panel
-
నితిన్ మీనన్ కొనసాగింపు
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది. ఓవరాల్‌గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్‌లు ఎలైట్ క్లబ్లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్‌లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్‌కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను తొలగించారు. 2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది. -
‘ఒక దేశం.. ఒక ఎన్నిక’పై 18,626 పేజీల కోవింద్ నివేదిక
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ (వన్ నేషన్.. వన్ ఎలక్షన్)కు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను ఈ నివేదికలో పొందుపరిచారు. కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది. ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ నివేదికలోని ముఖ్యాంశాలు కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
అంతర్జాతీయ మేజిషియన్కు అరుదైన గౌరవం!
అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ మేజిషియన్ సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌లో సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయ ఇంద్రజాలికుడైన సామల వేణు భారతదేశంతో పాటు విదేశాల్లో మన సంస్కృతిని బలోపేతం చేయడానికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. గతంలో బాలల చలనచిత్రోత్సవాల్లో సామల వేణు రెండుసార్లు జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన గత 42 ఏళ్లుగా 34 కంటే ఎక్కువ దేశాలలో 7వేల కంటే ఎక్కువ మ్యాజిక్ షోలను ప్రదర్శించారు. -
వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్
ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. సుప్రీం తీర్పు.. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన! -
జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. శనివారం ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలిపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలనుకుంటోంది. జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు జమిలి కమిటీ చైర్మన్ కోవింద్. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్‌వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించింది. జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. ఇక.. లా కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది. -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?
ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq — ANI (@ANI) September 1, 2023 జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. VIDEO | "How can the government take unilateral decisions without consultation with political parties and Parliament?" says CPI general secretary D Raja on reports of the central government forming a committee to explore the possibility of 'one nation one election'. pic.twitter.com/RXjYuI19Xx — Press Trust of India (@PTI_News) September 1, 2023 'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు. నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. VIDEO | "The country is already one, is anyone questioning that? We demand fair election, not 'one nation one election'. This funda of 'one nation one election' is being brought to divert the attention from our demand of fair election," says Shiv Sena (UBT) leader @rautsanjay61… pic.twitter.com/9phqvFiqCv — Press Trust of India (@PTI_News) September 1, 2023 ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
జమిలి ఎన్నికలపై ఫస్ట్ స్టెప్, కోవింద్ నేతృత్వంలో కమిటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై కమిటీని నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 16 మందితో కూడిన ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్టును సమర్పించనుంది. ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు.? సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన వెంటనే కేంద్రం ఈ కమిటీని నియమించింది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. STORY | Ex-President Kovind-headed committee to explore possibility of 'one-nation, one-election'READ: https://t.co/UyGLbbKpdF(File Photo) pic.twitter.com/XVbXHjd75f— Press Trust of India (@PTI_News) September 1, 2023 అయిదు రాష్ట్రాల్లో యథాతధం.? అయితే షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోగా అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాలి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. దానికి గాను ఎన్నికల సంఘం ముందున్న గడువు డిసెంబర్ 13, 2023. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటికి సంబంధం లేకుండా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి వచ్చే సోమవారం మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది. Sources say that ECI is going ahead with its schedule for conduct of assembly elections in five states, namely, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan, Telangana and Mizoram; elections to these five States have to be completed before 13.12.2023. Commission to visit MP on Monday… — Arvind Gunasekar (@arvindgunasekar) September 1, 2023 లా కమిషన్ కసరత్తు వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈ అంశంపై పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. ఇదీ చదవండి: ప్రత్యేక సమావేశాలు.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు బీజేపీ ప్లాన్! -
పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్! అని పిలవకూడదు!
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్, మేడమ్ వంటి పదాలతో సంభోదించకూడదట. కేవలం "టీచర్" అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో "టీచర్" అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంత చేయాలని కోరుతూ..ఒక వ్యక్తి దాఖలు చేసిని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి) -
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉష నియమితులయ్యారు. రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, పిటీ ఉషను ఎంపీలు అభినందించారు. తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. చదవండి: Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో.. -
గేమింగ్, క్యాసినోలపై జీఎస్టీ ఉంటుందా? లేదా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై పన్ను పెంచాలన్న ప్రతిపాదనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ తన పని పూర్తి చేసింది. నివేదికను రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించనుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల గ్రూపు సమర్పించే నివేదికపై ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో భేటీ అయ్యే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి:Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల స్థూల వ్యాపారంపై 28 శాతం జీఎస్టీ విధించాలని లోగడ మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. దీన్ని ఆయా పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. క్యాసినోలపై పన్నును 28 శాతానికి పెంచడం పట్ల మరోసారి చర్చించాల్సి ఉందంటూ గోవా కోరింది. దీంతో మరింతగా చర్చించి నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోరడం గమనార్హం. ఇందులో భాగంగా పరిశ్రమకు చెందిన భాగస్వాములతో మంత్రుల బృందం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్
సాక్షి,ముంబై: కోవిడ్ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్ మైక్రోల్యాబ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్ అండ్ స్పెషల్ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్ పద్ధతులపై కోడ్ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం, కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్సైట్ ప్రకారం మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ కేసు విచారణకు అవసరమైతే ద్విసభ్య కమిషన్‌కు సిద్ధమేనని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వాదనలు వినిపించింది. ఈ కేసు మిస్టరి నిగ్గుతేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ సాగుతోంది. అదే సమయంలో విచారణ వలయంలో తమను ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తాజాగా అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు సైతం విచారణను త్వరితగతిన ముగించాలని ఆ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో అపోలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నెలన్నర రోజులుగా విచారణ సాగుతోంది. మంగళవారం మళ్లీ పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్‌కు అండగా బలమైన వాదనలు వినిపించారు. నిపుణుల బృందం కాదు జయలలిత మరణం కేసు మిస్టరీలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకే కమిషన్ ఏర్పాటైందని, ఇది నిపుణుల కమిటీ కాదని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాదులు తీసుకెళ్లారు. 50 మంది అపోలో వైద్యులను విచారించామని, వాళ్లు చెప్పిన విషయాలతో నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించబోతున్నట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వాదించారు. జయలలిత మరణంలోని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ఆర్ముగ స్వామి కమిషన్‌ను విస్తరించేందుకు లేదా, ద్విసభ్య కమిషన్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విచారణ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగించాల్సి ఉంటుందని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు సాగాయి. చదవండి: ‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం.. -
MAA Elections 2021: మహామహులను రంగంలోకి దింపనున్న విష్ణు
-
'మా' ఎన్నికలు : మంచు విష్ణు ప్యానెల్ సిద్ధం.. రేపు ప్రకటన
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వచ్చే నెల10న జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు సైతం తన ప్యానెల్ సభ్యులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు (గురువారం) ఆయన తన ప్యానెల్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్లో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండనున్నట్లు సమాచారం. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండనుంది. సినీ పరిశ్రమలోని మహామహులను విష్ణు రంగంలోకి దింపనున్నారు. చదవండి : 'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! -
కేరళలో కరోనా విజృంభణ: ప్రభుత్వ కమిటీ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంపై ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగానే కోవిడ్-19 కేసుల ఉధృతి పెరిగిందని ఇండియన్ సార్స్-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే కేరళ మెరుగ్గా ఉన్నా మతపరమైన సమావేశాలకు అనుమతించడం సరైన నిర్ణయం కాదని, కేరళ ప్రభుత్వం కేవలం అవసరమైన సేవలను మాత్రమే తిరిగి ప్రారంభించాల్సి ఉందని అగర్వాల్ వ్యాఖ్యానించారు. మతపరమైన సమావేశాలు, ధార్మిక సామూహిక కార్యక్రమాల కారణంగానే 13-20 వేల వరకు రోజువారి కేసులు పెరిగాయన్నారు. దీన్ని నివారించకపోతే కేసులు పెరుగుతూనే ఉంటుందని అగర్వాల్ హెచ్చరించారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ దేనినీ గర్తించనప్పటికీ, నమూనాల్లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్వేననని తేలిందన్నారు. దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లోకరోనా మూడోదశ రావచ్చునని అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్నవారు మళ్లీ వైరస్‌కు గురి కారు కనుక మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ తన రూపాన్ని మార్చుకుంటే ఈ ధోరణి మారుతుందని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 31 వరకు స్పెషల్ టీకా డ్రైవ్ మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎక్కువైమందికి టీకా అందించే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ టీకా డ్రైవ్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలని వాణిజ్య, ప్రజా సంస్థలను విజయన్ పిలుపునిచ్చారు. కాగా కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఆదివారం కేరళలో కొత్తగా 18,607 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 93 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు13.87 శాతానికి చేరింది. -
హ్యాకింగ్ కుట్రదారులను బయటపెడతాం
కోల్‌కతా: దేశవ్యాప్తంగా పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ ఉదంతంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌తో బహిరంగ పోరుకు దిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలు, జడ్జిలను లక్ష్యంగా చేసుకునే పెగసస్ హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ ప్రభుత్వ పాత్రను నిగ్గుతేల్చేందుకు మమత సిద్ధమయ్యారు. హ్యాకింగ్‌లో కేంద్రం కుట్రను బట్టబయలుచేసేందుకు కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్‌లతో ద్వి సభ్య కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మమత సోమవారం ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకంచేసే లక్ష్యంతో ఢిల్లీకి బయల్దేరేముందు మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘బెం గాల్లోని ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్‌కు సంబం ధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఉద్దేశించిన కమిషన్ నియామకానికి రాష్ట్ర కేబినెట్ ఓకే చెప్పింది. హ్యాకింగ్‌లో పాత్రధారులు ఎవరు? ఎలాంటి చట్టవ్యతిరేక మార్గాల్లో హ్యాకింగ్ కొనసాగింది? తదితరాలపైనా ఈ కమిషన్ దృష్టిసారిస్తుంది’ అని ఆమె చెప్పారు. కమిషన్ ఎంక్వైరీ చట్టం–1952లోని సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రప్రభుత్వం సైతం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఒక రాష్ట్రం ఈ అంశంపై విచారణ కమిషన్‌కు ఆదేశించినందున మోదీ సర్కార్ సైతం విస్తృత స్థాయిలో విచారణ కోసం కేంద్ర కమిషన్‌ను ఏర్పాటుచేయాల్సిందేననే ఒత్తిళ్లు కేంద్రంపై పెరిగేవీలుంది. ఢిల్లీలో మమత 5 రోజుల టూర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకతాటి మీదకు తేవడమే లక్ష్యంగా మమత ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇటీవల బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకున్నాక మమత ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా మమత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ప్రధాని మోదీని కలుస్తానని ఢిల్లీకి బయల్దేరేముందు సోమవారం కోల్‌కతాలో విమానాశ్రయంలో విలేకరులకు మమత చెప్పారు. మోదీతో భేటీలో ఏఏ విషయాలు ప్రస్తావిస్తారో ఆమె వెల్లడించలేదు. మోదీతో భేటీ తర్వాతే విపక్ష పార్టీలతో వరస భేటీలు ఉంటాయని సమాచారం. 30వ తేదీ వరకు ఆమె ఢిల్లీలోనే ఉంటారని, పార్లమెంట్‌కు వెళ్లి పలు పార్టీల నేతలను కలుస్తారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మమత ఢిల్లీ పర్యటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పెదవివిరిచారు. బెంగాల్లో నకిలీ కరోనా టీకాల కుంభకోణం, రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింస, ఇతర సమస్యలను ఎదుర్కోలేకే ఆమె ఢిల్లీకి వెళ్లిపోయారని దిలీప్ ఘోష్ ఎద్దేవాచేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బెంగాల్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరేందుకే మోదీని మమత కలుస్తున్నారని ఘోష్ ఆరోపించారు. -
ఆర్టిస్ట్‌లు లోకల్ కాదు.. యూనివర్సల్
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అనేది ఒక చిన్న సంస్థ. ఈ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నాలుగైదు రోజులుగా టీవీల్లో ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు వచ్చేశాయట, కేసీఆర్, కేటీఆర్‌గార్లు, ఆంధ్ర సీఎం జగన్‌గారు వచ్చేశారట’ అనే ఊహాగానాల వార్తలు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి మేం ప్రెస్‌మీట్ పెట్టకుంటే అమెరికా అధ్యక్షుడు సైతం వచ్చేశారని చూపిస్తారేమోనని భయం వేసింది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యంగా అన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ శుక్రవారం తన టీమ్‌తో కలసి ప్రెస్‌మీట్ పెట్టి, ఆయన మాట్లాడుతూ– ► ‘మా’ సమస్యలపై రెండేళ్లుగా ఆలోచిస్తున్నా. సమస్యలు పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ‘మా’కి సొంత భవనం కోసం ఏం చేయాలి? ప్యానెల్లో ఎవర్ని తీసుకోవాలనే విషయాలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ► సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైనది. అందరూ అందరికీ కావాల్సినవాళ్లే. ఎవరివైపు ఎవరున్నారనే ఊహాగానాలు అనవసరం. ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. ఇప్పుడే మాట్లాడటం ఎందుకు? మా ప్యానల్లో అందరూ క్రమశిక్షణ ఉన్నవారు. ఎలక్షన్ డేట్ వచ్చేదాకా ఎవరూ మీడియా ముందుకు రారు. ► మాది సిని‘మా’ బిడ్డల ప్యానల్. పదవి కోసం కాకుండా పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. మా ప్యానల్లో ఉన్నవారందరూ ప్రశ్నించేవాళ్లే. నేను తప్పు చేస్తే ప్రశ్నించి, నన్ను పక్కకు తప్పుకోమంటారు. పైగా అధ్యక్షస్థానానికి తగ్గ నలుగురు నా ప్యానల్లో ఉన్నారు. మా ప్యానల్ ఆవేశంతో పుట్టుకురాలేదు. ఆవేదనతో పుట్టుకొచ్చింది. చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, నాగార్జున.. ఇలా అందరూ ‘మా’ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అర్హత చూసి మన స్సాక్షిగా ఓటేయండి. పని చేసి చూపిస్తాం. ► నేను ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి నాన్ లోకల్ అంటున్నారు. ఇలాంటి మాటలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించేటప్పుడు ఎదుర్కొన్నాను. ఆవేదన కలిగింది. 1995లో ‘సంకల్పం’ చిత్రంతో తెలుగులో పరిచయమయ్యాను.. 25ఏళ్లు దాటిపోయింది.. ఇప్పుడు తెలుగులో నాన్ లోకల్ అంటుంటే చాలా ఆవేదన కలుగుతోంది. కళాకారులకు భాష, ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆర్టిస్టులు లోకల్ కాదు యూనివర్సల్. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొనిచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదే? గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. తెలుగులో తొమ్మిది నందులు, ఒక జాతీయ అవార్డు పొందినప్పుడూ నాన్ లోకల్ అనలేదు. మరిప్పుడు ఎందుకు నాన్ లోకలంటున్నారు? ఇలా మాట్లాడడం సంకుచితత్వం. ► సినిమాలతో బిజీగా ఉంటారు. ‘మా’ అధ్యక్షునిగా సమయం కేటాయించగలడా? అంటున్నారు. నాకున్న సమయంలో సినిమాల్లో నటిస్తా, ప్రొడక్షన్ చూసుకుంటా, వ్యవసాయం చేస్తా, కుటుంబాన్ని చూసుకుంటున్నా.. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు అధ్యక్షుడిగా పని చేయలేనా? సమయం విలువ తెలిసినవాడికి పని చేయడానికి చాలా సమయం ఉంటుందని నమ్ముతాను. తప్పకుండా ‘మా’కు న్యాయం చేయగల సమర్థత నాకుంది. చేస్తాను. ఈ సమావేశంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, బెనర్జీ, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అజయ్, నాగినీడు, సమీర్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, సురేష్ కొండేటి, సుడిగాలి సుధీర్, గోవిందరావు, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరు కాని ఇతర సభ్యులు జయసుధ, సాయికుమార్ తదితరులు వీడియో ద్వారా తమ సందేశాన్ని పంపారు. అన్నయ్య ఆశీర్వాదాలున్నాయి – నటుడు–నిర్మాత నాగబాబు ‘‘నాలుగేళ్లుగా ‘మా’ అసోసియేషన్ మసకబారింది. డిగ్నిటీ తగ్గింది. ఈసారి ‘మా’కు మంచి గుర్తింపు తీసుకురావాలని అనుకుంటున్నాం. ప్రకాశ్‌రాజ్ చేసే సేవల గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే మరింత మంచి జరుగుతుందని నమ్మి, మద్దతు ఇస్తున్నాను. అన్నయ్య చిరంజీవి బ్లెసింగ్స్ కూడా మాకు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్ కూడా అన్నయ్యని అడిగినప్పుడు ‘‘మా’కు మంచి చేసే ఎవరికైనా సపోర్ట్‌గా ఉంటా, కానీ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాను’’ అన్నారు. ఇక్కడ వర్గ సమీకరణాలు, రాజకీయాలు లేవు. ఇక లోకల్, నాన్ లోకల్ అనేది అర్థరహితమైన వాదన. ‘మా’లో మెంబర్షిప్ ఉన్న ఎవరైనా అధ్యక్ష పదవి నుంచి ఈసీ మెంబర్ వరకూ ఏ పదవికైనా పోటీ చేయవచ్చు. మనం భారతీయ నటులం’’ అన్నారు. మీడియాపై బండ్ల గణేశ్ వ్యంగాస్త్రాలు విసిరారు. విలేకరులు ప్రశ్నించగా... గణేశ్ ‘‘మీడియాని నేనెప్పుడూ విమర్శించను. కొందరు చేస్తున్నవాటిని ప్రస్తావించాను. అంతే.. ఎవరైనా బాధపడితే క్షమించమని కోరుతున్నాను. ‘మా’ విషయమై మమ్మల్ని చర్చా వేదికలకు పిలిచి ఇబ్బంది పెట్టొద్దని మీడియా మిత్రులను చేతులెత్తి వేడుకుంటున్నాను’’ అన్నారు నటుడు–నిర్మాత బండ్ల గణేశ్. మంచు విష్ణు అధ్యక్ష పదవి బరిలో ఉన్న నేపథ్యంలో మీరు ఆ కుటుంబంతో ఏమైనా మాట్లాడారా? అనే ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ –‘‘ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మూడు నెలల కిందట మోహన్‌బాబుగారితో మాట్లాడాను. అలాగే విష్ణుకి కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అయితే పోటీ చేయొద్దని కాదు. ఎలాంటి అసహ్యాలూ లేకుండా ఈ ఎన్నికలు జరుపుకుందామని చెప్పాను’’ అన్నారు. అలాగే ‘‘జీవిత, హేమగార్లు కూడా ప్రశ్నించే మహిళలే.. పోటీ చేయడంలో తప్పులేదు. నా దృష్టిలో ఏకగ్రీవం అన్నది కరెక్ట్ కాదు.. పోటీ ఉన్నప్పుడే పని చేసేవారిని ఎన్నుకుంటారు’’ అని కూడా అన్నారాయ. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ అడ్వొకేట్ ప్యానల్ నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూపూడి వెంకట కృష్ణకుమార్, దాట్ల దివ్య, వెన్న హేమంత్‌కుమార్, జీవీఎంవీ ప్రసాద్, కిలారు కృష్ణభూషణ్ చౌదరిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్ -
సీజేఐపై లైంగిక ఆరోపణల కేసు : కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఆరోపణల విచారణకు త్రిసభ్య ధర్మాసనం ఏరాటైంది. సీజేఐ ఆదేశం మేరకు ఏర్పాటైన ముగ్గరు సభ్యుల ఇన్‌హౌస్ ప్యానెల్‌కు జస్టిస్ శరత్అ రవింద్ బోబ్డే అధ్యక్షత వహిస్తారు. ఇందులో సీనియర్ జడ్జి ఎన్వీ రమణతో పాటు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీ ఆరోపణలు చేసిన మహిళకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 26 న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అలాగే సంబంధిత అన్ని పత్రాలు, ఇతర మెటీరియల్‌తో సిద్ధంగా ఉండాలని కోర్టు సెక్రటరీని కూడా కోరింది. కాగా తనను జస్టిస్ గొగోయ్ లైంగిక వేధించడంతో పాటు, అకారణంగా ఉద్యోగంనుంచి తొలగించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు 22మంది సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకు సమర్పించిన అఫిడవిట్ కలకలం రేసింది. దీనిపై ఏప్రిల్ 26, శుక్రవారం తొలి వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించడంపై విమర్శలు చెలరేగాయి. అయితే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను జస్టిస్ గొగోయ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
మీటూ ఉద్యమంపై స్పందించిన కేంద్రం
-
మూక హత్యలపై కీలక కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సామూహిక దాడులు, మూక హత్యలను నిరోధించేందుకు అవసరమైన సూచనలు అందించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పిస్తుంది. మూక హత్యలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంతో ముందుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతలను అల్లరి మూకలు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మూక హత్యలపై మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రధాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను సమర్పించనుంది. సామూహిక దాడులు, మూక హత్యలపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను గౌరవిస్తామని, రాష్ట్రాలకూ ఈ తరహా దాడులను నిరోధించేలా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. -
ప్రధాని విమానం రెక్క పలక ఊడిపోయింది
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే ప్రయాణించే అధికారిక జంబో జెట్ విమానాల్లో ఒక విమానం రెక్కకు ఉండే ఓ పలక(ల్యాప్ టాప్ సైజ్లోది) ఊడిపోయింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత భయాందోళనలు అలుముకున్నట్లు తెలిపారు. హోక్కాయిడోకు ఉత్తరంగా ఉన్న ద్వీపానికి బోయింగ్ 747 జంబో జెట్ బయలుదేరిన తర్వాత దాని రెక్క పలక ఊడిపోయిందని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అది కనీసం 15 అంగుళాల వరకు ఉంటుందని, విమానం రైట్ వింగ్‌కు ఉండే ఇంజిన్ పక్కన ఉండే పైలాన్‌కు కనెక్ట్ చేసి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ప్రధాని అబే విమానంలో లేరని, దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అన్నారు. మరోపక్క, ఆ ప్యానెల్ ఎలా ఊడిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. కాగా, తూర్పు యూరప్ దేశాలకు అబే నేడు (శుక్రవారం) బయలుదేరుతున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ పర్యటన ఈ జంబో జెట్ విమానాల ద్వారానే జరగనుంది. -
ప్రభుత్వ బ్యాంకుల విలీనం:కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ఇప్పటికే విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం ని మంత్రివర్గ ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విలీనం కార్యక్రమాన్ని పరిశీలించనున్నారని కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ప్రత్యామ్నాయ మార్గంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, జీవోఎం) ఏర్పాటుచేసిది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెడ్ గా ఉంటే ప్యానెల్ లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విలీనం చేయదలిచే ప్రభుత్వం బ్యాంకుల వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే బ్యాంకుల విలీనం అంశంపై స్వయంగా ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకుల ఆదాయం, లాభాలు, బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మూలధన నిష్పత్తులు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది ఆగస్టులో బ్యాంకుల విలీన ప్రక్రియకు క్యాబినెట్ సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం, 1970 ప్రకారమే విలీన ప్రక్రియ ఉండనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.