సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ఇప్పటికే విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం ని మంత్రివర్గ ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విలీనం కార్యక్రమాన్ని పరిశీలించనున్నారని కేంద్రం బుధవారం ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ప్రత్యామ్నాయ మార్గంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, జీవోఎం) ఏర్పాటుచేసిది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెడ్ గా ఉంటే ప్యానెల్ లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నిర‍్మలా సీతారామన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విలీనం చేయదలిచే ప్రభుత్వం బ్యాంకుల వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే బ్యాంకుల విలీనం అంశంపై స్వయంగా ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా బ్యాంకుల ఆదాయం, లాభాలు, బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మూలధన నిష్పత్తులు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది ఆగస్టులో బ్యాంకుల విలీన ప్రక్రియకు క్యాబినెట్ సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం, 1970 ప్రకారమే విలీన ప్రక్రియ ఉండనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment