Central Film Censor Board
-
అంతర్జాతీయ మేజిషియన్కు అరుదైన గౌరవం!
అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ మేజిషియన్ సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌లో సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయ ఇంద్రజాలికుడైన సామల వేణు భారతదేశంతో పాటు విదేశాల్లో మన సంస్కృతిని బలోపేతం చేయడానికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. గతంలో బాలల చలనచిత్రోత్సవాల్లో సామల వేణు రెండుసార్లు జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన గత 42 ఏళ్లుగా 34 కంటే ఎక్కువ దేశాలలో 7వేల కంటే ఎక్కువ మ్యాజిక్ షోలను ప్రదర్శించారు. -
‘పెద్దల’ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేషన్!
సెన్సార్ బోర్డును తప్పుబట్టిన కాగ్ ముంబై: పెద్దల (ఎ) కేటగిరీ సినిమాలను పిల్లలు కూడా చూసేందుకు అనుమతించే ‘యు/ఎ’ కేటగిరీగా కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) మార్చడాన్ని కాగ్ తప్పుబట్టింది. చట్టాలను, నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని.. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ల జారీ కోసం డాక్యుమెంట్లలో మార్పులు చేసిందని పేర్కొంది. 2013 అక్టోబర్ నుంచి 2015 మార్చి మధ్య సీబీఎఫ్సీ ముంబై ఆఫీసుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి ఈ అంశాలను గుర్తించింది. విహార్దుర్వే అనే ఒక సమాచార కార్యకర్త చేసుకున్న ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిన్నర కాలంలో ‘ఎ’ కేటగిరీగా ధ్రువీకరించిన 172 సినిమాలకు ‘యు/ఎ (తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడదగిన)’ చిత్రాలుగా సీబీఎఫ్సీ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘యు/ఎ’ కేటగిరీగా గుర్తించిన 166 చిత్రాలను ‘యు(అందరూ చూడదగిన)’ కేటగిరీగా మార్చింది. ఇందులో అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది.