పార్టీ, సిద్ధాంతాల కసరత్తుల్లో భాగంగా మక్కల్ మండ్రం నిర్వాహకులతో సమాలోచనకు తలైవా రజనీకాంత్ నిర్ణయించారు. బుధవారం నుంచి చెన్నైలో మూడురోజుల పాటు ఈ భేటీ సాగనుంది. ఇందు కోసం మక్కల్ మండ్రం నిర్వాహకులను చెన్నైకు తరలిస్తున్నారు.
సాక్షి, చెన్నై: రాజకీయ అరంగేట్రం చేసిన దక్షిణ భారత చలనచిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ కసరత్తుల్లో బిజీగా ఉన్నారు. తొలుత ఆధ్యాతిక పార్టీ అని ప్రకటించినా, తదుపరి పరిణామాలతో ఆధ్యాతికం అన్న పదాన్ని తొలగించారు. దీంతో రజనీకాంత్ పార్టీ రూపు రేఖలు, జెండా, సిద్ధాంతాల మీద సర్వత్రా ఆసక్తి పెరిగింది. మరో మూడు నాలుగు నెలల్లో కొత్త పార్టీ ప్రకటన సైతం ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీకి ముందుగా రజనీ మక్కల్ మండ్రం బలోపేతం దిశగా అడుగులు వేగం పెరిగింది.
ఆ మండ్రంకు సభ్యుల చేరిక జోరందుకుంది. ఓ వైపు వెబ్ సైట్‌లోనూ, మరో వైపు స్వచ్ఛందంగానూ మద్దతు ప్రకటిస్తూ జన సందోహం కదలుతున్నారు. ప్రధానంగా పార్టీ అన్నది ప్రకటన తదుపరి కనీసంకోటి మంది సభ్యులు ఉండాలన్న సంకల్పంతో రజనీ ఉన్నట్టు సమాచారం. ఆ తదుపరి ఆ సంఖ్య రెండు కోట్లకు చేర్చే దిశలో ప్రజాకర్షన్ పేరు, జెండా, నినాదం, సిద్ధాంతాల రూపకల్పన మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆయా అంశాల గురించి చర్చించి, సమీక్షించేందుకు తలైవా నిర్ణయిం ఉండడంగమనార్హం.
నేటి నుంచి మూడు రోజులు :
పార్టీ, సిద్ధాంతాల గురించిన అన్ని వివరాలను మక్కల్ మండ్రం వర్గాలతో చర్చించేందుకు తలైవా నిర్ణయించారు. మూడు రోజులు పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న మక్కల్ మండ్రం వర్గాలతో ఈ భేటీ సాగనుంది. వారి అభిప్రాయాలు, సలహాలను రజనీ ఆదేశాల మేరకు నిర్వాహకులు తీసుకోనున్నారు. అన్ని అంశా>లపై సాగే ఈ భేటికి రజనీ వస్తారా లేరా అన్నది తేలాల్సి ఉంది. ముఖ్య నిర్వాహకులు మక్కల్ మండ్రం వర్గాలతో సమావేశమైనా, చివరకు రజనీకాంత్ అందర్నీ ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశం నిమిత్తం మక్కల్ మండ్రం వర్గాలు చెన్నైకు చేరుకునే పనిలో పడ్డారు.
15వ తేదీకి మారిన కమల్ ప్రయత్నం :
రజనీ రాజకీయ పార్టీ కసరత్తుల వేగం పెంచి ఉంటే, మరో వైపు పార్టీ నమోదు తేదీని విశ్వ నటుడు కమల్ మార్చుకున్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి, తనపార్టీ పేరు, జెండా, సిద్ధాంతాల వివరాల్ని నమోదు చేయడానికి నిర్ణయించారు. అయితే, కొన్ని అనివార్యకారణాలతో తేదీ మార్చుకోకతప్పలేదు. కొన్ని ప్రక్రియలు ఆలస్యంగా సాగడంతో ఈనెల 15న (గురువారం) కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి, రిజిస్ట్రేషన్‌కు తగ్గ ప్రమాణ పత్రాలన్నీ సమర్పించేందుకు ఆయన మద్దతు నాయకులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment