సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్‌ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.
మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.
కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్‌కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తెచ్చుకుంది.
ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్‌ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది.
తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్ లీగల్ టీం, బీఆర్‌ఎస్ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment