
అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ మేజిషియన్ సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌లో సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది.
అంతర్జాతీయ ఇంద్రజాలికుడైన సామల వేణు భారతదేశంతో పాటు విదేశాల్లో మన సంస్కృతిని బలోపేతం చేయడానికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. గతంలో బాలల చలనచిత్రోత్సవాల్లో సామల వేణు రెండుసార్లు జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన గత 42 ఏళ్లుగా 34 కంటే ఎక్కువ దేశాలలో 7వేల కంటే ఎక్కువ మ్యాజిక్ షోలను ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment