International Magicians
-
అదో 'జాదూ' కుటుంబం
సాక్షి, ఆత్రేయపురం: చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కళ్లప్పగించి సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ మధ్య మధ్య చప్పట్లు కొడుతూ ఆసక్తిగా తిలకించే ప్రదర్శన ఇంద్రజాలం. అతి ప్రాచీన భారతీయ కళ ఇది. కోల్‌కతాలో పుట్టి తన ఇంద్రజాలంతో ప్రపంచాన్ని సమ్మోహనం చేసిన సీనియర్ పీసీ సర్కార్ జయంతి ఆదివారం. ఈ రోజును అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సర్కార్‌ను ఆదర్శంగా తీసుకుని ధనంతో పని లేకుండా ఇంద్రజాలంతో సమాజ సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు ఆ ఇంద్రజాలికుల కుటుంబం. ఒక ఇంద్రజాలికుడి ప్రదర్శన తిలకించడమే అద్భుతమంటే.. ఇంటిల్లిపాదీ ఇంద్రజాలికులై వారి ప్రదర్శనలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు కదూ. ఆ వేడుక చూడాలంటే జిల్లాలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కేశవ స్వామి గుడి వీధిలోని ప్రముఖ ఇంద్రజాలికుడు శ్యామ్ జాదూగర్ ఇంటికి వెళ్లాల్సిందే. గ్రామానికి చెందిన చింతా శ్యామ్ కుమార్ లొల్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ. వారి సంతానం చింతా తేజశ్రీ రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయినిగా, కుమారుడు మోహిత్ ఫిజియోథెరపీలో డిగ్రీ చదువుతున్నాడు. శ్యామ్‌ను అభినందిస్తున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రదర్శనలు ఆంధ్రా పీసీ సర్కార్‌గా పేరు తెచ్చుకున్న చింతా శ్యామ్ కుమార్ ‘శ్యామ్ జాదూగర్’ వేదిక పేరుతో ఇంద్రజాల, మనస్తత్వ రంగాల్లో పలు ప్రపంచ రికార్డులను సాధించారు. ఇతని ప్రదర్శన అంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విదేశీయులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా తిలకిస్తూ మంత్ర ముగ్ధులవుతారు. ప్రపంచంలోనే అతి తక్కువ మందికి తెలిసిన బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ (కళ్లకు గంతలు కట్టుకుని వాహనాలు నడపడం, ఇంద్రజాల ప్రదర్శనలు చేయడం) ను ఉపయోగించి ఆయన సమాజాన్ని చైతన్యపరచడానికి కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో మేధస్సును పెంచడానికి తన ఇంటిలో బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తున్నారు. శ్యామ్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమాజ సేవలో.. బాగా సంపాదించాక సమాజ సేవ చేద్దామనుకుంటారు చాలామంది. సమాజ సేవ డబ్బుతో కూడుకున్నదనే భావన చాలా మందిలో ఉంది. అది తప్పని.. కళ ద్వారా చేయవచ్చనని శ్యామ్ కుటుంబ సభ్యులు నిరూపిస్తున్నారు. తమ ఇంట్లో నిర్మించిన ‘అబ్రక దబ్ర’ కళా వేదిక ద్వారా ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు, మ్యాజిక్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా తాము దాచుకున్న మొత్తంలో కొంత వృద్ధులకు , పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తూ విద్యార్థుల్లో మైండ్ పవర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జీవితంలో సరైన లక్ష్యాలు నిర్దేశించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మందికి మంచి జీవితాన్ని ప్రసాదించారు. శ్యామ్‌ను అభినందిస్తున్న పాతపాటి కుటుంబ సభ్యులు రికార్డులు, అవార్డులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు, అవార్డులతో పాటు సత్కారాలను అందుకున్నారు. అంతే కాకుండా వివిధ వైకల్యాలతో ఉన్న వారికి ఇంద్రజాలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని కూడ రికార్డులోకి ఎక్కించిన ఘనత వీరిది. ఇప్పటి వరకూ శ్యామ్ సుమారు 20 రికార్డులు కైవసం చేసుకోగా మోహిత్ 3 రికార్డులు, తేజశ్రీ రెండు రికార్డులను కైవసం చేసుకున్నారు. శ్యామ్, మోహిత్, తేజశ్రీ వివిధ రకాల అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. కాగా మీరు మీ సమస్యలతో సతమతమవుతూ సరైన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేక పోతున్నట్టయితే ప్రతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య 98663 72645 నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చని వారు అంటున్నారు. -
మీ మాయలోడిని నేనే.. టోనీ
అంతర్జాతీయ మెజీషియన్: ఆయన గానీ.. ఒక ఈల గానీ వేశాడంటే.. ఉన్నవి అమాంతంగా మాయమైపోతాయి. లేనివి మన ముందుకొచ్చేస్తాయి. అబ్రకదద్ర అంటూ కళ్లు మూసి తెరిచే లోగా మాయాజాలం చేసేస్తాడు. మంత్రదండంతో మతులు పోగొడతాడు. మాయాజాలంతో జనాలను కట్టిపడేస్తాడు.. మహేంద్రజాలికుడు టోని హ స్సిని. టర్కీలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఈయన ‘ఛూ.. మంతర్’ పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం-2014 కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేజిక్ మస్తీ చేస్తున్న టోనీ మహేంద్రజాలం కథాకమామీషు ఆయన మాటల్లోనే.. నాకప్పుడు 16 ఏళ్లుంటాయి. ఉద్యోగాల వేటలో ఉండగా.. లండన్‌లో మెజీషియన్ వస్తువులు అమ్మే దుకాణంలో కొలువు కుదిరింది. అక్కడే మేజిక్ అంటే ఏంటో తెలిసింది. ఆసక్తి పెరగటంతో ఇంద్రజాలం నేర్చుకున్నాను. నాలుగేళ్ల తర్వాత అమెరికా వె ళ్లాను. కొన్నేళ్లు సాధన చేశాను. నమ్మకం కలిగిన తర్వాత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను. పలు దేశాల్లో 20 వేల వరకు ప్రదర్శనలిచ్చాను. కాస్ట్లీ కళ.. నా అనుభవంలో తెలిసిందేమిటంటే.. మేజిక్ డబ్బుతో ముడిపడి ఉన్న కళ. ఇందులో వాడే పరిక రాల ధర ఎక్కువగా ఉంటుంది. అవి కొనగలిగినపుడే మేజిక్‌లో అద్భుతాలు సృష్టించగలం. అలాగే వివిధ బుక్స్ చదవాలి. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి. థీమ్ అనుకుని దానికి తగ్గట్టుగా పరికరాలు సమకూర్చుకోవాలి. నిరంతరం సాధన చేస్తేనే మంచి మెజీషియన్‌గా నిలబడగలుగుతారు. పిల్లలను మేజిక్ వైపు మళ్లించాలి తల్లిదండ్రులు తమ పిల్లలను మేజిక్ వైపు ప్రోత్సహించాలి. అయితే మంచి మెజీషియన్ అవుతాడు. లేదంటే స్టడీస్‌లో బాగా రాణించగలుగుతాడు. అమెరికాలో మెజిక్ కోసం ప్రయివేట్‌గా స్కూల్స్, అకాడెమీలు నడుస్తున్నాయి. భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మేజిక్ కోర్సును ప్రవేశపెట్టారు. ఆస్కార అవార్డంత గొప్పది సినీ పరిశ్రమకు ఆస్కార్ ఎంత గొప్పో.. మెర్లిన్ అవార్డు మెజీషియన్లకు అంతకన్నా గొప్పది. గ్రేట్ మెజీషియన్‌గా పేరొందిన మెర్లిన్ పేరుతో 1968లో ఈ అవార్డు నెలకొల్పాం. ఇరవై ఏళ్ల కిందట పీసీ సర్కార్‌కు ఇచ్చాం. ఈసారి హైదరాబాద్‌కు చెందిన సామల వేణుకు దీన్ని ప్రదానం చేయబోతున్నాం. ఛూ..మంతర్ సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ తొలిసారిగా అంతర్జాతీయ మెజీషియన్ల సమ్మేళనానికి వేదిక కాబోతోంది. 13 దేశాలకు చెందిన 600 మంది మెజీషియన్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 20(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు షో మొదలవుతుంది. హాజరవ్వాలనుకునేవారు 9014663413 నంబర్‌ను సంప్రదించవచ్చు. - కోన సుధాకర్‌రెడ్డి., ఫొటో: సతీష్ -
థి ఛూ.. మంతర్
భాగ్యనగరం తొలిసారిగా అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనానికి వేదిక కానుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో 19, 20 తేదీల్లో ‘ఛూ... మంతర్-2014’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెజీషియన్స్ ‘ఆస్కార్’గా పరిగణించే మెర్లిన్ అవార్డును తెలుగువాడైన ఇంద్రజాలికుడు సామల వేణు అందుకోనున్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్లిన్ అవార్డు ప్రతిమను ఆవిష్కరించారు. ‘ఛూ... మంతర్’లో భాగంగా ఇండియన్ మెర్లిన్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు టోనీ తెలిపారు. మింట్ టీ చిన్నారులు తమ అద్భుత నటనతో మిమ్మల్ని అలరిస్తారు. లామకాన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ ముందకు వస్తున్నారు. ద డిక్షనరీ సేల్స్‌గర్ల్, చిలి పెప్పర్ చిక్స్ షార్ట్, డూ యూ వర్క్ హియర్ అనే పేరిట మూడు నాటకాలతో కనులవిందు చేయనున్నారు. సుజానే పటేల్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వివరాలకు.. 9885450022 వస్త్ర బోటిక్ ‘నిండైన భారతీయుత చీర కట్టులోనే ఉంటుంది. అందుకే చీరలంటే నాకెంతో ఇష్టం’ అన్నారు వూజీ వుంత్రి డీకే అరుణ. హివూయుత్నగర్లో ‘వస్త్ర బొటిక్’ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె హాజరయ్యారు.