మీరట్ అగ్నిప్రమాదం విచారణకు ఏక సభ్య కమిషన్ | Supreme court sets up panel to investigate Meerut fire | Sakshi
Sakshi News home page

మీరట్ అగ్నిప్రమాదం విచారణకు ఏక సభ్య కమిషన్

Published Thu, Jul 31 2014 2:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Supreme court sets up panel to investigate Meerut fire

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం  మీరట్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. మాజీ న్యాయమూర్తి ఎస్.బీ సిన్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను న్యాయస్థానం ఏర్పాటు చేసింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని మీరట్ అగ్నిప్రమాదం ఘటనలో 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఈ అగ్నిప్రమాద ఘటనపై 2015 జనవరి 31 లోగా కమిషన్ తన నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరోవైపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సర్కారుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement