సాక్షి,ముంబై: భారీ లాభాలతో రికార్డుల మోత మోగించిన సూచీలు చల్లబడ్డాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అన్న ఎగ్జిట్ పోల్స అంచనాలతో స్టాక్‌మార్కెట్లు అత్యంత గరిష్టస్థాయిలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో వరుసగా మూడో రోజు దూకుడుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్‌నుంచి కన్సాలిడేషన్ బాటపట్టాయి.
సెన్సెక్స్ 228 పాయింట్లు పతనమై 39,128కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 11,753 వద్ద ట్రేడవుతోంది. ఆరంభంలో సెన్సెక్స్ 39,572 స్థాయిని, నిఫ్టీ సైతం 11,883ను అధిగమించింది. ఇన్ఫీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రధానంగా మీడియా, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం పుంజుకుంది. ఇన్‌ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ 3 శాతం చొప్పున లాభపడగా, ఆర్‌ఐఎల్, బ్రిటానియా, టైటన్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. ఎస్‌బీఐ 7 శాతం, టాటా మోటార్స్ 6.4 శాతం, బీపీసీఎల్ 5 శాతం చొప్పున పతనంకాగా.. జీ, అదానీ పోర్ట్స్, ఐవోసీ, టాటా స్టీల్, యస్ బ్యాంక్, గెయిల్, ఇండస్‌ఇండ్, ఇన్ఫీ 2 శాతం పతనమయ్యాయి.
మరోవైపు 23, గురువారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment