Samala Venu
-
అంతర్జాతీయ మేజిషియన్కు అరుదైన గౌరవం!
అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ మేజిషియన్ సామల వేణుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డ్‌లో సలహా ప్యానెల్ సభ్యునిగా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయ ఇంద్రజాలికుడైన సామల వేణు భారతదేశంతో పాటు విదేశాల్లో మన సంస్కృతిని బలోపేతం చేయడానికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. గతంలో బాలల చలనచిత్రోత్సవాల్లో సామల వేణు రెండుసార్లు జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన గత 42 ఏళ్లుగా 34 కంటే ఎక్కువ దేశాలలో 7వేల కంటే ఎక్కువ మ్యాజిక్ షోలను ప్రదర్శించారు. -
థి ఛూ.. మంతర్
భాగ్యనగరం తొలిసారిగా అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనానికి వేదిక కానుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో 19, 20 తేదీల్లో ‘ఛూ... మంతర్-2014’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెజీషియన్స్ ‘ఆస్కార్’గా పరిగణించే మెర్లిన్ అవార్డును తెలుగువాడైన ఇంద్రజాలికుడు సామల వేణు అందుకోనున్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్లిన్ అవార్డు ప్రతిమను ఆవిష్కరించారు. ‘ఛూ... మంతర్’లో భాగంగా ఇండియన్ మెర్లిన్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు టోనీ తెలిపారు. మింట్ టీ చిన్నారులు తమ అద్భుత నటనతో మిమ్మల్ని అలరిస్తారు. లామకాన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ ముందకు వస్తున్నారు. ద డిక్షనరీ సేల్స్‌గర్ల్, చిలి పెప్పర్ చిక్స్ షార్ట్, డూ యూ వర్క్ హియర్ అనే పేరిట మూడు నాటకాలతో కనులవిందు చేయనున్నారు. సుజానే పటేల్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వివరాలకు.. 9885450022 వస్త్ర బోటిక్ ‘నిండైన భారతీయుత చీర కట్టులోనే ఉంటుంది. అందుకే చీరలంటే నాకెంతో ఇష్టం’ అన్నారు వూజీ వుంత్రి డీకే అరుణ. హివూయుత్నగర్లో ‘వస్త్ర బొటిక్’ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె హాజరయ్యారు. -
'భారతీయుల్లో ప్రతిభాపాటవాలు మెండు'
హైదరాబాద్: భారతీయులకు అన్నింట్లోనూ ప్రతిభాపాటవాలు మెండుగానే ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు. సోమవారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అమెరికా వారిచే మెర్లిన్ అవార్డును స్వీకరించబోతున్న సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ ఇంద్రజాలికులు సామల వేణుకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందులోనైనా గొప్పవాళ్లు ఉంటే వారిని వారు గొప్ప వాళ్లని ఒప్పుకొవటానికి సంకోచం మనకు సంకోచమన్నారు. అదే పరాయి వాళ్లల్లో ఉంటే గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. సామల వేణుకు మెర్లిన్ అవార్డు రావటం అందరికి గర్వకారణమన్నారు. కళలు రకరకాలు ఉంటాయని గుర్తు చేశారు. పిల్లలు ఆనందించే విద్య ఇంద్రజాలం అని తెలిపారు. కళాకారులను గౌరవించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జ్యోతిష్యం- ఇంద్రజాలం విభన్నమైనవి అయినా అవి రెండు విద్యలేనని చెప్పారు. భారతీయ కళా నైపుణ్యానికి నిదర్శనం ఇంద్రజాలం అని తెలిపారు. జస్టిస్ చలమేశ్వర్ చేతుల మీదుగా సామల వేణును ఘనంగా సత్కరించారు.