
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని జేఏసీ నేతలు చర్చలకు వచ్చారని.. అని అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదన్నారు.
చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు
ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.