2పిచ్లు...2బంతులు
దేశవాళీ క్రికెట్ అభివృద్ధికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచనలు
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న బీసీసీఐకి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి బోర్డు ఎంతగానో సేవ చేసిందని స్పష్టం చేశారు. అరుుతే లోధా ప్యానెల్ సంస్కరణల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో తాను మాట్లాడడం సరికాదని అన్నారు. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘నేను క్రికెటర్‌గా ఎదుగుతున్న దశలో బీసీసీఐ నుంచి ఎంతగానో తోడ్పాటు లభించింది.
ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)తో కలిసి బోర్డు ఎన్నో శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల ప్రయోజనాలను బీసీసీఐ ఎంతగానో కాపాడుతోంది. మేం ఎదిగేందుకు అద్భుత అవకాశాలను ఇచ్చింది. అరుుతే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగకూడదు. ఎక్కడైనా ప్రతీదీ కరెక్ట్‌గా ఉండడం కష్టం. పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను. ఇక స్కూల్ క్రికెట్‌పై నేను ఎంసీఏకు ఇచ్చిన సూచనల వల్ల 1800కు పైగా చిన్నారులు క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు’ అని సచిన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా పాల్గొన్నారు.
‘రంజీ మ్యాచ్‌లో రెండు పిచ్‌లు ఉండాలి’
దేశవాళీ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలంటే ఒక్కో రంజీ మ్యాచ్‌ను రెండు విభిన్న పిచ్‌లపై ఆడించాలని సచిన్ సూచించారు. ఇలా అరుుతే విదేశాల్లో జరిగే టెస్టుల్లో మన ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని అన్నారు. ‘రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో జరపాలనే ఆలోచన నాకు కూడా ఉండేది. అలాగే విప్లవాత్మకమైన మరో ఆలోచన కూడా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో మ్యాచ్‌లు ఆడినప్పుడు అక్కడ మనం కూకాబుర్రా బంతులతో ఆడాల్సి వస్తుంది. అవి చాలా తొందరగా స్వింగ్ అవుతారుు.
కానీ ఇక్కడ ఎస్‌జీ టెస్టు బంతులతో ఆడే ఓ యువ రంజీ ఆటగాడు విదేశాలకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే తొలి ఇన్నింగ్‌సను కూకాబుర్రా బంతులతో పచ్చిక పిచ్‌లపై ఆడించాలి. ఇది ఓపెనర్లకు సవాల్‌గా ఉంటుంది. మన స్పిన్నర్లు కూడా గ్రీన్ పిచ్‌లపై బంతులు ఎలా వేయాలో నేర్చుకుంటారు. ఇక రెండో ఇన్నింగ్‌సను ఎస్‌జీ టెస్టు బంతులతో టర్నింగ్ పిచ్‌లపై ఆడించాలి. నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ఎలా చేయాలో బ్యాట్స్‌మెన్ నేర్చుకుంటారు’ అని సచిన్ విశ్లేషించారు. ఈ విషయాలను చెబుతున్నప్పుడు బోర్డు అధ్యక్షుడు ఠాకూర్ ఆసక్తిగా విన్నారు.
‘టి20తో అభిమానుల ఆలోచన మారింది’
టి20 క్రికెట్‌కు విపరీతమైన ఆదరణతో పాటు సాంకేతికత కారణంగా అభిమానుల ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ ఆదరణ పొందాలంటే ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర శతృత్వం ఉండాలని సూచించారు. ‘మా చిన్నప్పుడు టెస్టులను చూసేవాళ్లం. ఇప్పటి పిల్లలు టి20 చూస్తున్నారు. అప్పట్లో గావస్కర్‌కు ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ వేయడాన్ని ఆసక్తిగా చూసేవాణ్ణి. ఆ బంతులను బ్యాక్‌ఫుట్‌తో సన్నీ ఎలా అడ్డుకునేదీ పరిశీలించేవాళ్లం. అలాగే వివ్ రిచర్డ్స్.. థామ్సన్, లారా.. మెక్‌గ్రాత్, స్టీవ్ వా.. ఆంబ్రోస్‌ల మధ్య పోటీ అభిమానులను విపరీతంగా ఆకర్షించేది.
ఇప్పుడది కనిపించడం లేదు’ అని అన్నారు. 80, 90వ దశకాల్లో విండీస్‌ను ఓడించడమే అన్ని జట్లకు అతి పెద్ద లక్ష్యంగా ఉండేదని, అలాగే ఆసీస్‌లో అద్భుత ఆటగాళ్లు ఉండేవారని చెప్పారు. అరుుతే దీనికి పరిష్కారమేమిటనేదానికి సమాధానమిస్తూ.. ‘రెండు జట్ల మధ్య బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఇంటా బయటా జరగాలి. ఉదాహరణకు రెండు టెస్టులను భారత్‌లో ఆడి మరో రెండింటిని ఇంగ్లండ్‌లో ఆడించాలి. ఆటగాళ్లంతా వారే ఉంటారు.. కానీ విభిన్న వేదికలుంటారుు. ఇది మంచి పోటీగా ఉంటుంది’ అని సచిన్ పేర్కొన్నారు.
ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, శోభన భర్తియా, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్