discuss
-
ఏసీబీ అధికారుల భేటీపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తెచ్చుకుంది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టుఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్‌తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్‌తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వెళ్లి పుతిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్‌లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎందుకంటే..?
ఢిల్లీ:జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలు ఉంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది, ఆందోళన పడవద్దు అని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజండాపై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని ఆయన చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq — ANI (@ANI) September 1, 2023 జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీని నియమింటిన విషయం తెలిసిందే. అటు.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను జరపనున్నట్లు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. VIDEO | "How can the government take unilateral decisions without consultation with political parties and Parliament?" says CPI general secretary D Raja on reports of the central government forming a committee to explore the possibility of 'one nation one election'. pic.twitter.com/RXjYuI19Xx — Press Trust of India (@PTI_News) September 1, 2023 'ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు?. అందరి అభిప్రాయాలు తీసుకుని, చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి' కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ విమర్శించారు. నిష్పాక్షికమైన ఎన్నికలు కావాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు. VIDEO | "The country is already one, is anyone questioning that? We demand fair election, not 'one nation one election'. This funda of 'one nation one election' is being brought to divert the attention from our demand of fair election," says Shiv Sena (UBT) leader @rautsanjay61… pic.twitter.com/9phqvFiqCv — Press Trust of India (@PTI_News) September 1, 2023 ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
హైకోర్టు సలహాను పరిగణలోకి తీసుకోవాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని జేఏసీ నేతలు చర్చలకు వచ్చారని.. అని అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదన్నారు. చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. -
బంధం మరింత బలోపేతం కావాలి
వాషింగ్టన్: నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తూ దానిని బలోపేతం చేయాలని, కోవిడ్ మహమ్మారి, పర్యావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాలని అమెరికా, బ్రిటన్ నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించిన జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్‌తో ఉన్న ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన ఉద్దేశాన్ని విడమరిచి చెప్పారు. ‘జో బైడెన్‌తో మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. రెండు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహసంబంధాల్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. కోవిడ్ మహమ్మారిని జయించి సుస్థిరత ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు కృషి చేస్తాం’’ అని బైడెన్ శనివారం ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉన్న విభేదాల్ని త్వరలోనే పరిష్కరించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించినట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘నాటో కూటమిలో మళ్లీ కీలక పాత్ర పోషించేలా , ఇరు దేశాల మధ్య చాలా కాలంగా రక్షణ రంగంలో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసేలా మాత్రమే బైడెన్ దృష్టి సారించారు. అందుకే జాన్సన్‌తో మాట్లాడినప్పుడు ఇరు దేశాల ప్రత్యేక సంబంధాల గురించి మాత్రమే మాట్లాడారు’’ అని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడంపై బైడెన్‌ను జాన్సన్ అ«భినందించారు. కరోనా ముప్పు తొలగిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు బ్రిటన్ కార్యాలయం ప్రతినిధులు చెప్పారు. -
సమాలోచనల్లో తలైవా!
పార్టీ, సిద్ధాంతాల కసరత్తుల్లో భాగంగా మక్కల్ మండ్రం నిర్వాహకులతో సమాలోచనకు తలైవా రజనీకాంత్ నిర్ణయించారు. బుధవారం నుంచి చెన్నైలో మూడురోజుల పాటు ఈ భేటీ సాగనుంది. ఇందు కోసం మక్కల్ మండ్రం నిర్వాహకులను చెన్నైకు తరలిస్తున్నారు. సాక్షి, చెన్నై: రాజకీయ అరంగేట్రం చేసిన దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ కసరత్తుల్లో బిజీగా ఉన్నారు. తొలుత ఆధ్యాతిక పార్టీ అని ప్రకటించినా, తదుపరి పరిణామాలతో ఆధ్యాతికం అన్న పదాన్ని తొలగించారు. దీంతో రజనీకాంత్ పార్టీ రూపు రేఖలు, జెండా, సిద్ధాంతాల మీద సర్వత్రా ఆసక్తి పెరిగింది. మరో మూడు నాలుగు నెలల్లో కొత్త పార్టీ ప్రకటన సైతం ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీకి ముందుగా రజనీ మక్కల్ మండ్రం బలోపేతం దిశగా అడుగులు వేగం పెరిగింది. ఆ మండ్రంకు సభ్యుల చేరిక జోరందుకుంది. ఓ వైపు వెబ్ సైట్లోనూ, మరో వైపు స్వచ్ఛందంగానూ మద్దతు ప్రకటిస్తూ జన సందోహం కదలుతున్నారు. ప్రధానంగా పార్టీ అన్నది ప్రకటన తదుపరి కనీసంకోటి మంది సభ్యులు ఉండాలన్న సంకల్పంతో రజనీ ఉన్నట్టు సమాచారం. ఆ తదుపరి ఆ సంఖ్య రెండు కోట్లకు చేర్చే దిశలో ప్రజాకర్షన్ పేరు, జెండా, నినాదం, సిద్ధాంతాల రూపకల్పన మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆయా అంశాల గురించి చర్చించి, సమీక్షించేందుకు తలైవా నిర్ణయిం ఉండడంగమనార్హం. నేటి నుంచి మూడు రోజులు : పార్టీ, సిద్ధాంతాల గురించిన అన్ని వివరాలను మక్కల్ మండ్రం వర్గాలతో చర్చించేందుకు తలైవా నిర్ణయించారు. మూడు రోజులు పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న మక్కల్ మండ్రం వర్గాలతో ఈ భేటీ సాగనుంది. వారి అభిప్రాయాలు, సలహాలను రజనీ ఆదేశాల మేరకు నిర్వాహకులు తీసుకోనున్నారు. అన్ని అంశా>లపై సాగే ఈ భేటికి రజనీ వస్తారా లేరా అన్నది తేలాల్సి ఉంది. ముఖ్య నిర్వాహకులు మక్కల్ మండ్రం వర్గాలతో సమావేశమైనా, చివరకు రజనీకాంత్ అందర్నీ ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశం నిమిత్తం మక్కల్ మండ్రం వర్గాలు చెన్నైకు చేరుకునే పనిలో పడ్డారు. 15వ తేదీకి మారిన కమల్ ప్రయత్నం : రజనీ రాజకీయ పార్టీ కసరత్తుల వేగం పెంచి ఉంటే, మరో వైపు పార్టీ నమోదు తేదీని విశ్వ నటుడు కమల్ మార్చుకున్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి, తనపార్టీ పేరు, జెండా, సిద్ధాంతాల వివరాల్ని నమోదు చేయడానికి నిర్ణయించారు. అయితే, కొన్ని అనివార్యకారణాలతో తేదీ మార్చుకోకతప్పలేదు. కొన్ని ప్రక్రియలు ఆలస్యంగా సాగడంతో ఈనెల 15న (గురువారం) కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి, రిజిస్ట్రేషన్‌కు తగ్గ ప్రమాణ పత్రాలన్నీ సమర్పించేందుకు ఆయన మద్దతు నాయకులు చర్యలు చేపట్టారు. -
‘ఆ ఘనత నాదే’
వాషింగ్టన్ : కలహాలతో నిత్యం కీచులాడుకునే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ప్రతిపాదిత చర్చలు తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. ఉత్తర కొరియా దూకుడుకు తాను ఎప్పటికప్పుడు చెక్ పెట్టడం, కఠిన విధానాన్ని కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందని తనకు తాను కితాబిచ్చుకున్నారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తాను నిబద్ధతతో వ్యవహరించని పక్షంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చర్చల ఊసే ఉండేది కాదంటూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియాతో చర్చలకు తాను సిద్ధమేనని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో వచ్చేవారం ఉత్తర కొరియాతో ముఖాముఖి చర్చలకు దక్షిణ కొరియా ప్రతిపాదించింది. ట్రంప్, కిమ్ అణు సవాళ్ల నేపథ్యంలో తాజా చర్చల పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. న్యూక్లియర్ బటన్ తన టేబుల్ వద్దే ఉందని ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడి హెచ్చరికకు ట్రంప్ దీటుగా బదులిస్తూ తన వద్దా న్యూక్లియర్ బటన్ ఉందని, అవి సమర్ధంగా పనిచేస్తాయంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కమిటీల సూచనలను డిజైన్ల సంస్ధకు అందజేస్తాం
-
కీలకదశకు చేరిన ఫిరాయింపుల కేసు
-
'ట్రెడిషనల్ మీడియా ప్రాధాన్యం తగ్గలేదు'
-
ఫేస్బుక్ దుమారంపై జుకర్ వివరణ
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా సంస్థ ఫేస్ బుక్ పై చెలరేగిన ఆరోపణలపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రంగంలోకి దిగారు. రాజకీయ పక్షపాతం చూపిస్తున్నారంటూ రాజుకున్న వివాదంపై ఆయన ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. ట్రెండింగ్ టాపిక్స్ పై గోల్ మాల్ జురుగుతోందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన కన్సర్వేటివ్ పార్టీ నేతలతో సమావేశం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ సంస్థ పని తీరు తదితర అంశాల గురించి కొన్ని ఆలోచనలను షేర్ చెయ్యాలనుకుంటున్నా నంటూ ఫేస్ బుక్ లో తన భావాలను పంచుకున్నారు. తమ సంస్థ ఫేస్బుక్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఒక స్వరాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల నేపథ్యాల ఆలోచనలను, ప్రజల అనుభవాలను పంచుకున్నపుడే ఆ ప్రపంచం బావుంటుందని తాము నమ్ముతామన్నారు. అదే సోషల్ మీడియాను విశ్వవ్యాప్తం చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. ఒక తల్లీ బిడ్డ ఫోటోఅయినా, మేధో విశ్లేషణ అయినా తమకు సమానమే అని స్పష్టం చేశారు. అన్ని ఆలోచనా ధోరణలకు తమ సంస్థ ఫేస్ బుక్ ప్లాట్ ఫాంగా నిలవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ట్రెండింగ్ టాపిక్స్ డిజైన్ కఠినమైన మార్గదర్శకాలతో, విశ్వసనీయతతో కూడుకుందనీ, ఇందులో ఎలాంటి ప్రాముఖ్యతలకు, రాజకీయ భావాల అణచివేత ధోరణికి తావులేదని పేర్కొన్నారు. అలాంటి చర్యలను తాము అనుమతించమని తెలిపారు. కన్సర్వేటివ్ పార్టీ భావాలను తొక్కి పెడుతున్నామన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయనీ, దీనిపై పూర్తి స్తాయిలో విచారణ జరుగుతోందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు తేలితే... సంబంధిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇకముందు కన్సర్వేటివ్ నాయులు, ఇతర రాజకీయ నాయకులు తనతో మాట్లాడాలని ఆహ్వానించారు. కాగా టెక్నాలజీ న్యూస్ వెబ్ సైట్ గిజ్ మోడో ఫేస్ బుక్ ఉద్యోగులు ట్రెండింగ్ కథనాలను ప్రభావితం చేస్తున్నారని, కన్సర్వేటివ్ పార్టీకి అనుగుణమైన స్టోరీలను అణచివేస్తున్నారంటూ కథనాన్ని ప్రచురిచింది. దీంతో అమెరికాలోని పలువురు రాజకీయవేత్తలు, జర్నలిస్టులు ఫేస్ బుక్ పై మండిపడ్డారు. విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలపై జుకర్ వివరణ యివ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు అదేశించిన జుకర్, ఉద్యోగులకు కొన్ని మార్గదర్వకాలను జారీ చేసినట్టు సమాచారం. -
సమీప గతంతో సంభాషిద్దాం!
వర్తమాన తరానికి సుదూర గతం ఒక తాత్విక భూమిక. సమీప గతం కరదీపిక. 1858 నుంచి 1956 వరకు ఉన్న చరిత్ర అలాంటి కరదీపిక. ఇవాళ పడిన ముందడుగుకీ, ఎదురైన సంక్షోభాలకీ మూ లాలు ఈ సమీప గతంలోనే ఉన్నాయి. తెలుగు విశ్వ విద్యాలయం, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సంయుక్తంగా తీసుకువస్తున్న చరిత్ర పుస్తకాలలో ఏడవ వాల్యూం లోని అధ్యాయాలను పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని పిస్తుంది. ఆచార్య బి. కేశవనారాయణ సంపాదక త్వంలో వెలువడిన ఈ సంపుటంలో ప్రతి అంశం మనకు సుపరిచితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం చర్చిస్తున్న చాలా అంశాలకు మూ లాలు ఆ కాలానివే. అప్పటి పరిణామాల ఫలితాలే. 1858లో భారతదేశమే బ్రిటిష్ రాణి పాలన లోకి రావడం చరిత్రలో పెద్ద మలుపు. దీని ప్రభా వం నిజాం రాజ్యంలోను, ఆంధ్ర-రాయలసీమ ప్రాంతంలోను సమానంగానే ఉంది. ఆ తరువాత కాలం అనేక పరిణామాలకు ఆలవాలమైంది. ఇంగ్లి ష్‌తో పరిచయం కలిగి విశ్వవీక్షణం చేసిన తొలితరం మన ప్రాంతాలలో అప్పుడే అవతరించింది. విద్యతో పాటు, సేద్యం, నీటి పారుదల, పరిపాలన వంటి అంశాలు గుణాత్మకమైన మార్పులకు నోచు కున్న కాలం కూడా ఇదే. పరిశ్రమల స్థాపనకు పరిస్థి తులు దారితీసినది ఈ దశలోనే. భారత స్వాతం త్య్రోద్యమ ముఖ్య ఘట్టాలన్నీ ఈ యుగానివే. అవన్నీ తెలుగు ప్రాంతాలను విశేషంగానే తాకాయి. ఇదొక గొప్ప కదలిక. ఆ పరివర్తనను పరిచ యం చేస్తూ సంపుటి సంపాదకుడు రాసిన విస్తృత మైన అధ్యాయాన్ని మొదట పొందుపరిచారు. 1857కు ముందు ఈస్టిండియా కంపెనీ పాలనకీ, బ్రిటిష్ రాణి పాలనకు ఉన్న వ్యత్యాసాన్నీ, ఇది భార తీయ సమాజంతో పాటు తెలుగువారి మీద కూడా ఎలా ప్రతిబింబించిందో అందులో వివరించారు. తరువాత 63 అధ్యాయాలను రెండు విభాగాలలో ఆవిష్కరించారు. దాదాపు ప్రతి అంశం రెండు తెలుగు ప్రాంతాలలో పరిఢవిల్లిన తీరును, ప్రభా వితం చేసిన విధానాన్నీ వివరించడం విశేషం. ‘రాజకీయం, పరిపాలన, ఆర్థికవ్యవస్థ’ అన్నదే మొదటి విభాగం. ఆంధ్ర-రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్‌పాలనా వ్యవస్థ, ఇటు తెలంగాణలో నిజాం పాలన, సాలార్జంగ్ సంస్కర ణలు వంటి వాటి గురించి లోతుగా వివరించారు. వ్యవ సాయం, నీటి పారుదల, పారిశ్రామికాభివృద్ధి జరిగిన తీరును కూడా అక్షరబద్ధం చేయడం కనిపిస్తుంది. 1905 నుంచి, 1956 వరకు జరిగిన అన్ని కీలక ఉద్యమాలు, రాజ కీయ పరిణామాలను వేర్వేరు అధ్యాయాలలో వివ రించారు. తెలంగాణ ప్రాం తంలో ఎంఐఎం పుట్టుక, తెలంగాణ సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమాల గురించి కూడా చర్చించారు. ఇవే కాకుండా ఆంధ్రప్రాంతంలోని విశాఖ మన్యంలో అల్లూరి శ్రీరామరాజు సాగించిన పోరు, తెలంగాణలో గోండుల పోరు, ఇతర గిరిజన రైతాంగ పోరాటాలను కూడా సమగ్రంగా వివరిం చారు. సబాల్ట్రన్ అధ్యయనానికి తగ్గట్టు తెలుగు ప్రాంతాల గిరిజన తెగల చరిత్రను కూడా కూలం కషంగా చర్చించారు. ఇందుకోసం ఐదారు అధ్యా యాలు కేటాయించడం విశేషం. వీటితోపాటు ఉద్యమాలలో మహిళల పాత్ర, బ్రాహ్మ ణేతర ఉద్యమాలు కూడా అధ్యాయా లుగా చేరాయి. రెండో విభాగం (భాషా సాహిత్యాలు)లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల పత్రికల చరిత్ర, ఉర్దూ పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, జాతీయ సాహి త్యం, భావకవిత్వం, అభ్యుదయ సాహి త్యం, సంఘ సంస్కరణకు సాహిత్యం, దళిత సాహిత్యం వంటి అంశాలను వివ రించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకాలకు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్. ఒక ప్రాంతానికి సంబంధించిన సమగ్ర చారిత్రక దృశ్యం ఒకేచోట దర్శించే అవకాశం కల్పించిన సంపాదక మండలిని తెలుగువారంతా అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి ఏడవ సంపుటం - ‘ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్ (క్రీ.శ.1858-1956)’ (తెలుగు,ఇంగ్లిష్) నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా. వేదిక: తెలుగు విశ్వవిద్యాలయం. - కల్హణ -
వరద పరిస్థితులపై వైఎస్ జగన్ ఆరా
వరంగల్: వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆదుకోవాలని జగన్ సూచించారు. జనజీవనాన్ని వర్షాలు బాగా ఇబ్బంది పెట్టాయని, రహదారులు బాగా దెబ్బ తిన్నాయని జిల్లా అధ్యక్షులు జగన్‌కు వివరించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. -
రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ
పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రైతులను కాపాడే బాధ్యత తమపై ఉందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారపక్షం పేర్కొంటే.. విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, రైతులకు మద్దతు ధర ఇప్పించకుండా వారిని కష్టాల్లోకి నెడుతోందని విపక్షాలు విమర్శలకు దిగాయి. సోమవారం అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై వాడివేడిగా చర్చ సాగింది. పత్తి, మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో, కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని టీడీపీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రంతో, సీసీఐ చైర ్మన్తో మాట్లాడలేదని, విద్యుత్ విషయంలో కేంద్రమంత్రిని అడగలేదని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీటుగా స్పందించారు. రైతు సంక్షేమం కోసం, వారిని ఆదుకునేందుకు ఈ అంశంపై చర్చిస్తున్నామని, తొందరపడవద్దని సూచించారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎర్రబెల్లి అనగా.. ఈ దిక్కుమాలిన పరిస్థితిని రైతులకు కల్పించిందే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలేనంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను ఎదురుదాడి చేశానని ఎర్రబెల్లి అన్నారని, అదే ం సంస్కారమని ప్రశ్నించారు. ‘ఆ పార్టీలో ఉండటమే మీ ఖర్మ’ అంటూ దుయ్యబట్టారు. దాడి చేశారన్న పదాన్ని రికార్డులోంచి తొలగించాలని కోరారు. రైతు బిడ్డగా వారి కష్టాలు తనకు తెలుసునని దయాకర్‌రావు పేర్కొనగా.. ‘నీవు రైతు బిడ్డవు అయితే నేను డెరైక్టుగా రైతును’ అని సీఎం అన్నారు. ఇందుకు ‘నేను ఫామ్‌హౌస్ రైతును కాదు’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో బోర్లు వేయడం వల్ల పరిసర గ్రామాల్లో నీళ్లు లేకుండా పోయాయని, ఆ బోర్లు ఎవరు వేశారో అని ఎర్రబెల్లి అన్నారు. ఇందుకు మంత్రి ఈటెల కల్పించుకొని.. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని మండిపడ్డారు. దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటెల మధ్యలో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తనను అడ్డుకుంటున్నారని దయాకర్‌రావు అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు పలుమార్లు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. సర్కారు విఫలం: జీవన్‌రెడ్డి రుణాలు మాఫీ చేయటంలో రాష్ట్ర సర్కారు మీనమేషాలు లెక్కించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులు కరువై, దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ అయిదు నెలల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే 76 మంది చనిపోయారని.. గజ్వేలు నియోజకవర్గంలో 19 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఎర్రబెల్లికి ముందు జీవన్‌రెడ్డి ప్రసంగించారు. రైతు రుణాలు మాఫీ చేయటంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. ‘‘రూ.19 వేల కోట్లు మాఫీ చేస్తామని ఈ ప్రభుత్వమే చెప్పింది. 17 వేల కోట్లు మాఫీ చేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఖరీఫ్ పెట్టుబడుల సమయంలో పట్టించుకోకుండా సెప్టెంబర్ 28న రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రైతులు వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకున్నారు. 36 లక్షల మందికి రుణాలివ్వాల్సి ఉంటే.. 19 లక్షల మందికే రుణాలు పంపిణీ చేశారు. అక్టోబరు 15 వరకు కేవలం 8 వేల కోట్లు పంపిణీ చేశారు. ఇవన్నీ సర్కారు చెప్పిన లెక్కలే ’’ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేస్తే ఇప్పుడు మూడు నాలుగు గంటలకు మించి రావటం లేదని దుయ్యబట్టారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వారం రోజులైనా పట్టించుకోవటం లేదన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ స్పందిస్తూ... ‘నిరాధారమైరన అంభాడాలు వేయటం సరికాదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతు చేస్తున్నాం...’ అని అన్నారు. ‘‘వర్షాభావం.. పంటలు ఎండిపోతున్నాయంటూ ఒక పార్టీ బస్సుయాత్ర చేసింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు రావటం లేదంటూ మళ్లీ అదే పార్టీ మాట్లాడుతోంది.. అసలేం మాటలో ఏమో.. వాళ్లది నాలుకా.. తాటిమట్టనా..’’ అని హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘‘అసలేం మాట్లాడుతున్నారు.. ఎదురుదాడి చేస్తున్నారా..? అవేం మాటలు.. సభా మర్యాదలు పాటించాలి’’ అంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్ముల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని హరీష్‌రావు బదులివ్వడంతో జీవన్‌రెడ్డి ప్రసంగం కొనసాగించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం పెట్టిందని, విద్యుత్తు బకాయిలు రద్దు చేసి, కేసులన్నీ ఎత్తివేసిందని గుర్తు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తన వంతు బాధ్యతగా రూ.1.50 లక్షల పరిహారం అందించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులన్నింటికీ రూ.100 బోనస్ ప్రకటించాలని కోరారు. 352 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. ఇదీ ఆత్మహత్యల లెక్క జీవన్‌రెడ్డి మాట్లాడిన అంశాలపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నట్లుగా విపక్షాలు చెబుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఆత్మహత్యల వివరాలను వెల్లడించారు. 2004-05లో 816 మంది, 2005-06లో 452, 2006-07లో 360, 2007-08లో 270, 2008-09లో 250, 2009-10లో 196, 2010-11లో 132, 2011-12లో 151, 2012-13లో 116, 2013-14లో 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే బాధ్యతంతా తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో చేసిన తప్పులు ఇందుకు కారణమేనన్నారు. వయసు మళ్లిన రైతులకు ప్రత్యేక పథకం: పి.వెంకటేశ్వర్లు వయసు మళ్లిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఆత్మహత్యలు జరిగేవి కావు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలి. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలి. సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాలి’’ అని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన కరెంటులో వాటాను దక్కించుకోవడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలన్నారు. స్వతంత్ర కమిటీ ఏర్పాటుచేయాలి రైతుల ఆత్మహత్యలపై స్వతంత్ర నిజనిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ పేర్కొన్నారు. రైతుల రుణాలన్నీ ప్రభుత్వమే భరించాలని సీపీఎం నేత సున్న రాజయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారిపోయింది ‘ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. దూరదర్శన్‌లో గొర్రెల పెంపకం మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రి పాఠం చెప్పారు. హెడ్మాస్టార్ మాదిరి కేసీఆర్ చెప్పినట్లు మంత్రులకు పాఠం చెప్పారు. మేము వాకౌట్ చేస్తామని చెప్పినా స్పీకర్ మైక్ కట్ చేశారు. అయితే ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. - టీడీపీ శాసనసభపక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు బుల్డోజ్ యత్నం సరికాదు... ‘అధికారపక్షం సభలో ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తామంటే ప్రభుత్వం నామోషీగా భావించింది. ప్రతిపక్ష సభ్యుడు తన ప్రసంగాన్నిపూర్తిచేయకుండానే నలుగురు మంత్రులు అంతరాయం కలిగించడం అసెంబ్లీ చరిత్రలోనే చూడలేదు. - సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి ‘అమరవీరులకు ఇచ్చిన విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పంట నష్టపోయిన ఎకరాకు 25 వేలు ఇవ్వాలి. రబీలో కరెంటు సరిగా సరఫరా చేసి పంటలు కాపాడాలి. - బీజెఎల్పీ నేత లక్ష్మణ్ సీఎం అనవసర జోక్యం సీఎం కేసీఆర్ పదేపదే కల్పించుని సభ్యులు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని వెళ్లారు. - సీపీఐ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ రైతులను ఆదుకోవాలి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాలు రాబట్టుకునేందుకు అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి రాష్ట్రం హక్కుల సాధనకు పోరాడాలి. రైతులను ఆదుకోవాలి. - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లైన్ లాస్‌లు నివారించాలి ముఫ్పై ఏళ్ల కిందటి కండక్టర్లను మార్చి లైన్ లాస్‌లను నివారించాలి. టీడీపీ, బీజేపీలు కుట్ర చేసి భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలను విడదీశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పట్టించుకోవాలి. విద్యుత్తు సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి. - సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య -
నేడు ప్రత్యూష్‌సిన్హా కమిటీ భేటీ
-
కేబినెట్ ఎజెండాపై సీఎం చర్చలు
అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్ : ఈనెల 16న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు,ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతు రణమాఫీ, వృద్ధాప్య,వికలాంగుల పెన్షన్, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే బిల్లుకు లోకసభ ఆమోదించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దే చర్యలపై కూడా చర్చించారు. ఆయా శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలనన్నింటినీ సోమవారం సాయంత్రంలోపే జీఏడీకి పంపేలా చూడాలని, ఆయా శాఖలపై మంగళవారం తుది నిర్ణయం తీసుకుని ఎజెండా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరంతో పాటు, కృష్ణా జలాల పంపిణీ అంశంపై కూడా నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ అవసరమైతే మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. మురికివాడలులేని నగరంగా హైదరాబాద్ హైదరాబాద్‌లో మురికివాడలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మురికివాడల్లో నివసించే ప్రజలను ఎక్కడో నగరం బయటికి పంపకుండా వారు నివసిస్తున్న ప్రదేశంలోనే మౌలికసదుపాయాలతో పాటు జీవనప్రమాణాలు పెంచేలా ఇళ్లు నిర్మించాలని సూచించారు. దశలవారీగా దీనిని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక, మునిసిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. -
లంక కు పయనం
సాక్షి, చెన్నై: కడలిలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువైన విషయం తెలి సిందే. తరచూ శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వంతో జాలర్ల కుటుంబాలు తీవ్ర మనోవేదన చెందుతున్నాయి. దాడులు, బందీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా, కడలిలో పూర్తి స్థాయి భద్రత ధ్యేయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపల వేట సాగేలా శ్రీలంక - భారతదేశం మధ్య ఒప్పందాలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇరు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేశారు. తొలి విడత చర్చ చెన్నై వేదికగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది. చర్చలు రెండు దేశాల మధ్య సామరస్య పూర్వకంగా సాగాయి. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సంతృప్తికరంగా చర్చలు సాగినా ఇందులో చేసిన తీర్మానాల్ని గోప్యంగా ఉంచారు. మలివిడత చర్చల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మలి విడత చర్చలకు ముహూర్తాలు అచ్చి రాలేదు. మూడుసార్లు చర్చల తేదీ వాయిదా పడింది. ఓ మారు విమానం ఎక్కే సమయంలో చర్చలు వాయిదా పడడంతో ఇంక చర్చలు సాగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఎట్టకేలకు ముహూర్తం కుదరడంతో జాలర్ల సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 26 మందితో బృందం రాష్ట్రంలోని నాగపట్నం, రామేశ్వరం, తూత్తుకుడి, పుదుకోట్టై జాలర్ల సంఘాల ప్రతినిధులతో పాటుగా పుదుచ్చేరి, కారైక్కాల్ సంఘాల ప్రతినిధులు 17 మందితో బృందాన్ని రాష్ట్ర మత్స్య శాఖ ఎంపిక చేసింది. వీరంతా ఇది వరకు తొలి విడత చర్చల్లో పాల్గొన్న వారే. అలాగే మరో తొమ్మిది మంది అధికారుల్ని ఎంపిక చేశారు. 26 మంది ప్రతినిధులతో కూడిన ఈ బృందం ఎట్టకేలకు శ్రీలంకకు పయనమైంది. ఈ మేరకు శనివారం రాత్రి చెన్నైలోని మత్స్య శాఖ డెరైక్టరేట్లో ఆ విభాగం డెరైక్టర్ మునియాండి నేతృత్వంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో తొలివిడతలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల చుట్టూ చర్చ సాగినట్టు, వీటి అమలు లక్ష్యంగా మరిన్ని చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆదివారం ఉదయం కూడా మరో మారు సమావేశమైంది. రాత్రి చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు పయనమైంది. నేడు చర్చలు కొలంబో వేదికగా సోమవారం చర్చలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో తొలి విడత చర్చల్లో తీసుకున్న నిర్ణయాల అమలు లక్ష్యంగా శ్రీలంక ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు అంశాలపై ఆదేశ సర్కారు ఆమోదాన్ని జాలర్ల సంఘాల ప్రతినిధులు పొందారు. కొన్ని అంశాల్ని ఆ దేశ సర్కారు పక్కన పెట్టినట్టు వస్తున్న సంకేతాలతో మలి విడత చర్చ సత్ఫలితాల్ని ఇచ్చేనా అన్న ఉత్కంఠ నెలకొంది. మలి విడత చర్చే తుది విడత కావాలన్న తలంపుతో రాష్ట్ర ప్రతినిధుల బృందం కొలంబోకు వెళ్లింది. ఈ విషయంగా తమిళ జాలర్ల సంఘాల ప్రతినిధి ఇలంగో మీడియాతో మాట్లాడుతూ సామరస్య పూర్వక వాతావరణంలో చర్చలు ఫలితాన్ని ఇస్తాయన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. తొలి విడత చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఆ దేశ ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయాన్ని శ్రీలంక జాలర్లు ప్రకటించాల్సి ఉందన్నారు. -
రాజీనామాపై సీఎం మంతనాలు
మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాలు కీలకంగా మారాయి. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం శాసనసభపైన పడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు, తెలంగాణ బిల్లు పరిణామాలకు సంబంధించి సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి పలువురు సీమాంధ్ర మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసే అంశంపైనా వారితో చర్చించినట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కార్యాలయానికి చేరటం, ఆ వెంటనే ఆయన దానిపై సంతకం కూడా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు ఆదివారం రాత్రే సమాచారం అందింది. బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉందన్న సంకేతాలూ సీఎం వర్గీయులకు అందాయి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు రాజీనామా చేయాలా? లేకుంటే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించాక వైదొలగాలా? అన్న అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలో చర్చించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం శాసనసభ సమావేశం జరుగుతున్నందున బడ్జెట్ ఆమోదానికి ఆటంకం కలిగేలా సభానాయకుడిగా సీఎం రాజీనామా చేయటం సరికాదని అభిప్రాయపడినట్లు ఓ మంత్రి తెలిపారు. ఓటాన్ అకౌంట్ ఆమోదం పొందాక శాసనసభ వేదికగా సీఎం తన రాజీనామా ప్రకటన చేసే అవకాశముందని ఆ మంత్రి వివరించారు. ఇదిలావుంటే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ మంత్రుల నుంచి ఎదురయ్యే నిరసన గురించీ సీఎంతో భేటీలో చర్చించారు. తెలంగాణ నేతలు అసెంబ్లీలో నిరసనలకు దిగితే.. తిరస్కరణ తీర్మానం మాదిరిగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నూ మూజువాణి ఓటుతోనే ఆమోదింపచేయాలనే నిర్ణయానికి వచ్చారు. కేబినెట్‌ను బహిష్కరిద్దాం: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లును తిరస్కరిస్తూ ప్రభుత్వం తరఫున సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో తీర్మానం చేయించటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ మంత్రులు.. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. గత సమావేశాల చివరి రోజున విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు సీఎం రూల్ 77 కింద తీర్మానం ఇవ్వటం.. దానికి మంత్రివర్గ ఆమోదం లేనందున చెల్లుబాటు కాదని, తిరస్కరించాలని రూల్ 81 కింద తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు స్పీకర్‌కు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. స్పీకర్ మాత్రం సీఎం తీర్మానాన్ని అనుమతించడమే కాకుండా సభలో గందరగోళం నెలకొని ఉన్నా.. తీర్మానాన్ని తానే చదివి మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించిన విషయమూ విదితమే. దీనిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ మంత్రులు ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించటానికి సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం వేర్వేరుగా అంతర్గత చర్చలు సాగించారు. సోమవారం ఉదయం జరిగే మంత్రిమండలి సమావేశానికి వెళ్లకుండా ఆ భేటీ జరిగే గది ముందే బైఠాయించి నిరసనగా నినాదాలు చేయాలనే ఆలోచన చేశారు. శాసనసభలోనూ స్పీకర్ నాదెండ్లకు సహాయ నిరాకరణ చేయాలన్న వాదనా వచ్చింది. వీటిపై తెలంగాణ మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం తీరుకు నిరసనగా కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించటంతో పాటు అక్కడే నిరసనకు దిగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మరి కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారితే అది తెలంగాణకే నష్టం కలిగిస్తుందని మంత్రి జానారెడ్డి, ఇంకొందరు మంత్రులు వాదిస్తున్నట్లు సమాచారం. తమను, తెలంగాణ ప్రజల మనోభావాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరణ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికమని దీనిని తాము తప్పనిసరిగా సభలో లేవనెత్తుతామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా టీ మంత్రులకు ఫోన్ చేసి కేబినెట్ సమావేశాన్ని బహిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. నేటి నుంచి నాలుగు రోజుల భేటీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమెదానికి అసెంబ్లీ, శాసనమండలి సోమవారం నుంచి సమావేశం కానున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. 11వ తేదీ మినహా తక్కిన మూడు రోజులు సమావేశాలుంటాయి. సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం తెలిపారు. -
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
-
తెలంగాణ విభజనపై చర్చ
-
సమైక్య సమరం