► సుప్రీంకోర్టు, బీసీసీఐకి అందజేయనున్న ప్యానెల్
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తన తుది నివేదికను జనవరి 4న సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలను కూడా కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ మొత్తం నివేదికను కోర్టుతో పాటు బీసీసీఐకి కూడా అందజేయనుంది.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా, చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలకు శిక్ష ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ త్రిసభ్య కమిటీని... బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జూలైలో నివేదికను సమర్పించాలని చెప్పినా... కమిటీ మరింత గడువు కోరడంతో కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది.
జనవరి 4న లోధా కమిటీ తుది నివేదిక
Published Wed, Dec 23 2015 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement