law commission
-
One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్‌కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది. -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లా కమిషన్ తన సూచనలను అందించనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కావాల్సిన సలహాలు, సూచనలను అందించాలని ఉన్నతస్థాయి కమిటీ గత వారం నిర్వహించిన భేటీలో కోరింది. ఈ నేపథ్యంలో లా కమిషన్‌తో పాటు మిగిలిన సభ్యులు నేడు తమ సూచనలను కమిటీకి అందించనున్నారు. అందరి సూచనలను తీసుకున్న తర్వాత ఉన్నతస్థాయి కమిటీ మరోసారి చివరిగా భేటీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2న ఎనిమిది మందితో కూడిన ఉన్నస్థాయి కమిటీని జమిలి ఎన్నికల పరిశీలనకు కేంద్రం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే బీజేపీ జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే జమిలి విధానం తీసుకువస్తున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఇదీ చదవండి: మన దౌత్యం...కొత్త శిఖరాలకు -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సమాధానమిచ్చారు. న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల అంశంపై పరిశీలన చేసిందని అర్జున్ రామ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు అనే అంశం దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్రం తెరమీదకు తీసుకువచ్చింది. ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
ఉమ్మడి పౌర స్మృతిపై 8.5 లక్షల ప్రతిస్పందనలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఇప్పటిదాకా ప్రజల నుంచి 8.5 లక్షల ప్రతిస్పందనలు తమకు అందాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూ రాజ్ అవస్తీ బుధవారం చెప్పారు. యూసీసీపై అభిప్రాయాలు తెలియజేయాలని రెండు వారాల క్రితం లా కమిషన్ కోరిన సంగతి తెలిసిందే. యూసీసీపై రాజకీయ పక్షాలు, మత సంస్థలు, ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండడం సమంజసం కాదని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతికి ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మద్దతు పలికింది. అయితే, ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని సూచించింది. -
ఆ చట్టాన్ని కొనసాగించాల్సిందే..అదే ఐక్యతను కాపాడుతోంది!
రాజద్రోహం చట్టం గురించి లాకమిషన్ ఒక ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తే సరిపోతుందని లా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికలో సూచనలిచ్చింది. ఆ చట్టమే భారతదేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఉపకరిస్తోంది, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేగాదు రాజద్రోహం కేసులో విధించే జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కమిషన్ నివేదికలో ప్రభుత్వాన్ని సూచించింది కూడా. రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లపై అభిప్రాయన్ని చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నేపథ్యంలో ఈ నివేదికి రావడం గమనార్హం. వలసవాద వారసత్వంగా ఉన్న రాజద్రోహం రద్దుకు సరైన కారణం లేదని జస్టిస్ రీతు రాజ్ అవస్తీ(రిటైర్డ్) నేతృత్వంలోని లా కమిషన్ పేర్కొంది. ఈ చట్టాన్ని తరుచు వలసవాద వారసత్వంగా చెబుతుంటారు. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా ఉపయోగించిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవానికి న్యాయవ్యవస్థ మొత్తం వలసవాద వారసత్వమే అని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై అభిప్రాయాలను స్వీకరించామని, వాటిని అరికట్టేలా మోడల్ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయాలని సిఫార్సు చేస్తున్నామని నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 124ఏకి కింద నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు.. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ 1973 సీర్పీసీ సెక్షన్ 196(3)కి సమానమైన సీర్పీసీ 154 సెక్షన్‌ని ఒక నిబంధనగా ప్రత్యామ్నాయంగా చేర్చవచ్చని సూచించింది. ఇది అవసరమైన విధానపరమైన భద్రతను అందిస్తుంది అని లా కమిషన్ చైర్మన్ అవస్తీ.. న్యాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్కు తన నివేదికలో తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపా చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాలు ఐపీసీ సెక్షన్ 124ఏ కింద సూచించబడిన నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయదని అందువల్ల రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్ నొక్కి చెప్పింది. ఇదిలా ఉండగా దేశద్రోహ చట్టం హేతుబద్ధతను పునఃపరిశీలిస్తామని చెబుతూ కేంద్రం అఫడవిట్ దాఖలు చేయమడే గాక రాజ్యంగ చెల్లుబాటును నిర్ధారించే కసరత్తును వాయిదావేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు వలస రాజ్యాల కాలం నాటి నిబంధననను గట్టిగా సమర్థించడం తోపాటు దానిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఈ చట్టాన్ని పునఃపరిశీలించేందుకు అంగీకరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక తాజా పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గతేడాది దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాది కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వలసరాజ్యల యుగం నాటి చట్టం గురించి ప్రస్తావించారు. ఆ చట్ట ప్రయోజనాన్ని మించి పోయి ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు. కాగా, బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. (చదవండి: ఐక్య ప్రతిపక్షం ఒంటరిగా బీజేపీని మట్టికరిపిస్తుంది: రాహుల్ గాంధీ) -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
‘జమిలి’కి లా కమిషన్ ఓకే
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ కమిషన్ మద్దతు తెలిపింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని సూచించింది. దేశంలో ఏడాది పొడవునా నెలకొంటున్న ఎన్నికల వాతావరణాన్ని నిరోధించాలంటే జమిలియే మార్గమని అభిప్రాయపడింది. లా కమిషన్ మూడేళ్ల గడువు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో ఒకరోజు ముందు జమిలి ఎన్నికలపై ముసాయిదా నివేదికను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసింది. ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిని సమర్పించింది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. ‘జమిలి ఎన్నికలతో ప్రజా ధనం ఆదా అవుతుంది. పాలనా, భద్రతా అధికారులపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుచేయడానికి వీలవుతుంది’ అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ(జమ్మూ కశ్మీర్ మినహా) ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న మూడు అవకాశాలను సూచించింది. మొదటి అవకాశం.. ► కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కుదించి, మరికొన్నింటి గడువును పొడిగిస్తే 2019లో లోక్‌సభతో పాటు 12 రాష్ట్రాల(తెలంగాణ, ఏపీ సహా) అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చు. ఇందుకోసం రాజ్యాంగంలోని నిబంధన 172కు సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఇక మిగిలిన పదహారు రాష్ట్రాలకు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి 2019లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. వాటన్నింటికి 2021 సంవత్సరంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది. ► అది సాకారం కావాలంటే బిహార్ అసెంబ్లీ గడువును 13 నెలలు పెంచాలి. కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితిని 17 నెలలు కుదించాల్సి వస్తుంది. ► 2021 ఎన్నికల్లో కొలువుదీరే అసెంబ్లీల గడువు 30 నెలలు లేదా జూన్ 2024 వరకు(ఏది ముందైతే అది) ఉంటుంది. ఇలా అయితేనే 2024లో అన్ని అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది. రెండో అవకాశం.. 2019లో లోక్‌సభ, 12 అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి, 2021లో మిగిలిన 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి. దీంతో ఐదేళ్లకోసారి రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి. మూడో అవకాశం.. పై రెండు మార్గాల్లో జమిలి సాధ్యంకాని పక్షంలో ఒక ఏడాదిలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని(అసెంబ్లీ, లోక్‌సభ) ఒకేసారి నిర్వహించాలి. -
‘జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలి’
సాక్షి, న్యూఢిల్లీ : లా కమిషన్ జమిలి ఎన్నికలపై 164 పేజీల ముసాయిదా నివేదికను విడుదల చేసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడింది. ఏకకాల ఎన్నికల్లో అనేక జటిలమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంది. కేంద్రానికి సిఫారసు చేసే ముందు అన్ని వర్గాలు మరింత చర్చ జరపాలని కోరింది. లా కమిషన్ ఏకకాల ఎన్నికలపై చర్చకు ఏడు అంశాలను లేవనెత్తింది. లా కమిషన్ చర్చకు ఉంచిన ఏడు అంశాలు : ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందా? హంగ్ అసెంబ్లీ, పార్లమెంటు ఏర్పడిన సమయంలో పరిస్థితి ఏమిటి ? అటువంటి సమయంలో పదో షెడ్యూల్‌ను సవరించాలా ? ఏకకాల ఎన్నికలు ఆలోచన మంచిదే అయినా ఆచరణాత్మక విధానం ఏమిటి ? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సవరించాలి ? ముసాయిదా నివేదికలో చర్చించిన అంశాలు కాకుండా ఇంకా మరి ఏమైనా విషయాలు పరిశీలించాల్సి ఉందా? ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా ? ఈ ఏడు అంశాలపై మరింత చర్చ అవసరమని, అన్ని వర్గాలు దీనిపై చర్చించిన తర్వాతే కేంద్రానికి తుది సిఫారసు చేస్తామని తేల్చిచెప్పింది. -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ ముసాయిదా నివేదిక
-
ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సాధ్యమేనా?
న్యూఢిల్లీ: ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా తమ ఇళ్ల నుంచే కంప్యూటర్ల ద్వారా ఈ–ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చా? అని లా కమిషన్‌ను కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. తమకు అందిన సమాచారం కేసు పెట్టదగినదే అయితే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ–ఎఫ్ఐఆర్పై అభిప్రాయాన్ని చెప్పాలని లా కమిషన్‌ను హోంశాఖ కోరింది. ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా ఇంటి నుంచి ఫిర్యాదు చేయాలంటే సీఆర్పీసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని కమిషన్ సూచించింది. ఈ విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన బాధ తప్పుతుందని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు తప్పుడు అభియోగాలు చేసేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు దుర్వినియోగం చేసే అవకాశముందని హెచ్చరించింది. -
‘ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు’పై సానుకూలత
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదుకు సంబంధించి కీలక ముందడుగు పడనుంది. ఘటనపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అంశంపై కేంద్ర హోం శాఖ.. లా కమిషన్ సలహా కోరింది. దీనిపై స్పందించిన లా కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని తెలిపింది. అయితే, ఆన్లైన్ విధానంలో ఫిర్యాదు స్వీకరణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా ఇతరుల పరువుకు భంగం కలిగించేందుకు ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేసే వీలుందని పేర్కొంది. ఆన్లైన్లో ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామని తెలిపింది. ఒకవేళ ఈ-ఎఫ్ఐఆర్కు అనుమతిస్తే దాని అమలుకు సంబంధించి ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ జరగాలని న్యాయశాఖ మాజీ సెక్రటరీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, 2013లో లలితా కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీం కోర్టు.. సీఆర్పీసీలోని సెక్షన్ 154 ప్రకారం తీవ్రమైన, ప్రాథమిక విచారణ అవసరంలేని నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని పేర్కొంది. సీఆర్పీసీలోని సెక్షన్ 154 కు సవరణలు చేస్తే ఈ-ఎఫ్ఐఆర్కు మార్గం సుగమం అవుతుందని గత జనవరిలో జరిగిన సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఈ సమావేశ సూచనల ప్రాతిపదికగా హోంశాఖ.. లా కమిషన్ సలహా కోరింది. ‘బాధితులు నేరుగా వెళ్లి పోలీసులని ఆశ్రయించి ఘటన గురించి వివరించడం కష్టమైన పనే. ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం చాలా సులభం. కానీ, పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తులు లేదా బాధితులు మాతో అబద్ధం చెప్పడానికి సంశయిస్తారు. నేరుగా ఫిర్యాదు స్వీకరించడం వల్ల ఫిర్యాదుదారుడి వైఖరి తెలుసుకునే వీలుంటుంద’ని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉపయోగకరమే.. కానీ..! హోంశాఖ అభిప్రాయాలను మానవ హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ స్వాగతించారు. ఎంతోమందికి ‘ఆన్లైన్లో ఫిర్యాదు’ విధానం మేలు చేకూరుస్తుందని అన్నారు. అయితే, బాధితుల దగ్గరనుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకున్న అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు కావాలని ఆలస్యం చేయొచ్చని వ్యాఖ్యానించారు. పేదప్రజలకు ఆన్లైన్ సేవలు పొందడం ఇబ్బందిగా మారొచ్చని అన్నారు. -
‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్ చివరి నాటికి, వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి. ఈ నెలలోనే జమిలిపై నివేదిక లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్ ఇప్పటికే చెప్పింది. -
జమిలికి లా కమిషన్ జై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఏకకాల ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు లా కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఆగస్ట్ 31లోగా కమిషన్ సమర్పించే తుది నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా కీలక సిఫార్సులు ఉంటాయని భావిస్తున్నారు. జమిలిపై పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిషన్ కూలంకషంగా చర్చించిన లా కమిషన్ దీని అమలుకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు అవిశ్వాస తీర్మానం సందర్భంగా సానుకూల ఓటును కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వీగిపోయిన ప్రభుత్వం స్ధానంలో కొత్త సర్కార్ కొలువయ్యే జర్మనీ మోడల్‌ను కూడా లా కమిషన్ అథ్యయనంచేసిందని అధికారులు చెబుతున్నారు. జమిలి ఎన్నికల కోసం ఫిరాయింపు నిరోధక చట్టంలోనూ సవరణలు అవసరమని, పార్లమెంటరీ పద్ధతులు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని సవరణలు చేపట్టాల్సి ఉంటుందని, వీటికి సంబంధించిన వివరాలను కూడా తుది నివేదికలో లా కమిషన్ పొందుపరచనుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు తుది నివేదిక ముసాయిదాను లా కమిషన్ పది రోజుల ముందు సభ్యులందరికీ అందించి వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నివేదికకు తుదిమెరుగులు దిద్దనుంది. -
లోక్‌సభతోపాటు 11 రాష్ట్రాలకూ ఎన్నికలు!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటే 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ న్యాయ కమిషన్‌కు పార్టీ చీఫ్ అమిత్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే (మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్) రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. బిహార్ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ బీజేపీ ఆలోచనకు మద్దతు తెలుపుతుండటంతో.. బిహార్‌ను ఈ జాబితాలో కలుపుతారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. ఏకకాల ఎన్నికలకు బీజేపీ మద్దతు దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, దేశమంతా ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం ఉండకుండా చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖను సోమవారం పార్టీ నేతలు లా కమిషన్‌కు అందజేశారు. ఏకకాలంలో ఎన్నికలు ఆలోచన మాత్రమే కాదు. ఆచరించదగింది కూడా అని పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఎన్నికలు జరపడం వల్ల దేశ సమాఖ్య విధానం మరింత బలోపేతం అవుతుందని లేఖలో షా తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదన్నారు. తరచూ ఎన్నికలు పెడితే ఎన్నికల నియమావళి అమలవుతుందని, ఆ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు, విధాన నిర్ణయాలకు అవరోధం కలుగుతుందని తెలిపారు. ఏకకాల ఎన్నికలపై ప్రతిపక్షాల వ్యతిరేకత రాజకీయపరమైనదిగా కనిపిస్తోందన్నారు. అధికార ఎన్డీఏ పక్షంతోపాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. -
ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే...
ఈ దేశంలో జూదాన్ని సాధికారికం చెయ్యడానికి లా కమిషన్ కావలసినన్ని సరదా అయిన సూచనలి చ్చింది. ఓ ఆంగ్ల దిన పత్రిక ఆ వ్యవహారాన్ని పతాక శీర్షికగా ప్రకటించింది. లా కమిషన్ అధ్యక్షులు– మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎస్ చౌహాన్, మిగతా సభ్యులు జూదాన్ని దేశంలో అందరికీ అందుబా టులో ఉండేలాగ పురాణాలు, న్యాయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, మౌలిక రచన అన్నిటినీ కలిపి– లకోటా కొట్టేసి–ఒక గొప్ప కషాయాన్ని సిద్ధం చేశారు. ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే– కురుక్షేత్ర సంగ్రామానికి సరికొత్త ప్రయోజనం ఉండేది. ఈ విషయమై ఈ పత్రికే ఎడిటోరియల్ కూడా రాసింది. ధర్మరాజు అసలు తమ్ముళ్లను తాకట్టు పెట్టడమేమిటి? మహారాణిని జూదంలో ఫణంగా పెట్టడమేమిటి? దీనికి సమాధానం ఓ చదువుకున్న పాఠకుడు ఉత్తరం ద్వారా ఈ పత్రికలోనే తెలియజే శాడు. జూదానికీ డబ్బున్నవారి సరదాలకీ దగ్గర తోవ ఉన్నదని ఈ ఉత్తరం సారాంశం. చక్రవర్తులు కనుక– బాగా హోదా, ఐశ్వర్యం ఉన్నది కనుక– ఓ హద్దు దాటారు. మహారాణిని జూదంలో తాకట్టు పెట్టిన కారణంగానే వ్యాసుడు ‘మహాభారతాన్ని’ రచించి ఉంటాడు. ఆ స్థానంలో పనిచేసే గేట్ కీపర్ తన మర దలిని ఈ పని చేస్తే– ‘మహాభారతం’ మాట దేవు డెరుగు– దండనకి గురి అయ్యేవాడేమో? కనుక 2018లో ఈ కమిషన్ ఓ గొప్ప సూచన చేసింది. వారి సూచనల సారాంశం. మనకి మహారా ణుల్ని జూదంలో ఫణంగా పెట్టే సంప్రదాయం ఉన్న కథలున్నాయి. పురాణాలున్నాయి. కనుక జూదాన్ని చిన్నచూపు చూడటం మంచిది కాదు. ఏ ఎండకా గొడుగులాగ, ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో అందు బాటులో ఉన్న జూదాన్ని సాధికారికం చెయ్యాలి. ముఖ్యంగా జూదం ఆడే వ్యక్తి పాన్‌కార్డు, ఆధార్ కార్డు నంబర్లు గ్రహించండి. అది క్రికెట్ అయినా (ముఖ్యంగా క్రికెట్ కారణంగా నల్ల జేబుల్లోకి మాయమవుతున్న కోట్ల ఆదాయాన్ని ఖజానా మార్గం పట్టించాలని), గుర్రాలైనా, కోడి పందాలైనా, మరే జూదమైనా– వారి స్థాయికి తగ్గట్టు వారు ఆడు కోవచ్చును. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ‘లాట రీ’లు నడిపిన సందర్భాలు మరిచిపోకూడదు. కొన్ని నేరాల్ని బొత్తిగా రూపుమాప లేనప్పుడు– వాటిని అదుపులో ఉంచే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. మనకి యుధిష్టిరులు, ద్రౌపదులు ఉండే రోజులు పోయాయి. విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు నిల దొక్కుకునే రోజులు వచ్చాయి. సజావైన మార్గ నిర్దేశం జరిగినప్పుడు– అవి నీతి– మన చెప్పు చేతల్లో ఉండగల ‘నీతి’గా మారు తుంది. ఇంతకూ జూదానికి మనకి మార్గదర్శకం ఎవరు? ధర్మరాజు. మహాభారతం. మహాభారతం రకరకాల కారణాలకి గొప్పదని మన పండితులు చెప్పగా మనం విన్నాం. చదువుకు న్నాం. కానీ 2018లో మహా భారతంలో ‘జూదం’ చట్టానికి కొంగు బంగారం అవుతుందని మనం ఏనాడూ ఊహించలేదు. మహాభారత కథలపై ఎన్నో సినీమాలు వచ్చాయి, నవలలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి– కానీ ఆనాటి ప్రభుత్వం ‘జూదా’న్ని చట్ట పరం చేయడం కారణంగా ఓ మహత్తరమైన రచనకు మూలకారణం అయిందని మనం ఏనాడూ ఆలోచిం చలేకపోయాం. నాదొక పిచ్చి ఆలోచన. శ్రీకృష్ణుడికి ఇలాంటి జూదం పిచ్చి లేదా? ఉంటే ఆయనకి 8 మంది భార్యలు. 8 రకాలైన మహాభారతాలు వచ్చేవి. లేదా తమ రాజ్యంలో జూదం చట్టబద్ధం కాదేమో? ఎంత సేపూ– సుఖంగా పెళ్లాలతో గడుపుతూ ఓడిపోయిన వారికి చీరెలు ఇచ్చే పనితో సరిపెట్టుకున్నారు. నేను లా కమిషన్ ధోరణిలో ఆలోచిస్తున్నానని తమరు గ్రహించాలి. మహాభారతానికి కథా నాయకత్వం వహించలేని శ్రీకృష్ణుడి కథని మనం హెచ్చరికగా గ్రహించాలి. తప్పించడానికి వీలులేని జూదానికి సరసమైన ఉదాహరణగా ‘మహాభారతాన్ని’ ఉదహరించగల లా కమిషన్ని, దాని అధ్యక్షులు చౌహాన్ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే మహా భారతానికి ‘జూదా’న్ని ప్రోత్సహించే ప్రయోజనం ఉన్నదని ఇన్ని వేల సంవత్సరాలు గుర్తించని పండి తులకు శిక్ష వెయ్యాలని నేను లా కమిషన్‌ను అర్థిస్తున్నాను. ముందు పండిత సభల్ని ఏర్పాటు చేసి– జూదం మీద శతకాలు రాయించండి. ప్రబం ధాలు పలికించండి. సాహిత్యానికి సాహిత్యమే విరుగుడు. శతాబ్దాలపాటు ఈ జాతిని ప్రభావితం చేసిన మహా భారతం ఇన్నాళ్లకి జూదానికి మార్గదర్శకం కావడం మన న్యాయమూర్తులు మనకి పెట్టిన భిక్ష. గొల్లపూడి మారుతీరావు -
జమిలి ఎన్నికలకు సిద్ధమే
సాక్షి, న్యూఢిల్లీ: దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం ఢిల్లీలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను కలసి జమిలి ఎన్నికలపై వైఎస్సార్ సీపీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ 10 పేజీల లేఖను అందజేశారు. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయని, మధ్యలో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది కుదరలేదని అందులో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై మళ్లీ ఇప్పుడు లా కమిషన్ అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడాన్ని వైఎస్సార్ సీపీ అభినందించింది. తరచూ ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకాలు 2014లో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలతో పాటు జరగగా అనంతరం ఇప్పటి వరకు నాలుగేళ్లలో 15 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఇలా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలగడంతోపాటు అధికార యంత్రాంగం అంతా పాలనాపరమైన అంశాలను పక్కనపెట్టి ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతోందని, దీనివల్ల ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాయని పార్టీ వివరించింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయం భారీగా పెరుగుతోందని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2009 ఎన్నికల నిర్వహణకు రూ. 1,100 కోట్లు, 2014 ఎన్నికలకు రూ. 4 వేల కోట్లు ఖర్చు కాగా ఇక 2019 ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చని లేఖలో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసులు తగ్గుతాయి.. జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గిపోవడమే కాకుండా అవినీతి తగ్గుతుందని, ఓటుకు కోట్లు లాంటి కేసులు తగ్గిపోతాయని, సమాజాన్ని విడగొట్టే కుల సమీకరణాలు తగ్గిపోతాయని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల ఏటా ఎన్నికల ప్రచారాలకు రాష్ట్రాల్లో తిరగాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టవచ్చని వైఎస్సార్ సీపీ లేఖలో పేర్కొంది. 1999లోనే జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ తన 170వ రిపోర్టులో దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేసిందని గుర్తు చేసింది. 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని పేర్కొంది. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.. మరోవైపు జమిలి ఎన్నికల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైఎస్సార్ సీపీ తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గినా రాజకీయ పార్టీల ఖర్చులు తగ్గుతాయన్న దానిపై హామీ లేదని, పార్టీలు ఒకేసారి మొత్తం నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. జమిలి విధానంలో ఐదేళ్లకు ఒకసారే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు మధ్యలో తీర్పు చెప్పే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంది. ఆర్టికల్ 83(2), 172 ప్రకారం ఏదైనా ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించే అధికారం ఉంటుందని, కానీ జమిలి ఎన్నికల వల్ల ఆ విధానాన్ని విస్మరించే అవకాశం ఉందని, ఇంకా కాలపరిమితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను జమిలి ఎన్నికలకు ఎలా ఒప్పిస్తారు? జమిలి ఎన్నికల తరువాత ఒకవేళ అవిశ్వాసం వల్ల ఏదైనా ప్రభుత్వం రద్దై ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ విషయాల్లో రాజ్యాంగ సవరణ అవసరమని, అది అంత సులువైనది కాదని పేర్కొంది. దీనిపై లా కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల వల్ల తలెత్తే సమస్యలన్నింటిని పరిష్కరించి ఈ విషయంలో ముందుకెళ్లాలని, లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. రాజ్యసభకు ఎలాగైతే ఆరేళ్ల కాలపరిమితితో మధ్యలో ఖాళీ అయితే మిగిలిన సమయానికి మాత్రమే ఏ రకంగా ఎన్నిక జరుగుతుందో అలాగే ఎన్నికలు జరిగేలా సిఫార్సు చేస్తామని లా కమిషన్ చెప్పినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించే సభ్యులపై 30 రోజుల్లోగా వారి సభ్యత్వాలు రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కోరింది. ఈ అధికారాన్ని స్పీకర్లకు కాకుండా ఎన్నికల కమిషన్‌కే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అధికారాలు స్పీకర్ల వద్ద ఉండటంతో అధికార పార్టీల వల్ల అవి దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఈ సవరణలు అత్యవసరం అని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. -
ప్రభుత్వ జూదశాలలకు చట్టబద్ధతా?
దేశానికి మేలు చేసేలా న్యాయ సంస్కరణలను ప్రతిపాదించాల్సిన భారత న్యాయ కమిషన్ జూదాన్ని చట్టబద్ధం చెయ్యాలని సిఫార్సు చెయ్య డం హాస్యాస్పదం. పైగా అక్రమ జూదం అరికట్టడం సాధ్యం కాదు కనుక, చట్టబద్ధం చేసేస్తే ఖజానాకు లాభం అంటూ లెక్కలు వెయ్యడం పలాయన వాదం. ఇదే లాజిక్ అన్వయిస్తే ప్రభుత్వం నిషేధం అమలు చెయ్యలేని చీకటి వ్యాపారాల్ని.. మాదక ద్రవ్యాలు, దోపిడీ, దొంగతనంలాంటివన్నీ.. చట్ట బద్ధం చేయాల్సి వస్తుంది. ఖజానాకు కాసులు దొరుకుతాయి కానీ సామాజిక ఆరోగ్యం మాటేమిటో లా కమిషన్ సెలవివ్వాలి. కమిషన్, తన ప్రతిపాదనకి పురాణాల్ని కూడా ప్రాతిపదికగా చేసుకుంది. మహాభారత కాలంలో జూదం చట్టబద్ధమే అయ్యుంటే, ధర్మరాజు తమ్ముల్ని, భార్యనీ ఒడ్డి ఉండేవాడు కాదనీ, తద్వారా యుద్ధం జరిగేది కాదని చెప్పుకొచ్చారు. నిజమే మరి. వారి ఉద్దేశంలో చక్కగా కౌరవులు దేశాన్ని పాలించి, ఆదర్శంగా నిలిచే వారేమో. వ్యాసుడికి, మన కవిత్రయానికి, ఇంకా వందలాది రచయితలకు ముడిసరుకు కష్టమయ్యేది.జూదం, పేకాట లాంటివి సమాజానికి కీడు చేస్తాయి. వ్యసనంగా తయారై వ్యక్తిని అప్పుల పాలు చేసి, కుటుంబాల్ని ఆర్థిక అరాచకంలోకి నెట్టివేస్తాయి. క్రమశిక్షణ లేని జీవితాన్ని, అది పేద, ధనిక స్థాయీ భేదంతో సంబంధం లేకుండా అలవాటు చేసి దిగజారుస్తాయి. వాటిని అరికట్టడం లేకపోతే పోయె, కనీసం వాటికి ఆమోద ముద్ర వేసి సామాజిక గౌరవం కల్పిం చడం ఆత్మహత్యా సదృశం. కమిషన్‌లోనే ఒక సభ్యుడు వ్యతిరేకిస్తూ చెప్పినట్టు భారత్ ఈ తరహా సంస్కరణకు సిద్ధంగా లేదు. పేదలున్న దేశంలో మరింత మంది పేదల్ని సృష్టించే కార్యక్రమం అవుతుంది ఇది. ఒక్కమాటలో స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ జూదశాలలు, జాతీయ పేకాట పోటీలు ఈ దేశానికి అవసరం లేదు. – డా.డి.వి.జి.శంకరరావు,మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఏకకాల ఎన్నికలపై పార్టీల భిన్నాభిప్రాయాలు
-
4 అనుకూలం.. 9 వ్యతిరేకం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. నాలుగు పార్టీలు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలపగా, 9 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏ మాటా చెప్పకుండా తమకు మరికొంత సమయం కావాలన్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ గతంలో రాజకీయ పార్టీలను కోరింది. శని, ఆదివారాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి అభిప్రాయాలను వెలిబుచ్చారు. శిరోమణి అకాలీ దళ్, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడే ఏకకాల ఎన్నికలను జరిపితేనే సమర్థిస్తామని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. 2019లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే యూపీలో 2017లో ఏర్పడిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రద్దయి మళ్లీ ఎన్నికలొస్తాయి. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేడీఎస్, ఏఐఎఫ్బీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు వ్యతిరేకించాయి. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేనంటూ జేడీయూ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జూలై 31లోపు తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఎన్నికలను ఆలస్యం చేసే కుట్ర: ఆప్ ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి తమ పార్టీ అభిప్రాయాన్ని తెలియజెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభల పదవీకాలాన్ని పొడిగించి, ఎన్నికలను జాప్యం చేసేందుకు కుట్ర జరుగుతోందనీ, అందుకే ఏకకాల ఎన్నికలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే తరఫున తంబిదురై న్యాయ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేననీ, అయితే దీన్ని ఆచరణలోకి తేవాలంటే ముందుగా ఈ ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తంబిదురై చెప్పారు. ఏకకాల ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలు తమ ధనబలంతో ఎన్నికల్లో అవినీతికి పాల్పడతాయనీ, ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఈ ఆలోచన మాదే: బీజేడీ ఏక కాల ఎన్నికలకు తాము పూర్తిగా మద్దతిస్తామనీ, అసలు ఆ ఆలోచన తమ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌దేనని బిజూ జనతా దళ్ (బీజేడీ) తెలిపింది. ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను తొలిసారిగా నవీన్ పట్నాయక్ 2004లోనే తీసుకొచ్చారంది. ఒడిశాలో 2005లో జరగాల్సిన శాసనసభ ఎన్నికలను నవీన్ పట్నాయక్ ఏడాది ముందుకు జరిపి, 2004లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగేలా చేశారని బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా చెప్పారు. తమ అభిప్రాయాన్ని నివేదిక రూపంలో త్వరలోనే న్యాయకమిషన్‌కు అందజేస్తామని పినాకి మిశ్రా చెప్పారు. -
జమిలికి టీఆర్‘ఎస్’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అభిప్రాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయ శాఖ కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో లా కమిషన్ సమావేశానికి హాజరై సీఎం రాసిన లేఖను ఆయనకు అందజేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు విడిగా ఎన్నికల వల్ల ప్రతిసారీ 4 నుంచి 6 నెలల పాటు అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనుల్లో గడపాల్సి వస్తోందని, దీనివల్ల రాష్ట్రాల్లో ప్రజాధనం వృథా అవుతోందని వివరించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలంలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి వస్తోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఏడాది కాలంపాటు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవుతోందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం అని లేఖలో సీఎం వివరించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా లా కమిషన్ అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే న్యాయశాఖ నివేదిక ఇచ్చింది: వినోద్ దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌ల అజెండా కాదని, 1983లోనే దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ నివేదిక ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు మళ్లీ ఏటా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎంతో సమయం, ప్రజాధనం వృథా అవుతోంది. దీన్ని అరికట్టేందుకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’’అని వినోద్ పేర్కొన్నారు. -
జమిలి ఎన్నికలపై టీడీపీ ద్వంద్వ వైఖరి
-
జమిలి ఎన్నికలపై టీడీపీ ద్వంద్వ వైఖరి
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల విషయమై టీడీపీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ ఆదివారం లా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై టీడీపీ ప్రతినిధులు ద్వంద్వ వాదనలు వినిపించారు. జమీలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావని వారు పేర్కొన్నారు. అదే సమయంలో 2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే అందుకు సిద్ధమే కానీ.. జమిలి ఎన్నికల పేరిట ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే వ్యతిరేకిస్తామని తెలిపారు. లోక్‌సభను ముందస్తుగా రద్దుచేసి ఎన్నికలు నిర్వహించినా.. తాము మాత్రం రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయబోమని, అసెంబ్లీ ఐదేళ్లకాలం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.. వారు ఏమన్నారంటే.. జమిలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ కమిషన్‌కు స్పష్టం చేశాం. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చునని, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోవచ్చునని లా కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై మా అభిప్రాయాలను కోరింది. అయితే, జమిలి ఎన్నికల ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరవు. పైగా రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని మేం స్పష్టం చేశాం. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావాలని కేంద్రం భావిస్తే.. ఎన్నికలు ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. కానీ శాసనసభ ఎన్నికలకు మేం సిద్ధంగా లేము. ప్రజలు మాకు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మేం వ్యతిరేకం. జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు చర్చకు తీసుకురావడం ద్వారా కేంద్రం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది. ఒకసారి ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ జరిపే మధ్యంతర ఎన్నికలు కేవలం పరిమిత కాలానికే నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విధానం ద్వారా ప్రాంతీయ పార్టీలను మరింత ఇబ్బందిపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం కూడా కేంద్రం ఉద్దేశమని టీడీపీ భావిస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుందని కూడా లా కమిషన్‌కు వివరించాం. ఎన్నికల్లో వినియోగించే అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కూడా వారికి సూచించాం. -
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సై
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇటీవల వినిపిస్తున్న అంశం జమిలి ఎన్నికలు. ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7, 8వ తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ లా కమిషన్‌కు లేఖ రాశారు. లా కమిషన్ ఎదుట ఇదే అభిప్రాయాన్ని చెబుతామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా చేయవచ్చునని, అయితే ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతం మాత్రం కాదని వివరించారు. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం లా కమిషన్ సభ్యులతో సమావేశమే టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలకు (అసెంబ్లీ, లోక్‌సభ) సిద్ధమని ప్రకటించనున్నారు. ‘లోక్‌సభకు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సమయమంతా జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటుంది. లోక్ సభ, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల విలువైన సమయం వృథా. సుదీర్ఘమైన ఎన్నికల నియమావళితో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భారీగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలకు మా పార్టీ మద్దతు ఇస్తుందని’ లా కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు : వినోద్ దేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపై మా అధినేత, సిఎం కేసీఆర్ లేఖ ను లా కమిషన్ కు అందించా. ఒకేసారి ఎన్నికలకు మేం మద్దతు తెలుపుతున్నాం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు. తొలిసారి 1983లోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వమో, లేక బీజేపీనో ఈ చర్చను ప్రారంభించలేదు. రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధినే లక్ష్యంగా మా అధినేత దేశ వ్యాప్తంగా ఎన్నికలకు మద్దతు తెలుపుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా ధనం, సమయం వృధా అవుతుంది. 2019 లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదు. అయినా మిగతా రాష్ట్రాల కు జరుగుతున్న నష్టాన్ని దృష్టి లో పెట్టుకొని మా అభిప్రాయాలను తెలిపాం. ముందుస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థం లేని వాదనకు తెరలేపారు. కేవలం ఒకేసారి దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుందని ఎంపీ వినోద్ వివరించారు. -
జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాలు
-
లాకమిషన్ సమావేశానికి విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ లా కమిషన్ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు ప్రతినిధులతో కూడిన బృందం హాజరవనుంది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి లా కమిషన్ చేస్తున్న సంప్రదింపుల్లో భాగంగా వైఎస్సార్సీపీకి ఆహ్వానం అందింది. ఆ మేరకు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం మంగళవారం హాజరై తమ పార్టీ అభిప్రాయాలను లా కమిషన్‌కు తెలియజేస్తుంది. -
జమిలి ఎన్నికలు.. వివిధ పార్టీల అభిప్రాయం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని లోక్‌సభకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాతిపదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని అభిప్రాయపడ్డాయి. లా కమిషన్‌తో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, గోవా ఫార్వర్డ్ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బేనర్జీ అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని పేర్కొంది. -
జమిలి ఎన్నికలపై లా కమిషన్ సంప్రదింపులు
-
జమిలి ఎన్నికలపై పావులు కదుపుతున్న ఎన్డీఏ
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం దేశంలోని 7 జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ, అనుమానాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకొనేందుకు లా కమీషన్ రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఇతర ప్రధాన విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లా కమీషన్‌తో సమావేశానికి తాము హాజరు కాలేమంటూ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర పార్టీలు స్పష్టం చేశాయి. అయితే ప్రతికపక్షాలకు సర్ధిచెప్పి ఒప్పించేందుకు మోదీతో పాటు ఇతర ఎన్డీఏ నేతలు తీవ్ర కసరత్తలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలతో వనరులు, సమయం ఆదా అవుతాయని, అభివృద్ధి వేగ వంతం అవుతందని ప్రధాని సూచించినట్లు తెలిసింది. 10న అభిప్రాయం చెప్పనున్న వైఎస్సార్సీపీ : దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపడంపై తమ అభిప్రాయం చెప్ప వలసిందిగా లా కమీషన్ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న వైఎస్సార్సీపీ లా కమీషన్ ఎదట తన అభిప్రాయాన్ని చెప్పనుంది. -
‘పాన్‌షాప్‌లను జూద అడ్డాలుగా మారుస్తారా..?’
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్ వంటి జనాదరణ కలిగిన క్రీడల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆదాయం సమకూర్చుకునేందుకు బెట్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారి ఏఎన్ఐతో మాట్లాడుతూ... వివాదాస్పదమైన ఈ నిర్ణయం క్రీడలతో పాటు సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను చట్టబద్దం ద్వారా చేయడం ద్వారా దేశంలోని ప్రతీ పాన్షాప్ను జూదానికి అడ్డాగా మార్చాలనుకుంటున్నారా అంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అనుచిత నిర్ణయాల వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించాలంటూ హితవు పలికారు. కాగా లా కమిషన్(21వ) తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ వెల్లడించింది. వీటితోపాటు క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. -
‘జమిలి’పై చర్చకు కాంగ్రెస్‌కు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై దేశంలో ముఖ్య పార్టీ నేతలతో చర్చించేందుకు పలు పార్టీలకు లా కమిషన్ ఆహ్వానం పంపింది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7,8 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పలు రాజకీయ పార్టీ ఆహ్వానించగా, కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమావేశానికి హాజరుకావల్సిందిగా లా కమిషన్ కోరిందని, తమ పార్టీ నుంచి ఎవ్వరు హాజరు కావట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో అసెంబ్లీ, లోక్‌సభ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయుటకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. -
ఒక ఏడాదిలోని ఎన్నికలు ఒకేసారి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు (జమిలి) జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలు వర్గాలు కోరుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు తీసుకరావాలని, వాటితోపాటు సామాజిక, ఆర్థిక అంశాలకు చెందిన మరో 15 ప్రశ్నలపై తమ అభిప్రాయాలేమిటని ఎన్నికల కమిషన్‌ను లా కమిషన్ ఇటీవల ఓ నివేదికలో కోరింది. పాతికేళ్ల క్రితం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం మంచిదని సిఫార్సు చేసిన లా కమిషన్ ఇప్పుడు తాజాగా అదే అంశంపై ఎన్నికల కమిషన్ అభిప్రాయలను కోరింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి బదులుగా ఓ సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని కలిపి ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం సముచితమని, అందుకు రాజ్యాంగ సవరణలు కూడా అనవసరమని భావించినట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం దేశంలోని రాష్ట్ర అసెంబ్లీలకు ఎప్పుడు గడువు ముగిసి పోతే అప్పుడే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అందుకు కారణం అసెంబ్లీ గడువు ముగిసిపోవడానికి ఆరు నెలల ముందు ఎన్నికలు ప్రకటించరాదని ‘ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951’లోని 15వ సెక్షన్ తెలియజేస్తోంది. అందుకనే 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగా, ఓ ఏడాదిలో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నా, అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించాలన్నా ఆర్నెళ్లకు ముందుగా ఎన్నికలు నిర్వహించరాదన్న ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనను కనీసం తొమ్మిది నెలలకు మార్చాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావించాయి. -
‘ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ’
సాక్షి, న్యూఢిల్లీ : బీసీసీఐని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. తమది ప్రైవేట్ సంస్థ అన్న బీసీసీఐ వాదనను లా కమిషన్ తోసిపుచ్చింది. బీసీసీఐతో పాటు దాని అనుబంధ క్రికెట్ అసోసియేషన్లను ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. 2019 నుంచే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంపై ముసాయిదా శ్వేతపత్రాన్ని లా కమిషన్ వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచడం గమనార్హం. బీసీసీఐ ప్రభుత్వ తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇతరులకు రాజ్యాంగం నిర్ధేశించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని లా కమిషన్ పేర్కొంది. బీసీసీఐని ఆర్టీఐ చట్టపరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై సిఫార్సు చేయాలని 2016, జులైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను కోరింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ తమిళనాడు సొసైటీల రిజిస్ర్టేషన్ చట్టం కింద నమోదై ప్రైవేట్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఏకకాలంలో ఎన్నికలకు పకడ్బందీ చట్టం
న్యూఢిల్లీ: దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లా కమిషన్ పకడ్బందీగా ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు ముందుగా రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పార్టీలు తదితరుల సూచనలను మే 8వ తేదీలోగా తెలపాలని కోరుతూ ఆన్లైన్లో ఉంచింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ, అసెంబ్లీలకు 2019లో మొదటి దశ, 2024లో రెండో దశలోనూ ఎన్నికలు జరుగుతాయి. దీని కోసం రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల నిబంధనలను కూడా అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మధ్యలోనే పడిపోతే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఐదేళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల ఆమోదం పొందలేదనే కారణంతో ఈ సవరణలను కోర్టుల్లో పిటిషన్లు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగంలోనే సవరణలు చేయాలని ప్రతిపాదించింది. లోక్‌సభ లేదా అసెంబ్లీలో మెజారిటీ పార్టీ నేత ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఎన్నికైతేనే ఆ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ముసాయిదా తెలిపింది. ఏదైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ముందుగా విశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలన్న ఎన్నికల సంఘం సూచన కూడా ఈ ప్రతిపాదనల్లో ఉంది. -
ఒకేసారి ఎన్నికలు రెండు దశల్లో!
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలను రెండు దశలుగా విభజించి నిర్వహించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను 2024 సాధారణ ఎన్నికల సమయంలో నిర్వహించాలని కమిషన్ సూచించనుంది. లా కమిషన్ అంతర్గతంగా రూపొందించిన ఓ ముసాయిదాలో ఈ విషయం ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని కొంత కుదించడం, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం చేయాలనీ, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కమిషన్ సూచించనుంది. -
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమేనని, అవి న్యాయవ్యవస్థ స్వతంత్రత, స్థాయి దెబ్బతినకుండా ఉండాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, లా కమిషన్ పూర్వపు చైర్మన్, రెండో జాతీయ జ్యుడీషియల్ పే కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.వెంకటరామరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజావసరాలే కాకుండా న్యాయవ్యవస్థపై వారు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా అర్థవంతమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోకా రాఘవరావు లా ఫౌండేషన్ సహకారంతో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏసీ) శుక్రవారం హైదరాబాద్‌లో ‘న్యాయ సంస్కరణలు’పై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ‘లా కమిషన్ చైర్మన్‌గా ఉండగా దేశంలో ఆరు రాష్ట్రాల్లో పది చొప్పున మోడల్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనపై ఆర్థిక, న్యాయ శాఖల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే అన్ని కోర్టులూ మోడల్ కోర్టులు కావాలని చెప్పారు. చివరికి నిధులు మురిగిపోయాయి ఆ ప్రతిపాదన బుట్టదాఖలైంది’అని జస్టిస్ వెంకటరామరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. సాయంత్రపు కోర్టులుండాలి: సంస్కరణల ప్రతిపాదనలు ఫైళ్లకు పరిమితం కారాదని జస్టిస్ వెంకటరామరెడ్డి అన్నారు. 2010–11 కాలంలో సాయంత్రం పనిచేసే కోర్టులుండాలని, న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కోర్టులుండాలని, ఫ్రీ బార్గయినింగ్ కోర్టులు ఉండాలనే ప్రతిపాదనలు అమలు కాలేదని ఆయన తన అనుభవాలను గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల అంశంపై మాట్లాడుతూ.. కొలీజియానికి చేరిన జాబితాపై సంప్రదింపులు చేయడం మంచి పరిణామమని చెప్పారు. పాలనాపర అంశాలకు ఫుల్ బెంచ్: పాలనాపరమైన అంశాలపై న్యాయమూర్తుల్లో విబేధాలు తలెత్తినప్పుడు ఫుల్ బెంచ్ (మొత్తం న్యాయమూర్తులందరూ) సమావేశమై వాటిని పరిష్కరించుకోవాలని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లలిత్ భాసిన్ సూచించారు. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటరామరెడ్డిని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ హెచ్‌సీ ఉపాధ్యాయ సత్కరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కోకా రాఘవరావు, ఢిల్లీ హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, సీనియర్ న్యాయవాదులు ఎం. భాస్కరలక్ష్మి, సరసాని సత్యంరెడ్డి, ఎమ్మెస్ ప్రసాద్ వివిధ రాష్ట్రాల న్యాయవాదులు, లా విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికల దిశగా...
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల దిశగా దేశమంతటా విస్తృత చర్చ జరిగేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే ప్రతిపాదనను లా కమిషన్‌కు నివేదించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. లా కమిషన్‌కు ఈ అంశాన్ని నివేదిస్తే వివిధ స్ధాయిల్లో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఏకకాల ఎన్నికల అంశాన్ని లా కమిషన్‌కు నివేదించడంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని మరికొందరు అధికారులు పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం వ్యక్తమైతే ఈ ప్రతిపాదన ఫలవంతమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చట్టాల్లో ఏయే సవరణలు తీసుకురావాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని పేర్కొన్నాయి. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ప్రస్తుతం కసరత్తు సాగిస్తున్న క్రమంలో జమిలి ఎన్నికల ప్రతిపాదననూ కమిషన్‌కు నివేదిస్తారని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పదేపదే ఎన్నికలు వస్తుండటంతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించలేకపోతున్నాయని జమిలి ఎన్నికలతో ఈ ఇబ్బందులు అధిగమించడంతో పాటు భారీ వ్యయప్రయాసలకు కళ్లెం వేయవచ్చని కేంద్రం వాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా ఆ పార్టీ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో చర్చించారు. ఈసీ సైతం జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉన్నా ఇది ఆచరణకు నోచుకోవాలంటే పలు రాజ్యాంగ సవరణలు అవసరమని ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచిస్తోంది. -
కస్టడీ హింస ఆగుతుందా?
కస్టడీ హింస, లా కమీషన్, జస్టిస్ బల్బీర్ సింగ్ కమీషన్ పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టే సంస్కృతి మన దేశ ప్రతిష్టనూ, నాగరిక సమాజ విలువలనూ కాలరాస్తున్నా... దాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్న పాల కులకు తాజా లా కమిషన్ నివేదిక జ్ఞానోదయం కలిగించాలి. జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కమిషన్ మంగళవారం సమర్పించిన నివేదిక చిత్రహింస లకు పాల్పడే పోలీసు అధికారులకు యావజ్జీవ శిక్ష విధించడంతోసహా కఠిన చర్యలుండాలని, అందుకు చిత్రహింసల నిరోధక బిల్లు తీసుకురావాలని సిఫార్సు చేసింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఏ పార్టీలు అధికారంలో ఉన్నా సామాన్య పౌరుల విషయంలో పోలీసుల ప్రవర్తన ఒకేలా ఉంటున్నది. పాలనలో ఎదురవు తున్న సవాళ్లను అధిగమించడానికి పోలీసులపై అతిగా ఆధారపడే ధోరణి పెర గడం వల్ల వారిని చక్కదిద్దాలన్న స్పృహ ప్రభుత్వాలకు కొరవడుతోంది. ‘మన పోలీసులకు తగినంత సామర్ధ్యం ఉండటం లేదు. సంస్థాగతంగా, శిక్షణ పరంగా ఎన్నో లోపాలున్నాయి. దానిపై పర్యవేక్షణ లేకపోవడం మూలంగా పోలీసు వ్యవస్థ అవినీతికీ, అణచివేతకూ మారుపేరుగా నిలిచింది’ అని బ్రిటిష్ వలసపాలనలో 115 ఏళ్లక్రితం రెండో పోలీసు కమిషన్‌కు నేతృత్వంవహించిన ఫ్రేజర్ వ్యాఖ్యా నించాడు. ఇన్నేళ్లు గడిచినా ఆ మాటలు వర్తమాన పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యా నాలేమోనని సంశయం తలెత్తే పరిస్థితులే ఉన్నాయంటే అందుకు నిందించవల సింది పాలకులనే. అక్రమ నిర్బంధాల్లోనూ, చిత్రహింసల్లోనూ మన దేశానికున్న అపకీర్తి తక్కు వేమీ కాదు. ఇక్కడ నేరాలు చేసి విదేశాలకు పరారైనవారు పట్టుబడిన సందర్భాల్లో ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకుంటున్నారు. తమను భారత్‌కు అప్పగించ రాదంటూ అక్కడి న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిర్బంధంలో చిత్రహింసలు పెట్టబోమని, వారి ప్రాణాలకు పూచీ పడతామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప కొన్ని దేశాల్లోని న్యాయస్థానాలు నేరస్తుల అప్పగింతకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. నాగరిక దేశాలేవీ కస్టడీలో ఉన్నవారిపై చిత్రహింసలకు పాల్పడకూడదని... నిర్బంధితులతో క్రూరంగా, అమానుషంగా వ్యవహరించకూడ దని...ఆ మాదిరి చర్యలకు పాల్పడకుండా భద్రతాబలగాలను అదుపు చేయాలని 1975 డిసెంబర్ 9న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ చరిత్రాత్మక ఒడం బడికను ఆమోదించింది. దానిపై మరో 22 ఏళ్లకు... అంటే 1997 అక్టోబర్‌లో మన దేశం సంతకం చేసింది. కానీ సిగ్గుచేటైన విషయమేమంటే దాన్ని ఈనాటికీ ధ్రువీ కరించలేదు. అలా చేయాలంటే పార్లమెంటులో చిత్రహింసల నిరోధక బిల్లు ప్రవేశ పెట్టి దాన్ని చట్టం చేయాలి. ఏడేళ్లక్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చి రాజ్యసభలో ప్రవేశపెట్టిందిగానీ దాన్నిండా కంతలున్నాయని విపక్షాలు ఆరోపించడంతో అది సెలెక్ట్ కమిటీకి పోయింది. అక్కడితో దాని కథ ముగిసి పోయింది. చిత్రహింసల నిరోధక బిల్లు తీసుకురావాలని సిఫార్సు చేయడంతో లా కమి షన్ ఆగలేదు. అది ఎలా ఉండాలో సూచిస్తూ ఒక ముసాయిదా బిల్లు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. చిత్రహింసకు కమిషన్ ఇచ్చిన నిర్వచనం విస్తృత మైనది. పోలీసులు తమ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదా అసంకల్పి తంగా గాయపరిచినా... ఆ గాయం శారీరకమైనదైనా, మానసికమైనదైనా ముసా యిదా బిల్లు ప్రకారం చిత్రహింసే అవుతుంది. చిత్రహింసల బాధితులకు తగిన పరిహారం అందించాలనడంతోపాటు చిత్రహింసలకు తాము బాధ్యులం కాదని నిరూపించుకునే భారాన్ని అధికారులపైనే మోపింది. ఇందుకు భారతీయ సాక్ష్యా ధారాల చట్టాన్నీ, నేరశిక్షా స్మృతినీ సవరించాలని కమిషన్ సూచించింది. బాధితు లకు అందజేసే పరిహారాన్ని వారికేర్పడ్డ గాయాల స్వభావాన్ని, విస్తృతిని బట్టి న్యాయస్థానాలు నిర్ణయించాలని తెలిపింది. చిత్రహింసలు పౌరులకున్న జీవించే హక్కునూ, స్వేచ్ఛనూ హరిస్తున్నాయని గుర్తుచేసింది. పాలకుల అధికార దర్పం పోలీసుల ద్వారానే ప్రధానంగా వ్యక్తమవుతుంది. తాము బయటకు వెళ్లినప్పుడల్లా అతిగా వ్యవహరించి హడావుడి చేసే పోలీసు విభాగంపై పాలకులకు సహజంగానే ఆపేక్ష ఏర్పడుతుంది. పోలీసులవైపు తప్పు జరిగినా వెనకేసుకురావడం, వారి స్థైర్యం దెబ్బతింటుందనే వాదన చాటున నిర్లి ప్తంగా ఉండిపోవడం సాధారణ పౌరులకు ప్రాణాంతకమవుతున్నదని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. తమ ప్రతినిధులుగా అధికారం చెలాయిస్తున్నవారు చేసే చర్య లకు రాజ్యం బాధ్యతవహించాల్సి ఉంటుందని లా కమిషన్ నివేదిక చెప్పడమే కాదు... చిత్రహింసల బాధితుల రక్షణకూ, వారి ఫిర్యాదులు వినడానికి, సాక్షులకు బెదిరింపులు రాకుండా చూడటానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. పోలీసు చిత్రహింసలు సాధారణ పౌరులకు మాత్రమే కాదు... అప్పు డప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తులకూ తప్పడం లేదు. నిరుడు కేంద్ర కార్పొరేట్ వ్యవ హారాల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ జనరల్‌గా ఉంటూ ఒక లంచం కేసులో అరెస్ట యిన బాల్కిషన్ బన్సల్ విషాద ఉదంతం ఇందుకు ఉదాహరణ. లంచం తీసు కుంటుండగా బన్సల్‌ను పట్టుకున్న సీబీఐ ఆ తర్వాత ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలతో అతిగా వ్యవహరించిందన్న ఆరోపణలొచ్చాయి. బన్సల్ కస్టడీలో ఉండగానే ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకోగా... బెయిల్‌పై బయటి కొచ్చిన బన్సల్ తన కుమారుడితోపాటు ఉసురుతీసుకున్నారు. చనిపోయిన వారంతా తమను ఫలానా ఫలానా సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా హింసించారని లేఖలు రాసిపోతే... ఆ సంస్థ తనపై తానే ఏడాదిపాటు దర్యాప్తు జరుపుకుని తమ అధికారులంతా నిర్దోషులని మొన్నీమధ్యే క్లీన్చిట్ ఇచ్చుకుంది. ఇలాంటి దుస్థితి మారాలి. ఐక్యరాజ్యసమితి ఒడంబడికను ధ్రువీకరించే అంశాన్ని పరిశీలించేందుకు మూడు నెలలక్రితం కేంద్రం ఒక కమిటీని నియమించింది. తాజా లా కమిషన్ నివేదిక ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. పోలీసు చిత్ర హింసల విషయంలో మన దేశానికున్న అపఖ్యాతి తొలగాలి. మనదీ నాగరిక సమా జమేనని చాటిచెప్పాలి. -
పెళ్లి - చట్టబద్ధత
ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో పడిన పెళ్లిళ్ల నమోదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వివాహమైన నెలరోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవడం, దాన్ని ఆధార్‌తో అను సంధానించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని మంగళవారం లా కమిషన్ నివేదిక సిఫార్సు సిఫార్సు చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆలస్యమైన పక్షంలో రోజుకు రూ. 5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, గరిష్టంగా ఇది రూ. 100 ఉండాలని కూడా సూచించింది. మన సమాజంలో పెళ్లనేది ఇద్దరి జీవి తాలతోపాటు రెండు కుటుంబాలను ఏకం చేసే వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థలో మహిళలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారు. దీనికి కుల, మత భేదాల్లేవు. ధనిక, బీద తారతమ్యం లేదు. చదువు, డబ్బు, ఉద్యోగం, హోదా వంటివేవీ ఆడదాన్ని ఈ వివక్ష నుంచి కాపాడలేకపోతున్నాయి. ఇంటా, బయటా అను నిత్యం అనేక రూపాల్లో మహిళలపట్ల అమలవుతున్న వివక్షను పారదోలాలని ఐక్యరాజ్యసమితి సంకల్పించి దాదాపు నాలుగు దశాబ్దాలవుతోంది. అందుకు సంబంధించిన అంత ర్జాతీయ ఒడంబడికపై మన దేశం సంతకం చేసి ఈ నెలాఖరుకు 37 ఏళ్లు పూర్తవుతోంది. వివాహాల నమోదు తప్పనిసరి చేస్తూ ప్రతి దేశమూ చట్టం తీసు కురావాలని ఈ ఒడంబడిక చెబుతోంది. అయితే 1993లో ఆ ఒప్పందాన్ని ధ్రువీ కరించే సందర్భంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తున్న ఒప్పందంలోని 16(2) అధికరణం ఆచరణ సాధ్యం కాదని మన దేశం చెప్పింది. భిన్న మతాలు, సంప్ర దాయాలు, అంతంతమాత్రంగా ఉన్న అక్షరాస్యత వగైరా కారణాల వల్ల భారత్ లాంటి సువిశాల దేశంలో ఇది కష్టమని వివరించింది. ఆ విషయంలో చేయ దల్చుకున్నదేమిటో మాత్రం చెప్పలేదు. నిజానికిది తప్పించుకు తిరిగే ధోరణి. వివాహాల నమోదు లేకపోవడం సమస్యలు సృష్టిస్తున్నదా లేదా అని చూడాలి తప్ప అలా నమోదు చేయడం ఎందుకు అసాధ్యమో ఏకరువు పెట్టడం సమంజసం కాదు. నమోదు లేకపోవడం వల్ల జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు అన్యాయం జరుగుతున్నదను కుంటే.. ఎన్ని అవరోధాలనైనా అధిగమించి ఆ అన్యాయాన్ని సరిదిద్దడం ప్రభుత్వం బాధ్యత. సమాజం బాధ్యత. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకుంటే దాంతోపాటు చేయాల్సినవేమిటో గుర్తించి అమలు చేయడమూ వాటి బాధ్యతే. సకల జనామోదం పొందాకే చట్టాన్ని రూపొందిస్తామని, అంతవరకూ ఏ అన్యా యాన్నయినా చూసీచూడనట్టు వదిలేస్తామని అనడం సరైంది కాదు. హిందువుల్లో విడాకులకు వీలు కల్పించే హిందూ వివాహ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ, ఆనాటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ అంబేడ్కర్ సంప్రదాయ వాదుల నుంచి ఎంతో ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేయదల్చుకున్నారని విమ ర్శలు వచ్చాయి. అయినా ఆ చట్టం వచ్చింది. పెళ్లిళ్లను రిజిస్టర్ చేసే నిబంధన లేక పోవడం వల్ల ఆడదానికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నారై పెళ్లిళ్లలో ఇలాంటివి ఎక్కువుంటున్నాయి. బహుభార్యత్వం నేరమని చట్టం చెబు తున్నా అవివాహితుణ్ణని చెప్పి మోసగించి నలుగురైదుగురిని పెళ్లాడిన కేసులు అడపా దడపా బయటికొస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనిషి చనిపోయాకే అతడికి వేరేచోట మరో కుటుంబం ఉన్నట్టు వెల్లడవుతుంటుంది. ఇలాంటపుడు పెళ్లయినట్టు సాక్ష్యం చూపలేక, భార్యగా గుర్తింపు లేక, వారసత్వ హక్కులు పొంద లేక, భరణం రాక మహిళలు రోడ్డున పడుతున్నారు. ఒక్కోసారి పిల్లల కస్టడీ కూడా సమస్యవుతోంది. పెళ్లిళ్లపై అధికారిక రికార్డులు లేకపోవడం వల్ల మోసగాళ్లు సుల భంగా తప్పించుకుంటున్నారని 2005లో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ వెంటనే జాతీయ మహిళా కమిషన్ ఒక బిల్లు కూడా రూపొందించింది. మహారాష్ట్ర, గుజ రాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో రాజ్యసభలో ఇందుకోసం బిల్లు పెట్టారు. అది ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోగానే ఆ సభ కాస్తా రద్ద యింది. దాంతో బిల్లు మురిగిపోయింది. దేశంలో ప్రధానమైన హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతాలకు వేర్వేరుగా వైయక్తిక చట్టాలున్నాయి. 1872నాటి క్రైస్తవ వివాహ చట్టం, 1936నాటి పార్సీ వివాహచట్టం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాయి. ముస్లిం వైయక్తిక చట్టం ప్రకారం నిఖానామాలో వివాహాన్ని కాజీ నమోదు చేస్తారు. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ గురించి ఉన్నా మత విశ్వాసాల ప్రకారం పెళ్లి చేసుకున్నాక దాన్ని నమోదు చేయించుకోవడమా లేదా అన్నది ఆ జంటకే విడిచిపెట్టారు. ఏ మతానికీ సంబంధంలేని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం ఉంది. అయితే హిందూ వివాహ చట్టం తప్పనిసరి చేయకపోవడం వల్ల అధిక సంఖ్యాకులు వివాహ నమోదు ప్రక్రియ జోలికే పోరు. ఈ నిబంధన ఉంటే బాల్య వివాహాల జోరు తగ్గుతుందని ఆశించేవారు కూడా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో జరిగే బాల్యవివాహాల్లో 40 శాతం పైగా మన దేశంలోనే ఉన్నట్టు యునిసెఫ్ చెబుతోంది. అయితే తప్పనిసరి నమోదు నిబంధన దానికదే సమస్యగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్టయితే అది మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ నిబంధన సంగతి తెలియక వివాహ బంధంలో చిక్కుకున్నవారు అనంతరకాలంలో పెళ్లి చెల్లదన్న తీర్పువస్తే ఏం కావాలి? పిల్లలు, ఆస్తి, భరణం వగైరా అంశాల్లో వారికి లభించే న్యాయం ఏమిటి? పైగా ఇలా చేసే చట్టం మతాలకు అతీతంగా వర్తింపజేస్తూ రూపొందిస్తారా లేక ఇప్పటికే అలాంటి నిబంధన అమలవుతున్న మతాలను మినహాయిస్తారా? మినహాయించకపోతే అందువల్ల తలెత్తగల సమస్య లేమిటి? వీటన్నిటినీ అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అందరి అభిప్రాయాలూ పరి గణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ చట్టాన్ని రూపొందించాలి. ఏం చేసినా మహి ళల శ్రేయస్సు, సంక్షేమం గీటురాయి కావాలి. -
బెయిల్ నిబంధనలు మార్చండి
► సిఫార్సు చేయనున్న లా కమిషన్ న్యూఢిల్లీ: బెయిల్ మంజూరు నిబంధనల్లో మార్పులు చేయాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఏడేళ్ల జైలుశిక్ష పడే నేరాల కేసుల్లో విచారణ ఖైదీలుగా ఉన్నవారు ఆ శిక్షలో మూడోవంతు(రెండున్నరేళ్లు) కాలం జైల్లో పూర్తి చేసుకుని ఉంటే వారిని బెయిల్‌పై విడుదల చేయాలని సూచించనుంది. సీఆర్పీసీలోని ‘426 ఏ’ సెక్షన్‌ను సవరించాలని సిఫార్సు చేయనుందని కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న సీనియర్ అధికారి తెలిపారు. ‘డబ్బు పూచీకత్తు ఇవ్వలేని విచారణ ఖైదీలకు వారి ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డులను ప్రభుత్వం డిపాజిట్ చేసుకుని బెయిల్ ఇవ్వాలని సూచించనుంది. ఈ కార్డులను డిపాజిట్ చేసిన వ్యక్తి తిరిగి జైలుకు రాకపోతే ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నాం’అని వెల్లడించారు. కొత్త బెయిల్ చట్టాన్ని సిఫార్సు చేయాలని గతేడాది లా కమిషన్‌కు కోరిన ప్రభుత్వం తర్వాత నిర్ణయం మార్చుకుని, బెయిల్‌ను సులభంగా మంజూరు చేసేందుకు సీఆర్పీసీలో మార్పులను సూచిస్తే చాలని చెప్పింది. -
‘లా’ కమిషన్ సిఫారసులపై నిరసన
కర్నూలు(లీగల్): ‘లా’ కమిషన్ (న్యాయవాదుల సవరణ బిల్లు 2017) సిఫారసులను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా అధ్యక్షతన నా్యయవాదులు సవరణ బిల్లు ప్రతులను జిల్లా కోర్టు ఎదుట దహనం చేశారు. కొద్దిసేపు ‘లా’ కమిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ మే 2వ తేదీన న్యూఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని న్యాయవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ ‘లా’ కమిషన్ ప్రతిపాదించిన సిఫారసులను వ్యతిరేకించాలని ఎంపీలను కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఓంకార్, పి.సుంకన్న, కోటేశ్వరరెడ్డి, రంగా రవికుమార్, శ్రీవత్స, జలందర్, బాలు, నాగరాజు, ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
లా కమిషన్ ప్రతిపాదనలపై నిరసన
⇔ పలు తీర్మానాలు చేసిన బార్‌కౌన్సిల్, న్యాయవాద సంఘాలు ⇔ 21న న్యాయవాదుల బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల చట్టానికి లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపా దించిన పలు సవరణలను ఉభ య రాష్ట్రాల న్యాయవాదులు వ్యతిరేకించారు. లా కమిషన్ ప్రతిపాదనలతో తయారైన న్యాయవాదుల (సవరణ) బిల్లు 2017ను వ్యతిరేకించాలని, నిరసన కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు. న్యాయవా దుల సవరణ బిల్లు నేపథ్యంలో ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కూడా పలు తీర్మానాలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణంలో ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు చిత్తరవు నాగేశ్వరరావు, జల్లి కనకయ్యతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని పలు న్యాయవాద సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్‌కౌన్సిల్ సభ్యుడు ఎన్.ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ...లా కమిషన్ ప్రతిపాదనలు న్యాయవ్యవస్థ కు, న్యాయవాదులకూ వ్యతిరే కంగా ఉన్నాయన్నారు. బార్ కౌన్సిల్ క్రమ శిక్షణ కమిటీల్లో న్యాయవాదులేతరులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. బార్ కౌన్సిల్లో విశ్రాం త ప్రధాన న్యాయమూర్తి, విశ్రాంత న్యాయ మూర్తులకు స్థానం కల్పించాలన్న ప్రతిపాదన కూడా సరికాదన్నారు. చిన్న పొరపాటు చేసి నా న్యాయవాదులకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలన్న ప్రతి పాదనపై విస్మయం ప్రకటించారు. న్యాయవాదుల స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రతి పాదనలు చేసిన లా కమిషన్, వారి సంక్షే మానికి, రక్షణకు ఎలాంటి సూచనలూ చేయకపోవడాన్ని అందరూ తప్పుపట్టారు. ఈ సమావేశంలో చేసిన ప్రధాన తీర్మానాలివి... న్యాయవాదుల చట్టానికి సవరణకు సంబంధించి లా కమిషన్ చేసిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 21న అన్ని కోర్టుల్లో భోజన విరామ సమయంలో నిరసన. లా కమిషన్ చైర్మన్ రాజీనామాకు డిమాండ్. ప్రధాని, న్యాయశాఖ మంత్రి, గవర్నర్ లకు వినతిపత్రాలు. అలాగే పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలకు వినతి పత్రాల సమర్పణ. బీసీఐ ఆధ్వర్యంలో మే 2న జరగనున్న నిరసన ర్యాలీలో పాల్గొనాలి -
స్తంభించిన కోర్టులు
హైదరాబాద్: లా కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. కోర్టుల్లో విధులను లాయర్లు బహిష్కరించారు. రాజధానిలోని అన్ని కోర్టుల్లోనూ న్యాయసేవలకు అంతరాయం ఏర్పడింది. -
31న న్యాయవాదుల విధుల బహిష్కరణ
కర్నూలు(లీగల్): న్యాయవాదులకు వ్యతిరేకంగా లా కమిషన్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈనెల 31న న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలపాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరు రవిగువేరా తెలిపారు. ఈ మేరకు సమాచారాన్ని జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్లకు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులందరూ నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ] -
నాయకులకు షాక్.. ఈసీ కీలక సిఫారసు!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఎన్నికల్లో ఒకటికి మించి స్థానాల్లో పోటీచేస్తున్న రాజకీయ నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తి ఒకేసారి రెండుస్థానాల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. అలా చేయని పక్షంలో కనీసం రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఒకదానిని ఖాళీ చేసి ఉప ఎన్నికలకు కారణమైతే.. అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశించేలా ఎన్నికల చట్టాల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు, లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో గరిష్ఠంగా రెండుస్థానాల్లో పోటీచేసేందుకు అనుమతినిచ్చింది. అయితే, రెండుస్థానాల్లో గెలుపొందినా ఒకే స్థానంలో మాత్రమే కొనసాగాలని నిబంధనలు విధించింది. 1996కు ముందు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీచేసే అవకాశం ఉండేది. కానీ 1996లో తీసుకొచ్చిన ఎన్నికల సవరణలతో ఒక అభ్యర్థి రెండుస్థానాల్లో మాత్రమే పోటీచేసేలా పరిమితి విధించారు. అయితే, కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లో సెక్షన్ 33 (7)ను మార్చాలని కోరినట్టు ఈసీ తెలిపింది. సెక్షన్ 33 (7)ను సవరించి ఒక అభ్యర్థిని ఒకే స్థానంలో పోటీచేసేలా పరిమితి విధించాలని, ఒకవేళ అది కుదరకపోతే.. కనీసం గెలిచిన అభ్యర్థి సీటును ఖాళీ చేస్తే.. ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును మొత్తం అతను/ఆమె భరించేలా సవరణలు తీసుకురావాలని కోరింది. ఈ వ్యయాన్ని అసెంబ్లీ స్థానానికి రూ. 5 లక్షలుగా, లోక్‌సభ స్థానానికి రూ. 10 లక్షలుగా ఈసీ ప్రతిపాదించింది. -
‘ఉమ్మడి ఎన్నికలు’ సబబేనా?
కొన్నాళ్లక్రితం మొదలై సద్దుమణిగిందనుకున్న ‘ఉమ్మడి ఎన్నికల విధానం’ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఏదో ఒకమూల నిరంతరం ఎన్నికలు జరగడంవల్ల ఖజానాపై అంతులేని భారం పడుతున్నదని, అభివృద్ధికి విఘాతం ఏర్పడుతున్నదని, పాలన కుంటుబడుతున్నదని ‘ఉమ్మడి ఎన్నికల’ వాదాన్ని వినిపి స్తున్నవారు చెబుతున్నారు. ఈ విషయమై 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ కూడా రాశారు. అంతక్రితం ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా లా కమిషన్ 170వ నివేదిక ఇలాంటి సిఫార్సే చేసింది. ఈమధ్యే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గత డిసెంబర్లో పార్లమెంటరీ సంఘం ముందు, కేంద్ర న్యాయ మంత్రి త్వశాఖ ఇటీవల అడిగినప్పుడు ఎన్నికల సంఘం సైతం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. సమస్య ఉందనుకున్నప్పుడు దానికి పరిష్కారం అన్వేషించడం, ఆ పరి ష్కారంలోని లోటుపాట్లను చర్చించడం మంచిదే. అయితే పరిష్కారమే సమస్యగా మారకూడదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేసే తీరు ఉండకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీల కాల వ్యవధి ఒక్కోచోట ఒక్కోలా ఉంటున్నది. ఇటీవలి కాలాన్నే తీసుకుంటే 2014లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. నిరుడు బీహార్ అసెంబ్లీకి, ఈ సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. వచ్చే సంవత్సరం యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2018లో గుజరాత్, కర్ణాటక, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలొస్తాయి. ఆ మరుసటి ఏడాదికల్లా లోక్‌సభ ఎన్నికలుంటాయి. ఇలా ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల వాటి నిర్వహణ వ్యయం అపరిమితంగా ఉంటున్నదని, భారీ సంఖ్యలో సిబ్బంది, భద్రతా బలగాల కేటాయింపు...అందువల్ల పరిపాలనకు అవ రోధాలు ఏర్పడటం పెను సమస్యగా మారిందని ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదనను సమర్ధిస్తున్నవారు చెబుతున్నారు. ఇవన్నీకాక ఎన్నికల సమయంలో అమల్లోకొచ్చే ప్రవర్తనా నియమావళి వల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడటం లేదంటున్నారు. అటు పార్టీలు కూడా ధారాళంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. పైకి చెప్పడం లేదుగానీ...పాలకులుగా ఉంటున్నవారికి ఈ ‘నిరంతర ఎన్నికలు’ తెస్తున్న అసలు సమస్యలు వేరే ఉన్నాయి. ధరలు పెంచాలన్నా, సంస్కరణలకు సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా దేశంలో ఏదో ఒకమూల ముంచుకొస్తున్న ఎన్నికలు వారికి ‘తలనొప్పి’గా మారుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి కదా అని తీసుకున్న నిర్ణయం...మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది. సామాన్య పౌరులకు ఎదురవుతున్న సమస్యలు వేరు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కుల, మత విభేదాలు ముందుకు రావడం, నేతలు రెచ్చగొట్టే ఉపన్యాసాలివ్వడం, వివిధ పార్టీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వడం, హింసాత్మక చర్యలకు దిగడం, విచ్చలవిడిగా నల్లడబ్బు చలామణిలోకి రావడం వగైరాలను వారు ప్రధాన సమస్యలుగా చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తమ తీర్పును వమ్ము చేసేలా గెలిచినవారు స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించడం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. ఇవన్నీ మొత్తంగా ఎన్నికల వ్యవస్థపైనే వారిలో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. వీటిపై పాలకులుగానీ, పార్టీలుగానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. సరిచేసుకుంటున్న జాడలు లేవు. అసలు 1952 తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని 1967 వరకూ లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించగా ఆ తర్వాత ఎందుకని సాధ్యం కాలేదు? 1972కు ముగియాల్సిన లోక్‌సభను గడువుకు ముందే 1971లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రద్దు చేయడంవల్ల ఈ స్థితి ఏర్పడింది. ఆ తర్వాత 1984లో రాజీవ్‌గాంధీ కూడా ఆ పనే చేశారు. మరికొన్ని నెలల వ్యవధి ఉండగానే లోక్‌సభను రద్దుచేశారు. 1989, 1999లలో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్ప కూలగా...ఆ రెండుసార్లూ లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రాకతప్పలేదు. 1998 ఎన్నికల అనంతరం ఏర్పడ్డ వాజపేయి ప్రభుత్వం 13 నెలల తర్వాత రాజీనామా చేయాల్సిరావడంతో 1999లో మరోసారి ఎన్నికలు తప్పలేదు. ఇప్పుడు ‘ఉమ్మడి ఎన్నికల’ విధానం అమల్లోకి తెచ్చినా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తబోవని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఒకవేళ ఆ పరిస్థితులే తలెత్తి ఎవరూ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేయలేకపోతే అప్పుడేం చేస్తారు? రాష్ట్రాల్లో అయితే రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్పొచ్చు. కానీ ఎన్నికలు జరిగిన ఏడాదిలోగా ప్రభుత్వం కుప్పకూలితే మిగిలిన నాలుగేళ్లూ రాష్ట్రపతి పాలనే ఉంటుందా? అదే జరిగితే దాన్ని ప్రజాస్వామ్యం అనొచ్చునా? ఇది ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించడం కాదా? ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదన చేస్తున్నవారు ఇలాంటి సందర్భాలు తలెత్తితే ఏం చేయాలన్న విషయంలో మౌనం పాటిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాల్లోని అంశాల ప్రాతిపదికన జరుగుతాయి. జాతీయ ప్రాముఖ్యం గల అంశాలు, ఆకాంక్షలు ప్రధాన పాత్ర పోషించే సార్వత్రిక ఎన్నికలను వీటితో ముడిపెట్టడంవల్ల రాష్ట్రాల్లోని అంశాలు మరుగునపడే అవకాశం లేదా? ‘ఉమ్మడి ఎన్నికల’ సందర్భాల్లో లోక్‌సభకు ఒక పార్టీని, అసెంబ్లీకి వేరొక పార్టీని గెలిపించే విచక్షణ ఓటరుకు ఉంటున్నదని కొందరంటారు. కానీ 1999 తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషించిన నిపుణులు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ ఉన్నాయని వారు తేల్చారు. ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదనకు ఏర్పడే రాజ్యాంగ పరమైన అవరోధాల సంగతలా ఉంచి...అది ఫెడరల్ స్ఫూర్తిని విరుద్ధమని, ప్రజల ఆకాంక్షలను దెబ్బతీస్తుందని అనేకమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్న మాట. ఎన్నికైన సర్కారు తీరు సక్రమంగా లేనిపక్షంలో దాన్ని‘రీకాల్’ చేసే హక్కు పౌరులకుండాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్న వేళ ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదన ముందుకు రావడం విచిత్రం. ఇందుకు బదులు ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసి, దాని విశ్వసనీయతను పెంచే దిశగా చర్యలు తీసుకోవడం ఇప్పటి అవసరం. -
'వివాహ అత్యాచారంపై అభిప్రాయం తెలపండి'
► లా కమిషన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: వివాహ అనంతరం భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని నేరంగా పరిగణించడంపై అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ లాకమిషన్ను కోరింది. క్రిమినల్ జస్టిస్ సిస్టంను సమీక్షించే సమయంలో దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందిగా అభ్యర్థించింది. ఈమేరకు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మహిళల భద్రతపై నిర్ధిష్ట సిఫారసులు చేసిన పామ్ రాజపుత్ కమిటీ కూడా వివాహ అత్యాచారాన్ని నేరంగా పరిగణించినట్లు మంత్రి పేర్కొన్నారు. తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తం కమిటీ సిఫారస్‌లను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపించినట్లు ఆమె తెలిపారు. -
మరణశిక్షను రద్దు చేయాలి!
-
మరణశిక్షను రద్దు చేయాలి!
సత్వరమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి * లా కమిషన్ సిఫార్సు; ఉగ్ర నేరాలకు మినహాయింపు * ఉరి శిక్ష రద్దు సరికాదన్న కమిషన్ సభ్యురాలు జస్టిస్ ఉషా మెహ్రా న్యూఢిల్లీ: మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణ శిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. ఆ శిక్ష జీవితఖైదును మించిన ఫలితం ఇవ్వబోదని పేర్కొంది. అయితే, ఉగ్రవాద కేసులు, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలా? కొనసాగించాలా? అనే విషయంపై విస్తృత, సమగ్ర సంప్రదింపుల తర్వాత 20వ లా కమిషన్ సోమవారం తుది నివేదిక విడుదల చేసింది. లా కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు మొగ్గు చూపగా, కమిషన్‌లోని శాశ్వత సభ్యుల్లో ఒకరైన రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ ఉషా మెహ్రాతో పాటు ప్రభుత్వ ప్రతినిధులైన ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పీకే మల్హోత్ర(న్యాయ శాఖ కార్యదర్శి), సంజయ్ సింగ్(లెజిస్లేటివ్ సెక్రటరీ) మాత్రం ఉరిశిక్షను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ భిన్నాభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చారు. మరణశిక్షను కొనసాగించడం రాజ్యాంగపరమైన క్లిష్టమైన ప్రశ్నలను సంధిస్తోందని కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. న్యాయం జరగకపోవడం, న్యాయప్రక్రియలో పొరపాట్లు దొర్లడం, నేరన్యాయ వ్యవస్థలో న్యాయసేవలు పొందలేని పేదలు, బడుగు వర్గాల దుస్థితి.. మొదలైన ప్రశ్నలను ఉరిశిక్ష కొనసాగింపు లేవనెత్తుతోందని అన్నారు. ఉరిశిక్షను రద్దు చేయడం అత్యవసరమేనన్న కమిషన్.. ఆ ప్రక్రియ ఎలా జరగాలనేదానిపై కచ్చితమైన, స్పష్టమైన పద్ధతిని సూచించలేదు. స్వచ్ఛంద నిషేధం (మారటోరియం) విధించడం నుంచి ఉరిశిక్ష రద్దుకు సంబంధించి సమగ్రబిల్లును రూపొందించడం వరకు చాలా మార్గాలున్నాయంది. వీటిలో ప్రత్యేకంగా ఏ మార్గాన్నీ తాము సిఫారసు చేయడం లేదన్న కమిషన్.. సత్వర, పూర్వ స్థితికి తీసుకువచ్చే వీళ్లేని, పూర్తి స్థాయి రద్దును మాత్రం సిఫార్సు చేస్తున్నామని పేర్కొంది. ఏ పద్దతిలో ఉరిని రద్దు చేయాలనే విషయంపై అతి త్వరలో కూలంకష చర్చ జరగాలని సూచించింది. ఉగ్రవాద నేరాలకు ఉరిశిక్ష సమర్థనీయమన్న కమిషన్.. ఉగ్రవాదాన్ని ఇతర నేరాల నుంచి వేరుపర్చే స్పష్టమైన విభేదాంశం శిక్షాస్మృతిలో లేదని పేర్కొంది. జాతీయ భద్రతకు సంబంధించి దీన్ని మరణ శిక్షకు అర్హమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఉరిశిక్షకు సంబంధించి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యక్తపర్చిన అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చారు. మరణశిక్ష విధించిన నేరాలకు.. ప్రత్యామ్నాయ జీవిత ఖైదు పడిన నేరాలకు మధ్య తేడాలను గుర్తించడం కష్టమన్న సుప్రీం అభిప్రాయాన్ని గుర్తు చేశారు. క్షమాభిక్ష ప్రకటించే విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన పొరపాట్లను, లోపాలను, న్యాయపర తప్పులను పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎత్తి చూపిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనల ఉల్లంఘన, విచక్షణను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల క్షమాభిక్ష ప్రక్రియ బలహీనపడిందని, దాంతో మరణశిక్షను సమర్థించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. క్షమాభిక్ష విషయంలో అర్హులను కాపాడటంలో చట్టంలోని రక్షణ మార్గాలు విఫలమయ్యాయని అన్నారు. ఉరి రద్దు వద్దు.. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.. అత్యంత హేయమైన నేరాలకు ఉరిశిక్ష విధించడంపై సంపూర్ణ నిషేధం విధించడం సరైన చర్య కాదన్న అభిప్రాయం కలుగుతోందని జస్టిస్ ఉషా మెహ్రా పేర్కొన్నారు. అత్యంత హేయమైన నేరాల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలని గొప్ప విజ్ఞతతో పార్లమెంటు నిర్ణయించిందని, ఆ శిక్షను కొనసాగించడమే ఉత్తమమని న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రా అభిప్రాయపడ్డారు. అత్యంత చైతన్యశీల న్యాయవ్యవస్థ కలిగిన భారతదేశంలో న్యాయమూర్తులు గొప్ప విచక్షణతో, అర్హత కలిగిన నేరాలకు మాత్రమే మరణ శిక్ష విధిస్తున్నారని, వారి విజ్ఞతను గౌరవించాలని, అందువల్ల ఉరి శిక్ష రద్దు అవసరం లేదని లెజిస్లేటివ్ సెక్రటరీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. లా కమిషన్‌లో ఒక చైర్మన్, ముగ్గురు శాశ్వత సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు, ముగ్గురు తాత్కాలిక సభ్యులు.. మొత్తం 9 మంది సభ్యులుంటారు. -
వారంలో ‘ఉరి’పై నివేదిక
న్యూఢిల్లీ: మరణ శిక్షను కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అనే విషయంపై రూపొందించిన సమగ్ర నివేదికను లా కమిషన్ వచ్చేవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ శిక్ష భవితవ్యంపై అందులో సిఫార్సు చేయనుంది. నివేదిక ప్రతిని కేంద్ర న్యాయ శాఖకూ అందించనుంది. ముంబై దాడుల దోషి యాకూబ్ మెమన్ను ఉరితీయడంతో మరణశిక్షపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత న్యాయ కమిషన్ కాలపరిమితి ఈ నెల 31తో ముగియనుంది. అందువల్ల ఆ లోపే నివేదికను సుప్రీంకోర్టుకు అందించాలని కమిషన్ కృషి చేస్తోంది. సంతోశ్ కుమార్, సతీశ్ భూషణ్ బరియార్ వర్సెస్ మహారాష్ట్ర, శంకర్ కిషన్‌రావు ఖాడే వర్సెస్ మహారాష్ట్ర కేసుల విచారణ సందర్భంగా మరణ శిక్షపై దేశవ్యాప్తంగా లోతైన చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో విస్తృత సంప్రదింపులు జరిపి సమగ్ర నివేదిక రూపొందించాలంటూ లా కమిషన్‌ను ఆదేశించింది. దాంతో కమిషన్ ఉరిశిక్ష విధింపుపై అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, డీఎంకే ఎంపీ కనిమొళి, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షను రద్దు చేయాలని అభిప్రాయపడగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన దుష్యంత్ దవే తదితరులు ఉరిశిక్ష అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎక్కువమంది ఉరిశిక్షను రద్దు చేయాలనే అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం. నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడమే భారతీయ శిక్షాస్మృతి ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. అత్యంత హేయమైన నేరాల్లో మరణ శిక్షను విధించడం అమానవీయం, పాశవికం కాబోదని, అది జీవించే హక్కును ఉల్లంఘించడం కాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో.. లా కమిషన్ ఎలాంటి సిఫారసులు చేయబోతోందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేయడం లాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని, సాధారణ నేరస్తులే కాకుండా, ఉగ్రవాద సంస్థలు సైతం ఈ నేరాలకు పాల్పడుతున్నాయని, అందువల్ల, వారికి ఐపీసీ 364ఏ కింద మరణ శిక్ష విధించడం సబబేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. -
మరణ శిక్ష రద్దుకు కలాం మొగ్గు
న్యూఢిల్లీ: మరణ శిక్ష రద్దు చేయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయ పడ్డారు. తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు.. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల పడ్డ మరణ శిక్షలపై నిర్ణయం తీసుకోవడానికి చాలా బాధపడ్డానని అన్నారు. 1990లో జరిగిన ఒక కేసులో మాత్రం లిఫ్ట్ ఆపరేటర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని.. ఆ కేసులో మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. లా కమిషన్ మరణ శిక్షపై స్పందించమని అడిగిన 400 మంది ప్రముఖుల్లో అధిక శాతం దాన్ని కొనసాగించాలనే అభిప్రాయపడగా.. ఎత్తివేయాలన్న కొద్దిమందిలో కలాం ఒకరు. తాను రాష్ట్రపతిగా బాగా ఇబ్బంది పడ్డ అంశాల్లో కోర్టులు విధించిన మరణ శిక్షపై నిర్ణయం ఒకటని ఆయన లా కమిషన్ కన్సల్టేషన్ పత్రంలో పేర్కొన్నారు. -
'ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు'
న్యూఢిల్లీ: భారత్‌లో ఉరిశిక్ష రద్దు చేసేందుకే తాను మద్దతిస్తానని భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఒక రాష్ట్రపతిగా ఉరిశిక్షకు సంబంధించిన కేసులు తన ముందుకు వచ్చినప్పుడు ఎంతో మధనపడేవాడినని, సాధారణంగా అలా వచ్చే కేసులన్నీ కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారివే అయ్యుండేవని చెప్పారు. దేశంలో ఉరిశిక్ష చట్టం పై లాకమిషన్ కొందరు నిపుణుల కొంతకాలంగా సంప్రదిస్తోంది. వారికి ప్రత్యేక పత్రాలు అందించి అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. ఇందులో భాగంగా అబ్దుల్ కలాంను సంప్రదించగా ఆయన ఉరిశిక్ష చట్టం రద్దుకే మొగ్గు చూపి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పిన అతికొద్దిమంది సరసన చేరారు. నేరుగా నేరానికి పాల్పడినవారిని ఉరితీస్తున్నామా.. లేక ప్రలోభాలకు తలొగ్గి నేరాలకు పాల్పడుతున్నవారిని శిక్షిస్తున్నామా అని ప్రతిక్షణం తాను ఆలోచిస్తూ ఉండేవాడినని కలాం చెప్పారు. ఈ సందర్భంగా 18 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసి ఉరిశిక్షకు గురైన ధనంజయ్ ఛటర్జీ కేసును ప్రస్తావిస్తూ.. ఇలా నేరుగా తీవ్ర నేరాలకు పాల్పడిన వారి విషయంలో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చని, అప్పుడు అలాగే తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఉరిశిక్ష చట్టాన్ని అప్ డేట్ చేసేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలని లాకమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఎన్నికల నిధుల కోసం ప్రత్యేక ట్రస్ట్
ఏర్పాటుకు పార్టీల సూత్రప్రాయ అంగీకారం సంస్కరణలపై పార్టీలతో సీఈసీ సంప్రదింపులు న్యూఢిల్లీ: ఎన్నికల్లో ధనబలానికి, కండబలానికి ముకుతాడు వేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆధ్వర్యంలో జాతీయ ఎన్నికల ట్రస్ట్(ఎన్ఈటీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు దేశంలోని పలు పార్టీలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించాయి. అయితే దీనిపై ఇంకా సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీలకు నిధులు, లా కమిషన్ సిఫార్సులపై సీఈసీ రాజకీయ పక్షాలతో సోమవారం సంప్రదింపులు జరిపింది. 38 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కార్పొరేట్ నిధుల కోసం ఈసీ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాన్నుంచి పార్టీలకు నిధుల పంపిణీ జరగాలన్న లా కమిషన్ సిఫార్సుకు 70 శాతం మంది ప్రతినిధులు మద్దతు తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎంత డబ్బు అవసరమౌతుందన్నది నిర్ణయించటం కష్టమైన పని అని కొన్ని పార్టీలు పేర్కొన్నాయి. ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్న ప్రజాధనాన్ని విద్య, మౌలిక సదుపాయాల వంటి వాటికోసం వెచ్చించాలన్న గట్టి అభిప్రాయం వ్యక్తమైంది. అమెరికాలో మాదిరిగా ప్రత్యర్థులు టెలివిజన్ చానళ్ల ప్రత్యక్ష చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపులో వివిధ ఈవీఎంలలో ఓటింగ్ జరిగిన విధానం బయటపడకుండా ఉండేందుకు టోటలైజర్ మెషిన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. దీని ద్వారా ఓట్లను మిక్సింగ్ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎన్నికల నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు అవసరంపై అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాయన్నారు. -
జడ్జీల సంఖ్య, రిటైర్మెంట్ వయస్సు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో,...హైకోర్టులు, ఇతర దిగువ కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సత్వరం చర్యలుతీసుకోవాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. హైకోర్టులలో ఖాళీగా ఉన్న 270 జడ్జీల పోస్టులను లా కమిషన్ ప్రస్తావించింది. కేసుల పరిష్కారానికి నిర్దిష్టమైన వ్యవధిని నిర్ణయించాలని స్పష్టంచేసింది. తన సిఫార్సులతో కూడిన నివేదికను లా కమిషన్ సోమవారం న్యాయ శాఖకు సమర్పించింది. దేశంలో ఉన్న 24 హైకోర్టుల న్యాయమూర్తులతో సమానంగా, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును కూడా 62ఏళ్లకు పెంచాలని, కేసుల విచారణకు హేతుబద్ధమైన కాలవ్యవధిని సత్వరం నిర్ణయించాలని కూడా లా కమిషన్ సూచించింది. జడ్జీల పనితీరు ప్రమాణాలను బే రీజు వేయడానికి కేసు కాలవ్యవధిని ప్రాదిపదికగా వినియోగించాలని కూడా సిఫార్సు చేసింది. దేశంలోని వివిధ కోర్టుల్లో 3.13కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం లోక్‌సభకు సమర్పించారు. సుప్రీంకోర్టులో 63,843కేసులు, హైకోర్టులలో 44.62లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు