Harihara Kalabhavan
-
ఆదివాసీల అభివృద్ధే దేశాభివృద్ధి: గవర్నర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ప్రకృతితో మమేకమై స్వచ్ఛంగా ఉండే ఆదివాసీలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందినట్లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంస్థ, ఆదివాసీ విద్యార్థి మండలి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమంటే భగవంతుడికి సేవ చేయడమేనన్నారు. గవర్నర్‌గా ఇక్కడికి వచ్చాక ఆరు ఆది వాసీ గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ సర్వే చేయించగా...అక్కడి మహిళలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నట్లు తేలిందని, వారికి ఐరన్ మాత్రలు పంపించగా...వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడలేదని వివరించారు. దీంతో ఐరన్ ఎక్కువగా లభించే మహువా పూలతో తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తే చాలామంది మహిళలు రక్తహీనతనుంచి బయటపడ్డారని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆదివాసీలతో కలసి గవర్నర్ నృత్యాలు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..ఆర్టి కల్ 244 ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయని, కానీ వాటిని పరిరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
రూపకలాపం.. మంత్రముగ్ధం (ఫొటోలు)
-
హరిహరకళాభవన్ మూగబోయింది!
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని హరిహరకళా భవన్.. జంట నగరాల ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకూ సుపరిచితమే.. 1989 సంవత్సరం నుంచీ అద్భుత కళా ప్రదర్శనలతో ఎప్పుడూ కళ కళలాడుతూ ఉండేది.. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో ఆ ప్రాంతం సందడిగా ఉండేది.. కేవలం కళలు, కళాకారులకే కాకుండా సభలు, సమావేశాలకూ వేదికయ్యేది.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో జిగేల్మంటూ మెరిసిపోయేది. ప్రదర్శనలు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చేవారు. ఉన్నట్టుండి కోవిడ్–19 కారణంగా హరిహరకళాభవన్ మూగబోయింది. 16 నెలలుగా భవన్ తలుపులు తెరుచుకోవడం లేదు. – రాంగోపాల్‌పేట్ కోవిడ్–19 కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నట్లే కళా రంగం కూడా తీవ్రంగా కష్టాల్లోకి కూరుకుపోయింది. నిత్యం ప్రదర్శనలతో సాగిపోతున్న హరిహరకళా భవన్‌కు తాళం పడింది. 1989 సంవత్సరం నుంచి ఎన్నో వేల కార్యక్రమాలకు వేధికైన హరిహరకళాభవన్ కోవిడ్–19 కారణంగా గతేడాది మూతపడింది. నగరంలోని రవీంద్రభారతి తర్వాత అతిపెద్ద ఆడిటోరియం ప్రస్తుతం కళా ప్రదర్శనలు లేక కళా విహీనంగా తయారైంది. నిత్యం అతిథులు, ప్రముఖుల రాకపోకలు, ప్రేక్షకులతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ భవన్ నిశ్శబ్దంగా మారి బోసిపోయింది. 16 నెలలుగా తెరుచుకోని తలుపులు 2020లో మొదటి దశ కరోనాతో మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో హరిహర కళాభవన్ కూడా మూత పడింది. తర్వాత షాపులు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని తెరుచుకున్నా కళాభవన్ మాత్రం తెరుచుకోలేదు. రెండవ దశ కరోనా వచ్చి లాక్డౌన్ ఎత్తేసినా ఆ అదృష్టం కళా భవన్‌కు దక్కడం లేదు. భవన్లో నెలకు సగటున 20 రోజులు కార్యక్రమాలు నడుస్తుండటంతో వాటి నుంచి జీహెచ్ఎంసీకి ఆదాయం చేకూరేది. నామమాత్రపు అద్దెకు.. ఇంత పెద్ద ఆడిటోరియం నామమాత్రపు అద్దెకు అందిస్తుండటంతో చాలామంది ఇక్కడ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తుండేవారు. 16 నెలల నుంచి మూత పడిఉండటంతో ఆదాయానికి గండి పడింది. భవన్ నిర్వహణకు ఇక్కడ 16 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి జీతాలు విద్యుత్, నీటి బిల్లులు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఒక్క రూపాయి ఆదాయం లేకున్నా విద్యుత్, తాగునీటితో పాటు నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 1400 సీట్ల కెపాసిటీతో.. 1989 సంవత్సరం సెప్టెంబర్ 24న అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, గవర్నర్ కుముద్‌బెన్ జోషి, నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా దీన్ని ప్రారంభించారు. నగరంలోనే అతిపెద్ద ఆడిటోరియంగా 1400 సీట్ల కెపాసిటీతో ఎయిర్ కూలర్, పార్కింగ్ సదుపాయంతో దీన్ని నిర్మించారు. ఎదురుచూస్తున్నాం ప్రియ కల్చరల్ ద్వారా హరిహర కళాభవన్‌లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. మ్యాజిక్ షో, నృత్య ప్రదర్శనలు అందించాం. దక్షిణ భారత దేశంలోని అనేక నగరాల్లో ప్రదర్శనలు చేస్తున్నా తక్కువ అద్దెతో ఇంత పెద్ద ఆడిటోరియం ఎక్కడా కనిపించ లేదు. హరిహరకళాభవన్ తెరిస్తే మేము ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధం. – కార్తీక్, ప్రియ కల్చరల్ కార్యదర్శి ఏడాదిన్నరగా.. సికింద్రాబాద్ వాసులకు ఉండే మంచి ఆడిటోరియం. తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగుతుండేవి. ఎంతో మంది ప్రేక్షకులకు ఇవి ఆహ్లాదకరంగా ఉండేవి. కానీ ఏడాదిన్నరగా అందుబాటులో లేదు. – సూర్యప్రకాశ్‌రెడ్డి -
చిన్నారుల 'లుంగీ డాన్స్' అదుర్స్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో గురువారం.. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు లుంగీ కట్టీ మెడలో తువాలు వేసి చెలరేగి పోయారు. కుర్తా పైజామాతో 'బల్లే బల్లే' అంటూ తమదైన శైలిలో చిందులేస్తూ అదరగొట్టారు. కేరళ, ఒరిస్సా, తెలుగు, పంజాబీ, గుజరాతీ సంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. ఇక్కడి లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల పట్టభద్రుల దినోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. విభిన్న వేషధారణలతో అందరిని అబ్బురపరిచారు. చిన్నారుల ఆటా పాటలు చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అలాగే యూకేజీ చిన్నారులు పట్టాను తీసుకుని ఆనందంతో గెంతులేశారు. విద్యా సంస్థల చైర్మన్ సదానంద్ విద్యార్థులకు పట్టాలు అందించారు. -
రాక్‌స్టార్..
-
ఓనం..
-
థి ఛూ.. మంతర్
భాగ్యనగరం తొలిసారిగా అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనానికి వేదిక కానుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో 19, 20 తేదీల్లో ‘ఛూ... మంతర్-2014’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెజీషియన్స్ ‘ఆస్కార్’గా పరిగణించే మెర్లిన్ అవార్డును తెలుగువాడైన ఇంద్రజాలికుడు సామల వేణు అందుకోనున్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెర్లిన్ అవార్డు ప్రతిమను ఆవిష్కరించారు. ‘ఛూ... మంతర్’లో భాగంగా ఇండియన్ మెర్లిన్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు టోనీ తెలిపారు. మింట్ టీ చిన్నారులు తమ అద్భుత నటనతో మిమ్మల్ని అలరిస్తారు. లామకాన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ ముందకు వస్తున్నారు. ద డిక్షనరీ సేల్స్‌గర్ల్, చిలి పెప్పర్ చిక్స్ షార్ట్, డూ యూ వర్క్ హియర్ అనే పేరిట మూడు నాటకాలతో కనులవిందు చేయనున్నారు. సుజానే పటేల్ ఆధ్వర్యం వహిస్తున్నారు. వివరాలకు.. 9885450022 వస్త్ర బోటిక్ ‘నిండైన భారతీయుత చీర కట్టులోనే ఉంటుంది. అందుకే చీరలంటే నాకెంతో ఇష్టం’ అన్నారు వూజీ వుంత్రి డీకే అరుణ. హివూయుత్నగర్లో ‘వస్త్ర బొటిక్’ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె హాజరయ్యారు.