పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..? | Will Discuss Panel Report In Parliament Says Pralhad Joshi - Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?

Published Fri, Sep 1 2023 1:08 PM | Last Updated on Fri, Sep 1 2023 1:42 PM

Will Discuss Panel Report In Parlament Says Pralhad Joshi - Sakshi

ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు.  

జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. 

'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు.  

నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. 

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement