‘పెద్దల’ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేషన్! | 'Adult' films to 'U / A' certification! | Sakshi
Sakshi News home page

‘పెద్దల’ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేషన్!

Published Wed, Jul 8 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

‘పెద్దల’ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేషన్!

‘పెద్దల’ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేషన్!

సెన్సార్ బోర్డును తప్పుబట్టిన కాగ్
 
ముంబై: పెద్దల (ఎ) కేటగిరీ సినిమాలను పిల్లలు కూడా చూసేందుకు అనుమతించే ‘యు/ఎ’ కేటగిరీగా కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) మార్చడాన్ని కాగ్ తప్పుబట్టింది.  చట్టాలను, నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని.. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ల జారీ కోసం డాక్యుమెంట్లలో మార్పులు చేసిందని పేర్కొంది.  2013 అక్టోబర్ నుంచి 2015 మార్చి మధ్య సీబీఎఫ్‌సీ ముంబై ఆఫీసుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి ఈ అంశాలను గుర్తించింది.

విహార్‌దుర్వే అనే ఒక సమాచార కార్యకర్త చేసుకున్న ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిన్నర కాలంలో ‘ఎ’ కేటగిరీగా ధ్రువీకరించిన 172 సినిమాలకు ‘యు/ఎ (తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడదగిన)’ చిత్రాలుగా సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘యు/ఎ’ కేటగిరీగా గుర్తించిన 166 చిత్రాలను ‘యు(అందరూ చూడదగిన)’ కేటగిరీగా మార్చింది.  ఇందులో  అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది.
 
 

Advertisement
Advertisement