద్దతున్నవి), ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ, హెల్త్‌కేర్, అగ్రోకెమికల్స్ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని ఓఝా పేర్కొన్నారు. సిమెంటు, ఫార్మా రంగాల్లో మిడ్ క్యాప్ కంపెనీలు కూడా పరిశీలించవచ్చని తెలిపారు. -
లాభాలకు బ్రేక్ : 200 పాయింట్లు పతనం
సాక్షి,ముంబై: భారీ లాభాలతో రికార్డుల మోత మోగించిన సూచీలు చల్లబడ్డాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అన్న ఎగ్జిట్ పోల్స అంచనాలతో స్టాక్‌మార్కెట్లు అత్యంత గరిష్టస్థాయిలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో వరుసగా మూడో రోజు దూకుడుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్‌నుంచి కన్సాలిడేషన్ బాటపట్టాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పతనమై 39,128కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 11,753 వద్ద ట్రేడవుతోంది. ఆరంభంలో సెన్సెక్స్ 39,572 స్థాయిని, నిఫ్టీ సైతం 11,883ను అధిగమించింది. ఇన్ఫీ, ఎస్బీఐ, టాటా మోటార్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా మీడియా, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ 0.5 శాతం పుంజుకుంది. ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ 3 శాతం చొప్పున లాభపడగా, ఆర్ఐఎల్, బ్రిటానియా, టైటన్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. ఎస్బీఐ 7 శాతం, టాటా మోటార్స్ 6.4 శాతం, బీపీసీఎల్ 5 శాతం చొప్పున పతనంకాగా.. జీ, అదానీ పోర్ట్స్, ఐవోసీ, టాటా స్టీల్, యస్ బ్యాంక్, గెయిల్, ఇండస్ఇండ్, ఇన్ఫీ 2 శాతం పతనమయ్యాయి. మరోవైపు 23, గురువారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల విలీనం:కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ఇప్పటికే విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం ని మంత్రివర్గ ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విలీనం కార్యక్రమాన్ని పరిశీలించనున్నారని కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ప్రత్యామ్నాయ మార్గంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, జీవోఎం) ఏర్పాటుచేసిది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెడ్ గా ఉంటే ప్యానెల్ లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విలీనం చేయదలిచే ప్రభుత్వం బ్యాంకుల వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే బ్యాంకుల విలీనం అంశంపై స్వయంగా ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకుల ఆదాయం, లాభాలు, బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మూలధన నిష్పత్తులు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది ఆగస్టులో బ్యాంకుల విలీన ప్రక్రియకు క్యాబినెట్ సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం, 1970 ప్రకారమే విలీన ప్రక్రియ ఉండనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్‌లో ఇక విలీనాల జోరు..!
♦ మొండిబకాయిల పరిష్కార వ్యూహమే కారణం... ♦ బలహీన బ్యాంకులకు ప్రొవిజనింగ్ కష్టాలు ♦ పెద్ద బ్యాంకుల్లో విలీనమవ్వక తప్పని పరిస్థితి ♦ పరిశీలకుల అంచనాలు న్యూఢిల్లీ: భారీ మొండి బకాయిల సమస్యను సత్వరం పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు .. దేశీ బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. బలహీన బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్ నిబంధనల కారణంగా మరింతగా నష్టాలు మూటగట్టుకునే ముప్పు ఉందని, చివరికి పెద్ద బ్యాంకుల్లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబకాయిల్లో సింహభాగం 40–50 ఖాతాలకే పరిమితం కావడంతో ముందుగా వాటిని సత్వరం 6–9 నెలల్లో పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు మూలధనం కొరతతో సతమతమవుతుంటే మరోవైపు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన బాకీలను రాబట్టుకోవాల్సి రావడం చిన్న బ్యాంకులకు తలకు మించిన భారంగా మారనుంది. ఒకవేళ బ్యాంకులు మొండిబాకీలకు ప్రతిగా కనీసం 40 శాతం మేర ప్రొవిజనింగ్ చేసినా బ్యాంకింగ్ వ్యవస్థకు రూ. 70,000 కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని అంచనా. సమస్యాత్మక రుణ ఖాతాల్లో 60 శాతం మేర మొత్తాన్ని రైట్ డౌన్ చేస్తే మొత్తం మూలధన అవసరాలు రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉండగలవని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పార్ట్నర్ అబిజర్ దీవాన్‌జీ పేర్కొన్నారు. చాలా మటుకు కేసుల్లో ఇదే జరిగే అవకాశముందని తెలిపారు. ఇదే జరిగితే చిన్న బ్యాంకులు మరింతగా నష్టపోక తప్పదని, కన్సాలిడేషన్ ఒక్కటే వాటికి మిగిలే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం కష్టమే .. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు సత్వర ఫలితాలు ఇవ్వలేకపోవచ్చని మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకరేజి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కార్పొరేట్ల ఆదాయాలు .. లాభదాయకత అంతంత మాత్రంగానే ఉండటం, బ్యాంకులకు ప్రభుత్వం నుంచి మరింతగా మూలధనం లభించకపోవడం వంటి పరిణామాలతో ఫాస్ట్ ట్రాక్‌లో ఎన్పీఏల పరిష్కారం కుదరకపోవచ్చని మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకి రుణాలిచ్చిన బ్యాంకులకన్నా రిటైల్ రుణాల బ్యాంకులే మెరుగ్గా ఉండొచ్చని తెలిపింది. అటు మోతీలాల్ ఓస్వాల్ సైతం బాకీల పరిష్కార చర్యలు సానుకూలమైనవే అయినప్పటికీ అమలు కావడంలో జాప్యం జరగొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలైన వాటిపై బులిష్‌గా ఉన్నట్లు తెలిపింది. ఏడాదిలో తేలిపోతుంది.. ఓవైపు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాకపోగా.. మరోవైపు మార్కెట్ నుంచి తమంత తాముగా సమీకరించుకోలేకపోయే బ్యాంకులకు పరిస్థితి కష్టంగానే ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆయా బ్యాంకులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించలేని విధంగా పరిమితులు అమల్లోకి వస్తాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా చిన్న బ్యాంకులను.. పటిష్టంగా ఉన్న బ్యాంకుల్లో విలీనం చేసేందుకు దారితీయనున్నాయి. మరోవైపు ఏ బ్యాంకులను స్వతంత్రంగా కొనసాగనివ్వొచ్చు, ఏది ఎందులో విలీనం చేయొచ్చు అన్న దానిపై ప్రభుత్వానికి అవగాహన రావడానికి కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం ఉపయోగపడగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అభిషేక్ భట్టాచార్య తెలిపారు. మొత్తం మీద మొండి బాకీల సమస్య పరిష్కార వ్యూహంతో బైటపడే బ్యాంకులేవీ, నిలబడలేనివేవి అన్నది వచ్చే ఏడాది వ్యవధిలో తేలిపోనుంది. బలహీనంగా ఉన్న వాటిని పటిష్టంగా ఉన్న వాటిలో విలీనం చేయడం వల్ల అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రయోజనం చేకూరగలదని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్ అశ్విన్ పరేఖ్ తెలిపారు. ఈ తరహా విలీనాల విషయంలో ఎదురయ్యే పరిణామాల గురించి ... ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా కేంద్రం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. దీంతో భవిష్యత్‌లో పెద్దగా వ్యతిరేకత లేకుండా ఇలాంటి విలీనాలకు మార్గం సుగమం కావొచ్చన్న అభిప్రాయం నెలకొంది. -
మార్కెట్లకు కష్టకాలమా?
♦ ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీలో మందగమనం ♦ కొన్నాళ్లు కన్సాలిడేషన్ దశలోనే మార్కెట్లు ♦ ఇప్పటికిప్పుడైతే వడ్డీరేట్లు బాగా పెరగకపోవచ్చు గత పదిరోజులుగా స్టాక్ సూచీలు అక్కడక్కడే తిరుగాడుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,969 పాయింట్ల గరిష్ట స్థాయి, 8,689 పాయింట్ల కనిష్ట స్థాయిల మధ్య కదలాడి ప్రస్తుతం 8,832 పాయింట్ల వద్ద ఉంది. వడ్డీరేట్లు పెరుగుతాయనే ఆందోళనతో ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్ల తీరూ గడిచిన వారం పదిరోజులుగా ఇలాగే ఉంది. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వడ్డీరేట్లను ఫెడ్ పెంచుతుందనే అంచనాల నేపథ్యంలో వర్ధమాన దేశ స్టాక్ మార్కెట్ల లాభాల పరుగుకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావించారు. అయితే అంచనాలకు విరుద్ధంగా ఈ నెలలో రేట్లను అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పెంచలేదు. డిసెంబర్లో పెంచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగానే చెప్పింది. కేంద్ర బ్యాంక్‌ల తీరు మారుతోంది... యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల నుంచి మరింతగా ఉద్దీపన ప్యాకేజీలు రావాలని, అలా వస్తే మరింత బలం పుంజుకోవచ్చని గ్లోబల్ మార్కెట్లు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుత కేంద్ర బ్యాంక్‌ల వరుస చూస్తే మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆందోళన అనవసరం...: అంతర్జాతీయ కారణాల వల్ల లిక్విడిటీ తగ్గుతున్నదన్న అంశాన్ని చూసి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాగని దాన్ని తేలికగా తీసుకోవటానికీ వీల్లేదు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని పొందుతున్న నేపథ్యంలో లిక్విడిటీ తగ్గడం తాత్కాలికమేనని చెప్పవచ్చు. ప్రపంచ వడ్డీరేట్ల ఈల్డ్‌లు ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో నిర్మాణాత్మక విధానంలో వడ్డీరేట్ల ఈల్డ్‌లు పెరగాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, వడ్డీరేట్లు కూడా పుంజుకుంటాయి. అమెరికాతో పాటు చైనా, యూరప్, జపాన్ ఆర్థిక వ్యవస్థలు కూడా పుంజుకోవాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి వడ్డీ రేట్లు పెరిగిపోతాయని ఇప్పటి కిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. లిక్విడిటీ తగ్గుతుందా ? అయితే లిక్విడిటీ ఎంత వరకూ తగ్గుతుందనేది ప్రస్తుతం జవాబు దొరకని ప్రశ్నే. లిక్విడిటీ విషయమై వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎంతకాలం వరకూ అప్రమత్తంగా వ్యవహరిస్తాయనేది కూడా ఇపుడు ఇన్వెస్టర్లందరినీ తొలుస్తున్న ప్రశ్న. లిక్విడిటీ విషయమై కేంద్ర బ్యాంక్‌లు వెనక్కు తగ్గితే, ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కొంత ప్రభావం ఉంటుంది. భవిష్యత్తు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఇంగ్లండ్, యూరోప్, జపాన్ కేంద్ర బ్యాంక్‌లు పేర్కొన్నాయి. అయితే సమీప కాలంలో లిక్విడిటీ పెంచే చర్యలేవీ తీసుకోలేమని ఈ బ్యాంక్‌లు సూచనప్రాయంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాతనే కేంద్ర బ్యాంక్‌లు తమ ద్రవ్య విధానాలను సవరిస్తాయి. అప్పటివరకూ ఈక్విటీ మార్కెట్లు కన్సాలిడేషన్ దశలోనే ఉంటాయి. ఏడాది కనిష్ట స్థాయిల నుంచి చూస్తే ఎంఎస్సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్)-ప్రపంచ సూచీ 17 శాతం ఎంఎస్సీఐ-ఈఎం(ఎమర్జింగ్ మార్కెట్స్) 31 శాతం, ఎంఎస్సీఐ-ఇండియా సూచీ 26 శాతం చొప్పున రాబడులనిచ్చాయి. భారత్‌లో ఈ ఏడాది మార్చి నుంచి విదేశీ పెట్టుబడులు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ రూ.63,000 కోట్ల విదేశీ పెట్టుబడులొచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,500 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. -
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు, సేవల రంగానికి సంబంధించిన నెలవారీ గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ సంకేతాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, వర్షపాత విస్తరణ, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఫెడ్ కోత ఉండదు !: గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో ఈ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అవకాశాలకు గండి పడిందని, ఈ ప్రభావం మంగళవారం నాటి ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోతే, షేర్లను బట్టి ట్రేడింగ్ ఉంటుందని అమ్రపాలి అధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు చెప్పారు. షేర్ల విలువలు ఖరీదైనవిగా ఉన్నాయని, ప్రస్తుత స్థాయిల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఫలితాలతో ఒడిదుడుకులు కోల్ ఇండియా కంపెనీ ఈ నెల 9న క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నది. కోల్ ఇండియాతో పాటు ఓఎన్జీసీ, గెయిల్, భెల్, సెయిల్ వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తాయని, ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. చైనా సేవల రంగం గణాంకాలు 5న(సోమవారం) వెలువడుతున్నాయి. ఈనెల 8న(గురువారం) యూరప్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని వెల్లడిస్తుంది. నేడు సెలవు: వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు -
నేడు ఏఐబీఓసీమార్చ్ టు పార్లమెంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకుల కన్సాలిడేషన్ (ఏకీకరణ), ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) నేడు ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన బాం్యకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు, ఎఫ్‌డీఐ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసనను చేపట్టనున్నామని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో 10 వేల మందికిపైగా పాల్గొంటారన్నారు. -
ఏకాంత ప్రార్థనా జీవితంతో విజయం
సువార్త పాలరాయి భవానికి అందాన్నిస్తుందేమో కానీ పటిష్టత మాత్రం అగోచరమైన, అందవిహీనమైన పునాది రాళ్లతోనే వస్తుంది. పునాది మారదు, మాట్లాడదు, మిడిసిపడదు, కదలదు, కనిపించదు. అందంలాంటి తేలికపాటి బాహ్యాంశం పునాదికి పట్టదు. అందువల్ల తననెవరూ పట్టించుకోకున్నా నొచ్చుకోదు. పునాది జీవితం, భాష కూడా పటుత్వమే, దృఢత్వమే! అప్పుడే ఆరంభమైన ఏలియా ప్రవక్త పరిచర్యకు పునాది లాంటి ఆజ్ఞను దేవుడిచ్చాడు. కెరీతు వాగు దగ్గర కొన్నాళ్లు దాగి ఉండమని దేవుడాయన్ను ఆదేశించాడు. ప్రజల్లో భాగంగా ఉంటూ పరిచర్య చేయవలసిన తనను ప్రజలకు దూరంగా వెళ్లి అజ్ఞాతంలో దాగి ఉండమని దేవుడెందుకంటున్నాడో ఏలియాకు ఏలియాకు వెంటనే అర్థమై ఉండదు. అయినా దైవాజ్ఞకు విధేయుడయ్యాడు (1 రాజులు 17:3). పరమ దుర్మార్గుడైన అహాబురాజు ఎదుట నిలబడి దేవుని మాటల్ని నిష్కర్షగా అతనికి కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అహాబునే ఎదుర్కొన్న తాను ఇంకెవరినైనా అవలీలగా ఎదుర్కోగలనన్న భావంతో ఉన్న ఏలియాకు దేవుడే అజ్ఞాతవాసం విధించాడు. అహాబునెదిరించిన అనుభవం ఏలియాకు గొప్పదే కాని దేవుని దృష్టిలో అది చాలా చిన్న అనుభవం. దేవుని ప్రణాళిక ప్రకారం ఒక రోజున ఏలియా కర్మెలు పర్వత శిఖరం మీద వేలాది మంది ఇశ్రాయేలీయులు, వారిని హేయమైన పూజా విధానాలకు పురికొల్పిన బయలు ప్రవక్తల ముందు నిలబడవలసి ఉంది. అక్కడ బయలు ప్రవక్తలను ఆత్మీయంగా చిత్తుచేసి ఓడించి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని, భయంకరమైన క్షామంతో తల్లడిల్లుతున్న దేశం మీద విస్తారమైన వర్షాలు కురిపించవలసి ఉంది. ఈ కర్మెలు యాగానికి ముందస్తుగా, సిద్ధపాటుగా కెరీతు వద్ద అజ్ఞాతంలో ఉంటూ దేవునితో ఏకాంత ప్రార్థనా జీవితం గడపవలసి ఉంది. కర్మెలు విజయానికి ఈ కెరీతు అనుభవమే పునాది కానున్నది. దేవునితో విశ్వాసులు, పరిచారకుల అనుబంధం ఎంత పటిష్టంగా ఉంటే వారి ప్రార్థనలు అంత శక్తివంతంగా ఉంటాయి. లోక విధానాఉల, మానవ శక్తియుక్తులతో సాగే పరిచర్యలు దేవుని త్రాసులో తేలిపోతాయి, వెలవెలబోతాయి. అవి పరిచారకులకు మేలు కలిగిస్తాయేమో కాని దేవునికి మహిమ కలిగించవు. యేసుప్రభువే తరచుగా కొండల్లోకి వెళ్లి పరలోకపు తండ్రితో గంటలకొద్దీ ప్రార్థనలో గడిపే వాడని బైబిలు చెబుతోందంటే ‘ఏకాంత ప్రార్థనానుభవం’ ఎంత శ్రేష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసుప్రభువు తన శిష్యులను హెచ్చరించాడు (యోహా 14:5). ఆ రహస్యాన్ని పరిచర్యలో అర్థం చేసుకున్న పౌలు ‘నన్ను బలపరుచు దేవునియందే సమస్తం చేయగలనన్నాడు’ (ఫిలి 4:13). తమ జీవితాలు, కుటుంబాలు, చర్చిలు, పరిచర్యల్లో గొప్ప కార్యాలు జరగాలనుకుంటే ముందుగా ‘ప్రార్థన’ అనే పునాది వేసుకోవాలి. ఏకాంత ప్రార్థనా క్రమశిక్షణనలవర్చుకోవాలి. మహా దైవజనులు భక్తసింగ్గారు ఎన్నో లక్షల మందికి ఆశీర్వాదకరంగా పరిచర్య చేశారు. హైదరాబాద్‌లో తన రెండు గదుల నిరాడంబర నివాసంలో ఒక గదిని ప్రత్యేకించి ప్రార్థనకు కేటాయించారు. ఎక్కువ సమయాన్ని అందులోనే గడిపేవారు. నిరాడంబరత్వం, ఏకాంత ప్రార్థనానుభవం, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం ఇదే కెరీతు అనుభవమంటే. ప్రార్థనా జీవితం బలంగా ఉంటే సాధించలేనిది లేదు, అది బలహీనపడితే సాధించగలిగింది లేదు!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
హెచ్ఎస్బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత
ముంబై: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్ఎస్బీసీ.. తన బ్రాంచ్‌ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్‌ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలిపింది. గువాహటి, ఇండోర్, లక్నో, జోద్పూర్, థానే, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, త్రివేండ్రం, సూరత్ వంటి తదితర ప్రాంతాల్లోని బ్రాంచ్‌లను మూసివేయనున్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోని బ్రాంచులను అలాగే కొనసాగించనుంది. బ్రాంచ్‌ల సంఖ్య తగ్గినా.. రిటైల్ కార్యకలాపాల్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తామని పేర్కొంది. -
బ్యాంకింగ్ రంగం పటిష్టతే ధ్యేయం
♦ ఆర్థిక శాఖ సహాయ మంత్రి సిన్హా ♦ అవసరమైతే మరింత మూలధనం అందిస్తామని హామీ గుర్గావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్లో బ్యాంకింగ్‌కు తాజా మూలధనంగా కేంద్రం రూ.25,000 కోట్లను కేటాయించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... అవసరమైతే మరింత మూలధనం అందించడానికి సైతం సిద్ధమని ఇక్కడ జరిగిన రెండవ జ్ఞాన సంగమ్ కార్యక్రమంలో అన్నారు. మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల విలువ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు (బ్యాంకింగ్ వ్యవస్థ లోన్ బుక్ విలువ దాదాపు రూ.69 లక్షల కోట్లు) బ్యాంకుల ఉంటుందన్నది తమ అంచనా అని తెలిపారు. అయితే ఈ తరహా రుణాల పెరుగుదల వేగం దాదాపు నిలిచిపోయిందని ఆయన అన్నారు. సమస్యకు సంబంధించి ఇది ఒక సానుకూల పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సమస్య ఎక్కడుందో తెలుసని, ఎలా పరిష్కరించాలో కూడా తెలుసని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఇప్పటికే భారం గా మారిన మొండిబకాయిల సమస్య పై ఆయన మాట్లాడుతూ, ఇది ఆందోళనకరమైన అంశమే అయినప్పటికీ సమస్యను నియంత్రించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 మార్చి నాటికి గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం రూ.70,000 కోట్లు ఇవ్వాలన్నది ప్రణాళిక. వీటిలో 2015-16, 2016-17ల్లో రూ.25,000 కోట్లు చొప్పున అందుతోంది. అటు తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10 వేల కోట్ల చొప్పున బ్యాంకింగ్‌కు అందజేస్తారు. నిజానికి బ్యాంకింగ్‌కు నాలుగేళ్లలో తాజా మూలధనంగా రూ.1.85 లక్షల కోట్లు అందాలన్నది అంచనా. అయితే ప్రభుత్వం సమకూర్చగా మిగిలినది మార్కెట్ ద్వారా సమీకరించుకోవాలన్నది ప్రణాళిక. -
కన్సాలిడేషన్ బాటలో మార్కెట్
ఈ వారం ట్రెండ్‌పై స్టాక్ నిపుణుల అంచనాలు విదేశీ అంశాలు, ఎఫ్ఐఐలపై దృష్టి న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపగల దేశీ అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశముందని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. గడిచిన వారంలో 0.6% లాభాలతో పురోగమించడం ద్వారా మార్కెట్ సరికొత్త రికార్డులను సాధించిన నేపథ్యంలో ఇకపై కూడా సానుకూలంగానే కదలవచ్చునని అంచనా వేశారు. శుక్రవారం(14న) మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28,047 వద్ద, నిఫ్టీ 8,390 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. వారం మొత్తంలో సెన్సెక్స్ 178, నిఫ్టీ 53 పాయింట్ల చొప్పున పుంజుకున్నాయి. చమురు ధరలు, డాలర్ ఎఫెక్ట్ దేశీయంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను డిసెంబర్ 2న చేపట్టనుంది. ఇప్పటికే ఐదేళ్ల కనిష్టానికి జారిన చమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు సెంటిమెంట్‌కు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 62 స్థాయికి జారడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. సోమవారం(17న) జపాన్ క్యూ3 తొలి జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. బుధవారం(19న) యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ చివరినాటి పాలసీ సమావేశ వివరాలు వెల్లడికానున్నాయి. సంస్కరణలపై దృష్టి: ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి సంస్కరణలు, ఆర్బీఐ పాలసీ సమీక్ష, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లకు సూచించారు. ఇకపై మార్కెట్ స్థిరీకరణ బాటపడుతుందని, ఆపై తిరిగి మరింత పుంజుకుంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ సానుకూలంగానే కదులుతుందని, సమీప కాలంలో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8,500 పాయింట్లను అధిగమించే అవకాశముందనేది ఏంజెల్ బ్రోకింగ్ అంచనా. -
టెలికం రంగంలో ఇక కన్సాలిడేషన్: ఫిచ్
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో కన్సాలిడేషన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బలహీన, చిన్న టెలికం కంపెనీలు ఒకదానితో మరొకటి విలీనం కావడమో లేదా పెద్ద సంస్థలు వాటిని కొనుగోలు చేయడమో జరుగుతుందని పేర్కొంది. విలీన, కొనుగోలు మార్గదర్శకాల సడలింపు కోసం టెల్కోలు ఎదురుచూస్తున్నాయని, ఈ ఏడాది ఆఖరుకు మార్గదర్శకాలు వెల్లడి కావొచ్చని ఫిచ్ తెలిపింది. స్పెక్ట్రం, ఎంఅండ్ఏ విషయాల్లో స్పష్టత కొరవడటం వల్లే కన్సాలిడేషన్ ఇప్పటివరకూ సాధ్యపడలేదని పేర్కొంది. పెద్ద కంపెనీలతో పోటీ కారణంగా చిన్న టెల్కోలు అర్థవంతమైన స్థాయిలో మార్కెట్ వాటాను దక్కించుకోలేకపోతున్నాయని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలికంగా భారత్‌లో 6 టెలికం కంపెనీలు మాత్రమే లాభసాటిగా ఉండగలవని వివరించింది. కన్సాలిడేషన్ వల్ల చిన్న కంపెనీల లాభదాయకత మెరుగుపడుతుందని, ఇన్ఫ్రా వ్యయాలతో పాటు డేటా సెగ్మెంట్లో పోటీ తగ్గుతుందని వివరించింది.