ఢిల్లీ: జమిలి ఎన్నికలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లా కమిషన్ తన సూచనలను అందించనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కావాల్సిన సలహాలు, సూచనలను అందించాలని ఉన్నతస్థాయి కమిటీ గత వారం నిర్వహించిన భేటీలో కోరింది. ఈ నేపథ్యంలో లా కమిషన్‌తో పాటు మిగిలిన సభ్యులు నేడు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు.
అందరి సూచనలను తీసుకున్న తర్వాత ఉన్నతస్థాయి కమిటీ మరోసారి చివరిగా భేటీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2న ఎనిమిది మందితో కూడిన ఉన్నస్థాయి కమిటీని జమిలి ఎన్నికల పరిశీలనకు కేంద్రం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశమైంది.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే జమిలి విధానం తీసుకువస్తున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.
ఇదీ చదవండి: మన దౌత్యం...కొత్త శిఖరాలకు
Comments
Please login to add a commentAdd a comment