న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఇప్పటిదాకా ప్రజల నుంచి 8.5 లక్షల ప్రతిస్పందనలు తమకు అందాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూ రాజ్ అవస్తీ బుధవారం చెప్పారు. యూసీసీపై అభిప్రాయాలు తెలియజేయాలని రెండు వారాల క్రితం లా కమిషన్ కోరిన సంగతి తెలిసిందే. యూసీసీపై రాజకీయ పక్షాలు, మత సంస్థలు, ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండడం సమంజసం కాదని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతికి ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మద్దతు పలికింది. అయితే, ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment