హైదరాబాద్ : పీసీ సర్కార్ జయంతి సందర్భంగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ మరియు మేజిషియన్ అకాడమీ ఆధ్యర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మేజిషియన్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్‌రావు, డీన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ హనుమంతరావు, మేజిషిన్ అకాడమీ ప్రెసిడెంట్, మ్యాజికోర్స్ కో ఆర్డినేటర్ సామల వేణు హాజరైయ్యారు. అతిధులు జ్యోతి ప్రజ్యల చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు.
మ్యాజిక్ కోర్స్ ఎంతో మంది యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పిస్తుందని, ఈ కోర్స్ నిర్వహిస్తునందుకు గర్వంగా ఉందన్నారు వీసీ కిషన్ రావు.సమాజంలో మూఢనమ్మకాలను తొలగించి, ప్రజలను చైతన్య పరచి సమాజ ప్రగతికి మ్యాజిక్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రశంసించారు ఐజీ ఆఫ్ నార్త్ తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో మేజిషియన్‌లు ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని ఐజీ చెప్పారు. మరోవైపు సమాజ హితానికి ఎంతగానో దోహదపడుతున్న మేజిషియన్ కోర్స్ చేసిన వారికి ఇప్పటి వరకు డాక్టరేట్ లేదని.. రాబోయే రోజుల్లో డాక్టరేట్ ఇచ్చేలా కృషిచేయాలని కోరారు.
మ్యాజిక్ కోర్స్ చేస్తున్న విద్యార్థులకు సామాగ్రి కొనుగోలు చేసేందుకు బీసీ వెల్ఫేర్ తరపున ఆర్ధిక సాయం అందిచేలా కృషి చేస్తామని ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో మాజిక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు మేజిషియన్ అకాడమీ ప్రెసిడెంట్ సామల వేణు.గత ఎనిమిది సంవత్సరాలుగా మ్యాజిక్ కోర్స్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment