భాగ్యనగరం తొలిసారిగా అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనానికి వేదిక కానుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో 19, 20 తేదీల్లో ‘ఛూ... మంతర్-2014’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెజీషియన్స్ ‘ఆస్కార్’గా పరిగణించే మెర్లిన్ అవార్డును తెలుగువాడైన ఇంద్రజాలికుడు సామల వేణు అందుకోనున్నారు.
రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్లిన్ అవార్డు ప్రతిమను ఆవిష్కరించారు. ‘ఛూ... మంతర్’లో భాగంగా ఇండియన్ మెర్లిన్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు టోనీ తెలిపారు.
మింట్ టీ
చిన్నారులు తమ అద్భుత నటనతో మిమ్మల్ని అలరిస్తారు. లామకాన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ ముందకు వస్తున్నారు. ద డిక్షనరీ సేల్స్‌గర్ల్, చిలి పెప్పర్ చిక్స్ షార్ట్, డూ యూ వర్క్ హియర్ అనే పేరిట మూడు నాటకాలతో కనులవిందు చేయనున్నారు. సుజానే పటేల్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వివరాలకు.. 9885450022
వస్త్ర బోటిక్
‘నిండైన భారతీయుత చీర కట్టులోనే ఉంటుంది. అందుకే చీరలంటే నాకెంతో ఇష్టం’ అన్నారు వూజీ వుంత్రి డీకే అరుణ. హివూయుత్‌నగర్‌లో ‘వస్త్ర బొటిక్’ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె హాజరయ్యారు.
థి ఛూ.. మంతర్
Published Fri, Jul 18 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement