Justice Lodha Committee
-
ఆంధ్ర క్రికెట్ సంఘంలో కీలక మార్పులు
విజయవాడ : ఆంధ్ర క్రికెట్ సంఘంలో సోమవారం పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో తాజాగా బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో జరిగిన ఏసీఏ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీసీఐలో ఆయన పలు కీలక పదవులు అలంకరించారు. -
2పిచ్‌లు...2బంతులు
దేశవాళీ క్రికెట్ అభివృద్ధికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచనలు న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న బీసీసీఐకి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి బోర్డు ఎంతగానో సేవ చేసిందని స్పష్టం చేశారు. అరుుతే లోధా ప్యానెల్ సంస్కరణల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో తాను మాట్లాడడం సరికాదని అన్నారు. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘నేను క్రికెటర్‌గా ఎదుగుతున్న దశలో బీసీసీఐ నుంచి ఎంతగానో తోడ్పాటు లభించింది. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)తో కలిసి బోర్డు ఎన్నో శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల ప్రయోజనాలను బీసీసీఐ ఎంతగానో కాపాడుతోంది. మేం ఎదిగేందుకు అద్భుత అవకాశాలను ఇచ్చింది. అరుుతే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగకూడదు. ఎక్కడైనా ప్రతీదీ కరెక్ట్‌గా ఉండడం కష్టం. పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను. ఇక స్కూల్ క్రికెట్‌పై నేను ఎంసీఏకు ఇచ్చిన సూచనల వల్ల 1800కు పైగా చిన్నారులు క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు’ అని సచిన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా పాల్గొన్నారు. ‘రంజీ మ్యాచ్‌లో రెండు పిచ్‌లు ఉండాలి’ దేశవాళీ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలంటే ఒక్కో రంజీ మ్యాచ్‌ను రెండు విభిన్న పిచ్‌లపై ఆడించాలని సచిన్ సూచించారు. ఇలా అరుుతే విదేశాల్లో జరిగే టెస్టుల్లో మన ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని అన్నారు. ‘రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో జరపాలనే ఆలోచన నాకు కూడా ఉండేది. అలాగే విప్లవాత్మకమైన మరో ఆలోచన కూడా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో మ్యాచ్‌లు ఆడినప్పుడు అక్కడ మనం కూకాబుర్రా బంతులతో ఆడాల్సి వస్తుంది. అవి చాలా తొందరగా స్వింగ్ అవుతారుు. కానీ ఇక్కడ ఎస్జీ టెస్టు బంతులతో ఆడే ఓ యువ రంజీ ఆటగాడు విదేశాలకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే తొలి ఇన్నింగ్‌సను కూకాబుర్రా బంతులతో పచ్చిక పిచ్‌లపై ఆడించాలి. ఇది ఓపెనర్లకు సవాల్‌గా ఉంటుంది. మన స్పిన్నర్లు కూడా గ్రీన్ పిచ్‌లపై బంతులు ఎలా వేయాలో నేర్చుకుంటారు. ఇక రెండో ఇన్నింగ్‌సను ఎస్జీ టెస్టు బంతులతో టర్నింగ్ పిచ్‌లపై ఆడించాలి. నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ఎలా చేయాలో బ్యాట్స్‌మెన్ నేర్చుకుంటారు’ అని సచిన్ విశ్లేషించారు. ఈ విషయాలను చెబుతున్నప్పుడు బోర్డు అధ్యక్షుడు ఠాకూర్ ఆసక్తిగా విన్నారు. ‘టి20తో అభిమానుల ఆలోచన మారింది’ టి20 క్రికెట్‌కు విపరీతమైన ఆదరణతో పాటు సాంకేతికత కారణంగా అభిమానుల ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ ఆదరణ పొందాలంటే ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర శతృత్వం ఉండాలని సూచించారు. ‘మా చిన్నప్పుడు టెస్టులను చూసేవాళ్లం. ఇప్పటి పిల్లలు టి20 చూస్తున్నారు. అప్పట్లో గావస్కర్‌కు ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ వేయడాన్ని ఆసక్తిగా చూసేవాణ్ణి. ఆ బంతులను బ్యాక్‌ఫుట్‌తో సన్నీ ఎలా అడ్డుకునేదీ పరిశీలించేవాళ్లం. అలాగే వివ్ రిచర్డ్స్.. థామ్సన్, లారా.. మెక్‌గ్రాత్, స్టీవ్ వా.. ఆంబ్రోస్‌ల మధ్య పోటీ అభిమానులను విపరీతంగా ఆకర్షించేది. ఇప్పుడది కనిపించడం లేదు’ అని అన్నారు. 80, 90వ దశకాల్లో విండీస్‌ను ఓడించడమే అన్ని జట్లకు అతి పెద్ద లక్ష్యంగా ఉండేదని, అలాగే ఆసీస్‌లో అద్భుత ఆటగాళ్లు ఉండేవారని చెప్పారు. అరుుతే దీనికి పరిష్కారమేమిటనేదానికి సమాధానమిస్తూ.. ‘రెండు జట్ల మధ్య బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఇంటా బయటా జరగాలి. ఉదాహరణకు రెండు టెస్టులను భారత్‌లో ఆడి మరో రెండింటిని ఇంగ్లండ్‌లో ఆడించాలి. ఆటగాళ్లంతా వారే ఉంటారు.. కానీ విభిన్న వేదికలుంటారుు. ఇది మంచి పోటీగా ఉంటుంది’ అని సచిన్ పేర్కొన్నారు. ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, శోభన భర్తియా, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ -
‘లోధా’ సిఫారసులకు హెచ్‌సీఏ ఓకే!
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ ప్రక్షాళనకు జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర సంఘాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చేరింది. తాము దానిని అమలు చేసేందుకు సిద్ధమని హెచ్‌సీఏ ప్రకటించింది. ఇందుకోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మొత్తం సభ్యుల ముందు ‘లోధా’ ప్రతిపాదనలు ఉంచి దానికి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్ల డించారు. కొన్నాళ్ల క్రితం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు విచారణ సందర్భంగా తాము లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామని హైకోర్టుకు హెచ్‌సీఏ విన్నవించింది కూడా. లోధా నివేదికపై విచారణ సందర్భంగా... ప్రతిపాదనలు అమలు చేయడంలో వివిధ రాష్ట్ర సంఘాలకు ఇబ్బందులు ఉన్నాయని బీసీసీఐ సుప్రీం కోర్టుకు వెల్లడించింది. దాంతో ఈ అంశంపై ఒక్కో సంఘం నుంచి హామీ పొందాలని, అప్పటి వరకు వారికి నిధులు అందజేయరాదని బోర్డును సుప్రీం ఆదేశించింది. దాంతో అన్ని అసోసియేషన్లు తమ అభ్యంతరాలను పక్కన పెడుతూ సిఫారసుల అమలు వైపు మొగ్గుతున్నాయి. -
బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్రతిపాదనలను అమలు చేయకుండా బీసీసీఐ ధిక్కారణ ధోరణితో వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీం కోర్టు ఈ కేసును విచారించింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తుందని భావించినా.. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని బీసీసీఐ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. సిబల్ విన్నపం మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కాగా తీర్పును ఎప్పుడు వెల్లడించేది ప్రకటించలేదు. బీసీసీఐలో ప్రక్షాళన చేయాలని సూచిస్తూ లోధా కమిటీ పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిని అమలు చేయడానికి బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. సుప్రీం కోర్టులో బీసీసీఐ తరఫు న్యాయవాది ఇదే విషయాన్ని వాదించగా, లోధా కమిటీ ప్రతిపాదనలను పూర్తిగా అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడంతో బోర్డు పెద్దలు దిగివచ్చారు. -
డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి
బీసీసీఐకి లోధా ప్యానెల్ ఆదేశం న్యూఢిల్లీ: బీసీసీఐకి జస్టిస్ లోధా కమిటీ మరోసారి డెడ్‌లైన్ విధించింది. అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికలతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 15లోగా జరపాలని ఆదేశించింది. ఆదివారం జరిగిన లోధా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈనెల 21న బోర్డు ఏజీఎంను ఏర్పాటు చేయాలని భావించింది. అరుుతే ఈ సమావేశంలో 2015-16కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలనే చర్చించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగవద్దని సూచించింది. మరోవైపు నూతనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నిబంధనలు, కొత్త కమిటీలను కూడా డిసెంబర్ 30లోగా ఏర్పాటు చేయాలని గడువు విధించింది. దీంతో పాటు నవంబర్ 15లోపు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పింది. -
బీసీసీఐ.. చరిత్ర సృష్టించిన అనురాగ్ ఠాకూర్
ముంబై: బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బీసీసీఐ చరిత్రలోనే ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించారు. ఆదివారం ముంబైలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో సభ్యులు ఠాకూర్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. కాగా, శనివారం ఠాకూర్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగ్మోహన్ దాల్మియా తర్వాత ఆ పగ్గాలు చేపట్టిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనుకున్నట్లుగానే ఆయన ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా, స్వతంత్రంగానే ఎన్నికైన తొలి చైర్మన్ గానూ రికార్డు సృష్టించారు. వాస్తవానికి ఆనవాయితీ ప్రకారం ఈసారి ఈస్ట్ జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా బెంగాల్, అస్సాం, జార్ఖండ్, త్రిపుర, జాతీయ క్రికెట్ క్లబ్ సంఘాలు మద్ధతిస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయలేని కారణంగానే పదవి నుంచి తప్పుకున్నట్టు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గతంలోనే తెలిపారు. తనకన్నా సమర్థులు బోర్డులో ఉన్నారని అన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఎంసీఏ అధ్యక్షుడు షిర్కే ఎన్నికయ్యారు. -
అనురాగ్ ఠాకూర్ ఎంపికకు రంగం సిద్ధం
ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎంపిక కాబోతున్నారు. తద్వారా బోర్డు చరిత్రలోనే ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించనున్నారు. నేడు (ఆదివారం) జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో సభ్యులు ఠాకూర్‌కు మద్దతు ఇవ్వనున్నారు. శనివారం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఈసారి ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా బెంగాల్, అస్సాం, జార్ఖండ్, త్రిపుర, జాతీయ క్రికెట్ క్లబ్ సంఘాలు మద్దతిస్తున్నాయి. ఠాకూర్ ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేసే సామర్థ్యం లేని కారణంగానే పదవి నుంచి తప్పుకున్నట్టు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. తనకన్నా సమర్థులు బోర్డులో ఉన్నారని అన్నారు. -
70 ఏళ్ల వరకూ ఎందుకు?
ఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో, దాని అనుబంధ రాష్ట్ర సంఘాల్లో 70 ఏళ్ల పైబడిన వారు సభ్యులు కాకూడదన్న జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదనను అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు 70 ఏళ్లు, ఆపై ఉన్న వారు బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. అరవై ఏళ్ల తరువాత కచ్చితంగా వారు ఆయా పదవులు నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. బోర్డులో వయసు నిబంధన ఎంత ఉండాలో మీరైనా చెప్పాలంటూ బీసీసీఐని సుప్రీం ఆదేశించింది. జస్టిస్ లోథా సూచించిన ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారిస్తున్న సుప్రీం తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో లోథా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డబ్భై ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదని సూచిండంతో పాటు, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు మాత్రమే ఉండాలని లోథా కమిటీ ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే ఉండాలని పేర్కొంది. ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలని, అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలని సూచించింది. ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదని,బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తేవాలని తదితర ప్రతిపాదనలను లోథా కమిటీ ప్రతిపాదించింది. వీటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బీసీసీఐ గత నెల్లో అఫిడవిట్ దాఖలు చేసింది. -
అమలు చేస్తారా.. లేదా?
లోధా కమిటీ నివేదికపై బీసీసీఐకి సుప్రీం సూటి ప్రశ్న న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేసే విషయంలో మార్చి 3లోగా స్పందించాలని బీసీసీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించింది. బోర్డులో ప్రక్షాళన కోసం ఏమేం చేయాలో పేర్కొంటూ లోధా కమిటీ గత నెల 4న కోర్టుకు తమ నివేదికను అందించింది. ఈ నివేదిక ను తాము ఆమోదిస్తున్నట్టు, బీసీసీఐ కూడా ఇందులోని విషయాలను అమలుపరచాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ‘లోధా కమిటీ రిపోర్ట్‌ను అమలు చేయడంలో మీకేమైనా కష్టంగా ఉంటే మేం అమలుపరుస్తాం’ అని బీసీసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశిస్తూ బెంచ్ తెలిపింది. కమిటీ రిపోర్ట్‌పై బోర్డు స్పందన ఎలా ఉందో విచారించాలని ఈనెల 25న బీహార్ క్రికెట్ సంఘం కోర్టుకెక్కింది. ‘కమిటీ ప్రతిపాదనలు అమలు చేయడంలో చాలా అభ్యంతరాలున్నాయి. నివేదికను సమీక్షించేందుకు బోర్డుకు చెందిన త్రిసభ్య లీగల్ కమిటీ ఆదివారం సమావేశం కానుంది. ప్రతిస్పందన కోసం ఆయా రాష్ట్రాల యూనిట్లకు కూడా నివేదిక కాపీలను పంపాం. ఇందులో కొన్ని నియమ విరుద్ధాలు ఉన్నాయి. అందుకే దీన్ని పూర్తిగా సమీక్షించేందుకు బీసీసీఐకి కొంత సమయం కావాల్సి ఉంది’ అని బోర్డు తరపు లీగల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే కోర్టు సముచిత సమయాన్నే ఇచ్చిందని జస్టిస్ ఠాకూర్ గుర్తుచేస్తూ ఆయన వినతిని తోసిపుచ్చారు. కచ్చితంగా లోధా కమిటీ సూచనలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. -
'మంత్రులకు, ఉద్యోగులకు స్థానం ఉండరాదు'
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తుది నివేదికను రూపొందించింది. సోమవారం లోధా కమిటీ ఈ నివేదికను సుప్రీం కోర్టుకు, బీసీసీఐకి సమర్పించింది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలను ఈ నివేదికలో పొందుపర్చింది. లోధా కమిటీలోని ప్రతిపాదనలు, సూచనలు.. బీసీసీఐ, ఐపీఎల్‌కు ప్రత్యేక పరిపాలన సంఘాలు ఏర్పాటు చేయాలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పరిమితంగా స్వయం ప్రతిపత్తి ఉండాలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో తొమ్మిది మంది సభ్యులుండాలి. బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉంటారు క్రికెటర్ల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలి బీసీసీఐలో మార్పులకు ప్రతిపాదనలు బీసీసీఐ ఆఫీసు బేరర్లు వరుసగా రెండు టర్మ్‌లకు మించి ఉండరాదు బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా మంత్రులు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండరాదు ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐని తీసుకురావాలి బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకే సమయంలో రెండు పదవులు చేపట్టరాదు స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రా, చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలకు శిక్ష ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ త్రిసభ్య కమిటీని... బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
జనవరి 4న లోధా కమిటీ తుది నివేదిక
► సుప్రీంకోర్టు, బీసీసీఐకి అందజేయనున్న ప్యానెల్ న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తన తుది నివేదికను జనవరి 4న సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలను కూడా కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ మొత్తం నివేదికను కోర్టుతో పాటు బీసీసీఐకి కూడా అందజేయనుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా, చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలకు శిక్ష ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ త్రిసభ్య కమిటీని... బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జూలైలో నివేదికను సమర్పించాలని చెప్పినా... కమిటీ మరింత గడువు కోరడంతో కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. -
గంగూలీకి కీలక బాధ్యతలు
వర్కింగ్ గ్రూప్‌లో చోటు - లోధా కమిటీ నివేదికపై అధ్యయనం - వాడి వేడిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్‌కు సంబంధించి రెండు జట్లను నిషేధించాలంటూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు వచ్చే ఐపీఎల్ నిర్వహణపై తగిన సూచనలివ్వాలంటూ నలుగురు సభ్యులతో బోర్డు కొత్తగా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. బీసీసీఐ లీగల్ హెడ్ ఉషానాథ్ బెనర్జీ న్యాయపరమైన అంశాల్లో వీరికి సహకారం అందిస్తారు. కొత్తగా ఏర్పడిన వర్కింగ్ గ్రూప్‌నకు ఆరు వారాల గడువు ఇచ్చారు. ‘లోధా కమిటీ సూచనలను ఎలా అమలు చేయవచ్చో అధ్యయనం చేయడంతో పాటు ఐపీఎల్-9 కోసం ఈ కమిటీ రోడ్‌మ్యాప్ తయారు చేస్తుంది. ఐపీఎల్లో కనీసం ఎనిమిది జట్లు ఉండటం మాత్రం ఖాయం. ఆటగాళ్ల ప్రతినిధిగా సౌరవ్ గంగూలీకి ఇందులో చోటిచ్చాం. వచ్చే ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా మేం జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారంగా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తాం’ అని రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ ఇప్పటికే లోధా నివేదికను అంగీకరించిందని, వర్కింగ్ గ్రూప్ పేరుతో ఆ నివేదికను పక్కదారి పట్టించే ఎలాంటి పనులు చేయమని ఆయన స్పష్టం చేశారు. అలాంటి తప్పు మళ్లీ చేయవద్దు! ఆదివారం జరిగిన సమావేశంలో బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ రెండు జట్లను రద్దు చేయాలనే పట్టుబట్టారు. అయితే 2011లో ఇదే తరహాలో ఆవేశంగా స్పందించి కొచ్చి టీమ్‌ను రద్దు చేశామని, ఇప్పుడు ఆర్బిట్రేషన్ కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇస్తూ రూ. 550 కోట్లు చెల్లించాలని చెప్పడం తమకు ఇబ్బందిగా మారిందని మరొక సభ్యుడు అన్నారు. నాడు శశాంక్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఇప్పుడు టీమ్‌ను రద్దు చేస్తే చెన్నై కోర్టుకెక్కదని గ్యారంటీ ఏమిటి. క్రికెట్‌ను పట్టించుకోకుండా న్యాయపరమైన అంశాల కోసమే పోరాడుదామా’ అని ఈ సమావేశంలో ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఐపీఎల్ జట్లకు రవిశాస్త్రి మద్దతు... లోధా కమిటీ నివేదికను చదవడానికి ఆరు వారాలు సమయం తీసుకుని కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వివరాలను చెప్పడానికి కనీసం ఓ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం తొలుత వివరాలు మీడియాకు వెల్లడించాలని భావించారు. అయితే ఈ సమావేశం వాడి వేడిగా సాగిందని సమాచారం. చెన్నై, రాజస్తాన్ జట్లపై తక్షణమే నిషేధం విధించాలనే ప్రతిపాదన రాగానే కౌన్సిల్ సభ్యుడు, భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి దీనిని వ్యతిరేకించారు. ‘లోధా కమిటీ నివేదిక వల్ల క్రికెటర్లు నష్టపోవడానికి వీల్లేదు. ఐపీఎల్ బ్రాండ్ విలువను పెంచడంలో చెన్నై కీలక పాత్ర పోషించింది. రాజ్ కుంద్రా చేసిన తప్పుకు ద్రవిడ్ శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు’ అని రవిశాస్త్రి వాదించారు. అయితే బోర్డు సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ దీనితో విభేదించారు. దీంతో జట్లపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
సుప్రీంలో అప్పీలు చేస్తాం
సీఎస్కేపై నిషేధంతో రూ.350కోట్లకు గండి నిషేధంపై అభిమానుల ఆవేదన ఐపీఎల్‌కు సీఎస్కేనే బలమని వ్యాఖ్య చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐపీఎల్ క్రికెట్ తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై జస్టిస్ లోథా కమిటీ రెండేళ్ల నిషేధం విధించడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది. అలాగే రెండేళ్ల నిషేధం వల్ల సీఎస్కే ఆదాయానికి *350కోట్ల గండిపడింది. తమిళనాడు క్రికెట్ క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టిన సీఎస్కే భారత కెప్టెన్ ధోనీ నాయకత్వంలో అనతికాలంలో రాణించింది. 2010, 2011లో వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కప్పు గెలిచింది. అలాగే నాలుగుసార్లు (2008, 2012, 2013, 2015) రెండవ స్థానంలో నిలిచింది. 2014లో సైతం ప్లేఆఫ్గా నిలిచింది. ఐపీఎల్లో పోటీలో అప్రతిహతంగా దూసుకుపోతున్న సీఎస్కే 2013లో అపఖ్యాతిని మూటగట్టుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో సీఎస్కే ఫ్రాంచైజీ బెట్టింగ్ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్లపాటూ విచారణ చేపట్టింది. ఆరోపణలు రుజువైనందున సీఎస్కేపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు లోథా కమిటి తీర్పుచెప్పడంతో అభిమానులు కుంగిపోయారు. చెన్నైకి చెందిన థోనీ వీరాభిమాని శరవణన్ నామమాత్ర వస్త్రాలు ధరించి మిగిలిన శరీరమంతా పసుపు రంగు పూసుకుంటాడు. సీఎస్కే అనే అక్షరాలకు తోడు ధోనీ నంబరు 7ను వంటిపైన ముద్రించుకుంటాడు. సీఎస్కే టీం ఎక్కడ ఆడినా ఆ మైదానానికి చేరుకుని ఉత్సాహ పరుస్తాడు. సీఎస్కేపై రెండేళ్ల నిషేధంపై అతను మాట్లాడుతూ నిషేధం వార్త వినగానే తల్లిదండ్రులు కోల్పోయినట్లుగా బాధ కలిగింది, సీఎస్కే లేని ఐపీఎల్‌ను ఊహించలేము అన్నారు. పసుపు రంగు ఒంటికి పూసుకోకుండా ఎలా బతికేది, నా జీవితం సీఎస్కేకు అంకితం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కొందరు చేసిన తప్పుకు మొత్తం సీఎస్కే పైనే నిషేధం విధించడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్యాషన్ డిజైనర్ కృష్ణ మాట్లాడుతూ సీఎస్కే టీం క్రీడాప్రపంచానికే గర్వకారణమని, సీఎస్కే లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను చూడరని అన్నారు. ధోనీ, రైనా లేకుండా ఐపీఎలే లేదని ఆయన ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రూ.350 కోట్లకు గండి: ఇదిలా ఉండగా, సీఎస్కేపై రెండేళ్ల నిషేధం వల్ల రూ.350 కోట్ల ఆదాయానికి గండిపడింది. ప్రకటనల రూపేణా, వివిధ ఉత్పత్తుల అమ్మకాలు తదితరాల ద్వారా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.160 కోట్లు నుండి రూ.180 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. రెండేళ్ల నిషేధంతో కనీసం రూ.350 కోట్ల ఆదాయానికి గండిపడినట్టేనని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. బెట్టింగ్ కుంభకోణం వల్ల ఏడాదిపాటు నిషేధం పడుతుందని భావించాం, రెండే ళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని సీఎస్కే ముఖ్యుడొకరు చెప్పారు.