'మంత్రులకు, ఉద్యోగులకు స్థానం ఉండరాదు'
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తుది నివేదికను రూపొందించింది. సోమవారం లోధా కమిటీ ఈ నివేదికను సుప్రీం కోర్టుకు, బీసీసీఐకి సమర్పించింది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలను ఈ నివేదికలో పొందుపర్చింది. లోధా కమిటీలోని ప్రతిపాదనలు, సూచనలు..
- బీసీసీఐ, ఐపీఎల్కు ప్రత్యేక పరిపాలన సంఘాలు ఏర్పాటు చేయాలి
- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు పరిమితంగా స్వయం ప్రతిపత్తి ఉండాలి
- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో తొమ్మిది మంది సభ్యులుండాలి. బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉంటారు
- క్రికెటర్ల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలి
- బీసీసీఐలో మార్పులకు ప్రతిపాదనలు
- బీసీసీఐ ఆఫీసు బేరర్లు వరుసగా రెండు టర్మ్లకు మించి ఉండరాదు
- బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా మంత్రులు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండరాదు
- ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐని తీసుకురావాలి
- బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకే సమయంలో రెండు పదవులు చేపట్టరాదు
స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రా, చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలకు శిక్ష ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ త్రిసభ్య కమిటీని... బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.