Opinions
-
USA Presidential Elections 2024: భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు. ‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..అబార్షన్హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.చట్టాల అమలు/ ప్రజాస్వామ్యంహారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు. ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పులు/ఇంథనంహారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్/ ఉక్రెయిన్యుద్ధాలుహారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు.ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.ప్రభుత్వపాలనహారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్‌ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్‌సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్‌సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉమ్మడి పౌర స్మృతిపై 8.5 లక్షల ప్రతిస్పందనలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఇప్పటిదాకా ప్రజల నుంచి 8.5 లక్షల ప్రతిస్పందనలు తమకు అందాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూ రాజ్ అవస్తీ బుధవారం చెప్పారు. యూసీసీపై అభిప్రాయాలు తెలియజేయాలని రెండు వారాల క్రితం లా కమిషన్ కోరిన సంగతి తెలిసిందే. యూసీసీపై రాజకీయ పక్షాలు, మత సంస్థలు, ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండడం సమంజసం కాదని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతికి ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మద్దతు పలికింది. అయితే, ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని సూచించింది. -
మార్పు ఒక సాంత్వన
మార్పును పొందడం, మారడం బతుకుతున్న మనిషికి ఎంతో అవసరం. మనిషి రాయి కాదు మార్పును పొందకుండా మారకుండా పడి ఉండడానికి. బతుకుతున్న మనిషి మార్పును పొందుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. బతకడానికి సిద్ధంగా ఉన్న మనిషి మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక మనిషి మారకపోవడం అతడు సరిగ్గా బతకలేక పోవడమూ, బతకకపోవడమూ అవుతుంది. ‘నువ్వు ఇక్కడ ఉంది బతకడానికి; నువ్వు ఇక్కడ ఉంది ఆడడానికి; నువ్వు ఇక్కడ ఉంది బతుకును అనుభవించడానికి‘ అని ఓషో చెప్పా రు. మార్పు లేకుండా, మారకుండా రాయిలా బతికితే ఎలా? బతుకుతూ ఉండడానికి, బతుకును అనుభవిస్తూ ఉండడానికి మనిషిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉండాలి; మనిషి తనను తాను మార్చుకుంటూ, తనకు తాను మార్పులు చేసుకుంటూ బతుకును ఆస్వాదిస్తూ ఉండాలి. ర్పుల్ని స్వీకరించని మనిషికి, మారని మనిషికి, ఊరట ఉండదు, సాంత్వన ఉండదు. ‘ఎవరికి ఏది తెలియదో అది వాళ్లకు ఉండదు’ అని తాత్త్వికకృతి త్రిపురారహస్యం మాట. మారడం తెలియనివాళ్లకు మార్పు అనేది ఉండదు. మార్పు లేనివాళ్లకు బతుకు సరిగ్గా ఉండదు. అంతేకాదు బతకడమే భారమైపోతుంది. మనిషిలో మార్పులు రాకపోడానికి ముఖ్యమైన కారణాలు అభిప్రాయాలు. అభిప్రాయాల వలలో చిక్కుకుపోయినవాళ్లు మారడం చాతకాకుండా మానసికంగా బాధపడుతూనే ఉంటారు; తమవాళ్లను అదేపనిగా బాధపెడుతూనే ఉంటారు. అభిప్రాయాలకు అతీతమైన అవగాహన మనిషికి అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. వయసువల్ల మనిషికి శారీరికమైన మార్పులు రావడం సహజం. ఆ విధంగానే ప్రతి మనిషికీ ఆలోచనపరంగా, దృక్పథంపరంగా, ప్రవర్తనపరంగా, మనస్తత్వంపరంగా మార్పులు రావాలి. మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిన కంప్యూటర్లను మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని కూడా మనం మాటిమాటికీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండడంవల్ల జడత్వం లేదా స్తబ్దత తొలగిపోతుంది. జడత్వం, స్తబ్దతలు తొలగిపోతున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది. మన జీవితాన్ని మన మస్తిష్కం నిర్ణయిస్తుంది. మస్తిష్కంలో మార్పులు రాకపోతే జీవితంలో మార్పులు రావు. మారని మస్తిష్కం మొద్దులాంటిది. మస్తిష్కం మొద్దుగా ఉంటే జీవితం మొద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఇలా మొద్దుబారిన జీవితాలతో చాలమంది కనిపిస్తూ ఉంటారు. మార్పులకు మాలిమి అవని వాళ్లు మానసికరోగులుగా కూడా అయిపోతారు. కొంతమంది ఉన్మాదులుగా అయిపోవడానికి కారణం వాళ్లలో మార్పు అనేది రాకపోవడమే; వాళ్లకు మార్పు అవసరం అని వాళ్లు గ్రహించకపోవడమే. ప్రపంచానికి ఎంతో కీడు చేస్తున్న మతోన్మాదం,ప్రాం తీయవాదం, ముఠాతత్త్వం వంటివాటికి మూలం మారని, మారలేని మనుషుల మనస్తత్వమే. మనుషులు పసితనం నుంచి మారుతూ వచ్చాక ఒక వయసు తరువాత మారడాన్ని ఆపేసుకుంటారు. తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, అభిరుచులు, ఉద్దేశాలు, ప్రవర్తన సరైనవే అని తీర్మానించుకుని తమలో తాము కూరుకుపోతూ ఉంటారు. మారకపోవడం తమ గొప్పతనం అని నిర్ణయించుకుంటారు. అటుపైన వాళ్లు మూర్ఖులుగానో, చాదస్తులుగానో, తిక్కవ్యక్తులుగానో, పనికిరానివాళ్లుగానో, అసూయాపరులుగానో, దొంగలుగానో, ఇంగితం లేనివాళ్లుగానో, వంచకులుగానో, చెడ్డవాళ్లుగానో, హంతకులుగానో రూపొందుతూ ఉంటారు. సంఘానికి, ప్రపంచానికి మారని పలువురివల్ల ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. మారకపోవడంవల్ల మనుషులు మనుషులకు అపాయకరమైపోతూ ఉన్నారు. మార్పును పొందడం, మారడం మనుషులకు ఉండి తీరాల్సిన లక్షణం. ఊరట, సాంత్వన కావాలంటే, రావాలంటే, ఉండాలంటే మనుషులు మారడం నేర్చుకోవాలి. మారడం నేర్చుకుని మనుషులు శాంతంగా బతకాలి. – రోచిష్మాన్ -
ఎనిమిదేళ్లలో చేసిందీ, చేయాల్సిందీ!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. అరవై ఏళ్లలో రెండు ఉత్తుంగ తరంగాల్లా సాగిన ఉద్యమం ఫలితంగా... ఎట్టకేలకు సకల జనుల కలను సాకారం చేస్తూ ‘తెలంగాణ’ ఆవిర్భవించింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జనం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు ఉద్యమపార్టీ హోదాలో అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరికించామని ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదనీ, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కన్న కల నిజమయింది! తెలంగాణకు సంబంధించి 2014 జూన్ 2 ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాత కె. చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకా రమైన రోజు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు! కొత్త రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు. తమ భవిష్యత్తు మీద ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్న రోజు!! ఎనిమిదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసు కుంటే... తెలంగాణ ప్రజల ఆశలు చాలా వరకు నెరవేరినట్లే అనిపిస్తుంది. ఏవో కొద్ది ప్రాంతాల్లో తప్ప తెలంగాణ అంతటా సాగునీటికీ, తాగునీటికీ ఇబ్బందులు తొలగాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజా బ్‌ను పక్కకు నెట్టేసి మనం ముందుకుపోతామని ఏ తెలంగాణ బిడ్డ అయినా అనుకున్నాడా! పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా వేల రూపాయలు అంది స్తారని ఏ రైతైనా ఊహించాడా? రైతు చనిపోతే కుటుంబం వీధినపడే పరిస్థితి నుంచి రూ. 5 లక్షల బీమా సొమ్ముతో ప్రభుత్వమే కుటుంబాన్ని నిల బెడుతుందని అనుకున్నామా? 24 గంటల కరెంటు సరఫరాను ఊహించామా! ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ప్రభుత్వమే చేస్తుందనీ, మంచినీళ్ల కోసం బిందెలు భుజాన పెట్టుకొని ఫర్లాంగ్ల కొద్దీ నడి చిన ఆడపడుచులకు ఇంటి ముంగిట నల్లా తిప్పు కుంటే నీళ్లు వచ్చే రోజులు వస్తాయనీ భావించారా! గాంధీ, ఉస్మానియా తప్ప.. మరో ఆస్పత్రి దిక్కులేని పరిస్థితుల నుంచీ... ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఆస్పత్రి ఉంటుందని కలలోనైనా అను కున్నారా? చదువుకు గతిలేని పరిస్థితుల నుంచి దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఏ పండితు డైనా భాష్యం చెప్పాడా? చేనేత కార్మికులకు నూలే ఉరితాడయ్యే దశ నుంచి... ‘బతుకమ్మ చీరల’తో భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని ఎవరైనా భరోసా ఇచ్చారా? ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక బక్కాయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఇందుకు ఆయన ప్లానింగ్, దార్శనికత, ముందుచూపు, విషయ పరిజ్ఞానం, కృషి, పట్టుదలలే కారణం. ఇవే ఆయననూ, తెలం గాణ రాష్ట్రాన్నీ ముందుకు నడిపించాయి. తెలం గాణ అస్తిత్వ, ఆత్మగౌరవాలకు ప్రతీక కేసీఆర్!! – డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సాధించాల్సింది ఎంతో..! తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా అవ లంబిస్తున్న విధానాలు, చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పథ కాలు; పదవుల పంపకాలు, పైరవీలు, పంచాయి తీలు వంటి అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వచ్చిందని అడి గితే... ఆత్మ స్థైర్యం వచ్చిందనీ, ఆత్మ గౌరవం పెరిగిందనీ,‘మాది తెలంగాణ ’ అని సగర్వంగా చెప్పుకునే సాధికారికత సిద్ధించిందనీ చెప్పుకోగలి గిన స్థితిలో ఉన్నాం. మన పండుగలు, మన భాష యాస, మన పాటలు, పాఠాలతో తలెత్తుకొని నిల బడి గెలిచి నిలుస్తోంది తెలంగాణ.. ‘మా నిధులు మాకే’ అన్న కల నిజమైన వాస్తవాన్ని హర్షించ కుండా ఉండలేం. రాష్ట్రం తన నిర్ణయాలను తానే తీసుకుంటూ, తన తప్పుల్ని తానే సరిదిద్దుకుని, తన ముద్రను బలంగా వేస్తూ... జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తున్న నేప థ్యంలో ‘తెలంగాణ నాది’ అని సగర్వంగా చెప్ప కుండా ఉండలేం. అయినా అందుకోవాల్సిన లక్ష్యాలూ, నెరవేర్చాల్సిన ఆకాంక్షలూ ఉన్నాయి. ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలకు మరింత చేయూతను అందిం చాల్సిన అవసరం కనబడుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆంధ్ర హవా పెరిగిపోవడం, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారే పరిపాలనలో కీలక స్థానాల్లో కొనసాగడం బాధ కల్గించే విషయం. ప్రతి రంగంలో ఇక్కడి భూమి పుత్రులకే అవకాశాలు దక్కేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఏ రాష్ట్రం పోటీ పడలేని విధంగా కొద్దికాలంలోనే 426 పథ కాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటి స్తోంది. సంతోషమే! కానీ, రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ ప్లీనరీలలో, బహిరంగ సభల్లో; తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో లలో పేర్కొన్న అనేక అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. సమర్థ నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమ మైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ప్రశ్నించేతత్వం ఉన్నప్పుడు నాయకత్వం మరిం తగా సమర్థమంతమవుతుంది. అప్పుడే సకల జనుల అభివృద్ధీ సాధ్యమవుతుంది. – సురేష్ కాలేరు, తెలంగాణ ఉద్యోగుల సంఘం సహాధ్యక్షులు, మొబైల్: 98661 74474 అమరవీరుల కుటుంబాల సంగతేమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి అమరులయ్యారు. అయితే రాష్ట్రం సిద్ధించినా అమరుల కుటుంబాల పరిస్థితి ఇంకా మారలేదు అనేది వాస్తవం. దాదాపు 1,200 మంది తెలంగాణ వాదులు మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పో యారు. కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదు కుంటామని చెప్తూ మొదటి అసెంబ్లీ సమావేశం లోనే బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీఓ నంబర్ 80 విడుదలయింది. దీనిలో అమరుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వడం, రూ. 10 లక్షలు ధనసహాయం చేయడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు గృహసముదాయం నిర్మించడం, అలాగే ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయడం, రాజధాని హైదరాబాద్‌లో పెద్ద స్మారక స్తూపాన్ని నిర్మించడం వంటి విషయాలను ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 576 మందికి మాత్రమే ఉద్యోగం, పది లక్షల రూపాయల ధన సహాయం లభించింది. మిగతా అమర వీరుల కుటుంబాలకు ఏ ప్రయోజనాలూ అందలేదు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా కేసీఆర్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాలని కోరు తున్నాం. అలాగే అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్మారక నిర్మాణంలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో అమర వీరుల చరిత్రను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయాలనీ కోరుతున్నాం. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ అమర వీరుల స్తూపాలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం. – నరేశ్ నాయక్ జర్పుల, తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ‘ 85005 85982 -
కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పదవిపై కాంగ్రెస్‌లో హీట్ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్యం ఠాకూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయనను సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ శనివారం కలిశారు. (చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్) అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర జరుగుతోందని, సోనియా, రాహుల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి) ‘‘కాంగ్రెస్ పార్టీలో అన్ని మామూలే సీఎల్పీలో సమావేశం ఎందుకు అనేది బయటకు చెప్పలేను.ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ చీలిపోకుండా ఉండేందుకు ఇంచార్జ్ ఠాకూర్‌ను కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డితో కలిసి మా మనసులో ఉన్నది చెప్పాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వివరించాం. రేపు చాలా ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కొవాలి. ఠాగూర్ అన్ని వివరించాం. ఆయన అన్ని నోట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతుంది అందరికీ తెలిసిందే. ప్రజలు అన్ని గమనించాలి. సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లేది ఇప్పుడే చెప్పలేం. సీఎల్పీ, పీసీసీ అధ్యక్షుడిని మేము ఇన్వాల్వ్ చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక మెజార్టీ అభిప్రాయం కాకుండా.. ఏకాభిప్రాయం సాధించాలి. ఒక ఇంచార్జ్ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడటం తప్పు కాదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు.. మా అభిప్రాయం చెప్పాం. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. కలిశాం. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాం. ఏకాభిప్రాయంతో్ ఎలాంటి పేరు చెప్పలేదు. సోనియాగాంధీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
నిజాలు నిగ్గు తేల్చాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజులక్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాలపైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేకి రాసిన లేఖ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖపై సుప్రీంకోర్టు విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని న్యాయకోవిదులు, ప్రముఖ న్యాయవాదులు కోరుతున్నారు. ఆ విచారణ పారదర్శకంగా ఉండాలని, అన్ని వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తములను, ప్రతిభావంతులను న్యాయమూర్తులుగా ఎంపిక చేయడంలో కొలీజియం వ్యవస్థ విఫలమైందంటున్నారు. పర్యవసానంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నది వారి అభిప్రాయం. బ్రిటన్, అమెరికాల తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దే శించే పకడ్బందీ నిర్మాణ స్వరూపం ఉన్నప్పుడే మెరుగైన న్యాయవ్యవస్థ సాధ్యమవుతుందని వారి భావన. నియామకాలు ప్రశ్నార్థకం... బదిలీలు ఏకపక్షం కొలీజియం వ్యవస్థ ద్వారా సాగుతున్న న్యాయమూర్తుల నియామకాలు, పదో న్నతులు, బదిలీలు వ్యక్తి ఆరాధనా సంస్కృతిని తీసుకొచ్చాయని, న్యాయ నియా మకాల కమిషన్ వంటి ఆదర్శనీయమైన విధానం అమల్లోకొస్తే తప్ప ఈ సంస్కృతి అంతరించే అవకాశం లేదని ప్రముఖ న్యాయకోవిదుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ వంచన తప్ప మరేమీ కాదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌కు రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయా ల్లోని ముఖ్యాంశాలు. కొలీజియం వ్యవస్థ ఒక క్లబ్‌గా, గూడు పుఠాణిగా సాగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది. ప్రశ్నార్థకమైన నియామకాలు, ఏకపక్ష బదిలీలు మన న్యాయ వ్యవస్థలో ఎన్నో. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ముర ళీధర్, బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి (ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ ఏకే కురేషీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్పీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌లను వివాదాస్పదమైన రీతిలో, అనూహ్యంగా బదిలీ చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయాలకు ఖచ్చి తంగా కొలీజియం విధానమే కారణం. ఆరోపణలు చేయవద్దనడం అర్ధరహితం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చిన న్యాయమూర్తిని, ఆయన ఇంత క్రితం పనిచేసివచ్చిన హైకోర్టుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కొలీజియం సంప్రదిస్తోంది. ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల భవిష్యత్తు అవకాశాలన్నీ ఆ సీనియర్ న్యాయమూర్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటాయి. ఇలా సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయమూర్తికీ చాలా పలుకుబడి వుంటుంది. అయితే వారిలో కొందరు తెలివైనవారు దాన్ని ఉపయోగించరు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగానికి నాయకత్వంవహిస్తున్నవారు, మరో రాజ్యాంగ వ్యవస్థకు చెందినవారిపై ఆరోపణలు చేయడం సరైందేనా అనేది ఇప్పుడు అర్థరహితమైన చర్చ. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణన్నీ ఇప్పుడు జనసామాన్యంలో ఉన్నాయి. కనుక వాటిపై తీసుకునే నిర్ణయం కూడా అందరికీ తెలిసేవిధంగానే వుండాలి. ఒక అంతర్గత కమిటీ ద్వారా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తారా లేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా దీన్ని విచారిస్తారా అన్నది తేల్చుకోవాలి. భూ లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జగన్మోహన్రెడ్డి లేఖలో ప్రస్తావనకు రాని న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. ఆ విచారణ పారదర్శకంగా వుండాలి. అది వెంటనే మొదలు కావాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబో తున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం బహుశా ఇదే మొదటిసారి. ఆ రకంగా చూస్తే అది అసాధారణమైనది. పైగా ఒక ముఖ్యమంత్రే ఆ ఆరోపణలను బహిరంగపర్చే ధైర్యం చేయడం మరింత అసాధారణమైనది. ఇందులోని నిజానిజాలు తేల్చనంతకాలం ప్రజానీకం మనసుల్లో అవి సజీవంగా వుంటాయి. ఈ లేఖ న్యాయవ్యవస్థపై ప్రజల కుండే విశ్వాసాన్ని ఒక కుదుపు కుదిపింది. కనుక న్యాయవ్యవస్థ దీనిపై మౌనంగా వుండిపోకుండా తగినవిధంగా వ్యవహరించాలి. ఇది విస్తృత సమస్య జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలపై దాఖలైన ఎఫ్ఐఆర్పై ఎలాంటి వార్తలు రాకూడ దంటూ హైకోర్టు విధించిన గ్యాగ్ ఆర్డర్ గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయానికి విరుద్ధమైనది. న్యాయవ్యవస్థ ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్రపక్షి బాప తుగా వున్నదని... అది వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కొనడానికి, సమస్యలతో నేరుగా వ్యవహరించడానికి సిద్ధంగాలేదని అందరూ అనుకునేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి లేఖను ఒక రాజకీయ నాయకుడికి, ఒక న్యాయమూర్తికి సంబంధించిన అంశంగా చూడకూడదు. ఇది అంతకన్నా విస్తృత మైనది. వ్యవస్థీకృత సమస్య. గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థకు ఒక దాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు వస్తున్నాయి. ఇది న్యాయమూర్తుల మీడియా సమావేశంతో మొదలైంది. జవాబు దారీతనం కోసం మనకు అభిశంసన వుంది. కానీ అది సంక్లిష్టమైనది. ఆచరించడానికి కష్టమైనది. మరొకటి అంతర్గత కమిటీ. అది చాలా బల హీనమైనది. తప్పు చేశారని గుర్తించిన న్యాయమూర్తికి విధించదగ్గ పెనాల్టీ ఏమిటో స్పష్టత లేదు. ఆరోపణలు పెరుగుతూ... వ్యవస్థ ప్రతిష్ట మసక బారు తున్నప్పుడు ఒక పటిష్టమైన, స్పష్టమైన జవాబుదారీ వ్యవస్థ ఏర్పడాలి. దుర దృష్టవశాత్తూ అందుకు అవసరమైన చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధానం లేదు. కొన్నేళ్లక్రితం జవాబుదారీతనాన్ని నిర్ణయించే బిల్లు రూపొందింది. కానీ అది కాస్తా మురిగిపోయింది. అందులో ఎన్ని లోపాలున్నా న్యాయ సంస్కరణలు ప్రారంభించడానికి అదొక ప్రాతిపదికగా వుండేది. బ్రిటన్, అమెరికా తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దేశించే లిఖితపూర్వకమైన కోడ్, పకడ్బందీ నిర్మాణ స్వరూపం మనకు అత్యవసరం. జస్టిస్ ఏపీ షా (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) న్యాయస్థానంలో తుపాను.. ప్రజాస్వామ్యం చిట్టచివరి కాపలాదారు అయిన న్యాయవ్యవస్థ తనపై అనుమానాలకు అతీతంగా తన్నుతాను కాపాడుకోవాలి. 2021 ఏప్రిల్ 24న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీస్వీకారం చేయవలసిన రెండో స్థానంలో ఉన్న సీనియర్ జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన తీవ్రమైన ఆరోపణలను పరిష్కరించవలసిన అవాంఛిత భారాన్ని ప్రస్తుతం న్యాయవ్యవస్థ మోస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలను సుప్రీంకోర్టు సులభంగా తోసిపారేయలేదు. ఆయన తన ఆరోపణల నివేదికను అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేకి సమర్పించారు, అక్టోబర్ 10న ముఖ్యమంత్రి ప్రధాన సలహా దారు అజయ్ కల్లాం విజయవాడలో ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యనిర్వాహకవర్గం, న్యాయస్థానంపై స్వారీ చేయకూడదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే జడ్జీలపై ఫిర్యాదు చేసినవారిలో ఏపీ ముఖ్యమంత్రే మొదటివారు కారు. 1960లలో ఏపీ ముఖ్యమంత్రి డి. సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి న్యాయస్థానంలో కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ నాటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సానుకూలంగా పరిష్కరించారు. ప్రస్తుత కేసులో ఏపీ సీఎం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దాన్ని బహిర్గతం చేయడమనేది స్పష్టంగానే న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ప్రయత్నమనీ, ఇది కచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇలాంటి ఎత్తుగడలను భారతీయ బార్ కౌన్సిల్ కూడా ఖండిం చింది. అయితే విమర్శల నోరు మూయించడానికి కోర్టు ధిక్కారం అనేది ఎల్లప్పూడూ తొలి ఆయుధంగా ఉపయోగించరాదు. సుప్రీంకోర్టు పనితీరు సరిగా లేదని, ముఖ్యమైన కేసులను ఎంపిక చేసుకున్న బెంచ్‌లకే కేటాయిస్తున్నారని ప్రకటిస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 2018 జనవరి 12వ తేదీన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆరోపించినప్పుడే న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే చట్రాన్ని పాటిస్తోందని ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. జవాబుదారీతనం లేకుండా న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం ఉనికిలో ఉండదు. జస్టిస్ రమణ, ఏపీ హైకోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై ఏపీ సీఎం చేసిన ఆరోపణలను సులభంగానే నిర్ధారించవచ్చు. ఈ ఆరోపణలు నిజం కాదని విచారణలో తేలితే ఏపీ ముఖ్యమంత్రిపై కోర్టు ధిక్కార నేరం మోపవచ్చు. కానీ ఏపీ సీఎం ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లయితే, దానిపై తీర్మానం చేయడం సమస్యలను కొనితెస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) చెబుతున్నది ఏమిటంటే, ‘‘పార్లమెంటులోని రెండు సభల్లో ఉన్న సభ్యుల్లోని మెజారిటీ ఆమోదించిన తర్పాత రాష్ట్రపతి ఆదేశం ప్రకారం తప్ప మరేవిధంగానూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తన పదవి నుంచి తొలగించలేరు. పైగా దుష్ప్రవర్తన లేక అసమర్థత ప్రాతిపదికన పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో మాత్రమే న్యాయమూర్తిని తొలగించగలరు’’. అందుకే న్యాయమూర్తిని తొలగించాలనుకుంటే అది మాటల్లో చెప్పినంత సులభం కాదు. (ది స్టేట్స్‌మన్ సంపాదకీయం) నిగూఢతవల్లే సమస్య.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖ.. న్యాయమూర్తుల ప్రవర్తనపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పర్చాల్సిన అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాస్పద భూముల కొనుగోలులో జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలకు పాత్ర ఉందని ఆరోపిస్తున్న ఏపీ సీఎం లేఖలోని వాస్తవాలు, తదితర వివరాలకు నేను పూచీపడలేను కానీ రాజ్యాం గబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మరొక రాజ్యాంగ ప్రతినిధి అయిన న్యాయమూర్తిపై లాంఛనప్రాయంగా ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదులో తీవ్రమైన అరోపణలు ఉన్నప్పుడు ఆ లేఖను తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ఆ లేఖలో ఆరోపించిన విషయాలను చీఫ్ జస్టిస్ నియమించిన స్వతంత్ర వ్యక్తి నిర్ధారించాల్సిన అవసరముంది. పైగా ఆ లేఖ లోని విషయాలు తప్పు అని జాతికి నిరూపించాల్సిన బాధ్యత కూడా న్యాయవ్యవస్థపైనే ఉంది. పైగా ఆ నిర్ధారణ చాలా పారదర్శకంగా కనిపించాలి కూడా. భారత రాజ్యాంగాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అంతిమంగా న్యాయవ్యవస్థపైనే ఉంది. దానికోసం న్యాయవ్యవస్థ చాలా బలంగానూ, స్వతంత్రంగానూ పనిచేయాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. ఏపీ సీఎం లేఖ వెనుక ఉన్న ఉద్దేశాల గురించి నేను ఊహించి చెప్పలేను. కానీ అలాంటి లేఖ రాయడమన్నదే అత్యంత అసాధారణమైన విషయం. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. కార్యదీక్షాపరుడైన రాజకీయనాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఏపీ సీఎం ఇలా అడుగేయడానికి స్పష్టంగానే తగిన కారణాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సుదీర్ఘకాలం ఆలోచించిన తర్వాతే ఆయన అలాంటి చర్యకు తప్పనిసరై పూనుకుని ఉండవచ్చు. ఏపీ సీఎంపై కేసులు వాయిదాలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖ రాశారని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో మళ్లీ అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కూడా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బాధ్యతాయుతమైన, ప్రతిష్ట కలిగిన న్యాయవ్యవస్థ ప్రతినిధి. ఈ విషయంలో ఆయన ఒక తెలివైన, సరైన చర్య తీసుకోగలుగుతారని నా నమ్మకం. జాతి విస్తృత ప్రయోజనాలు, సుప్రీంకోర్టు వంటి ఒక గొప్ప వ్యవస్థ సమగ్రత, స్వాతంత్య్రం పరిరక్షణపై ఆయనకు మంచి సలహాలు అందుతాయని చెప్పడం తప్పితే ఈ అంశంలో ఆయన ఏవైపు అడుగు వేస్తారనే దానిపై నేను ఊహించి చెప్పలేను. ఈ సమస్యను అలా పక్కన పెట్టేయడం కాకుండా సరైన రీతిలో చర్య చేపడతారని నా భావన. సీనియర్ న్యాయమూర్తి కొందరు జడ్జిల పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారంటూ ప్రస్తుతం వివాదం చెలరేగిన నేపథ్యంలో జడ్జీల నియామకంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీలను కొలీజియం వ్యవస్థ నియమించే పద్ధతిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. 1992–2003లో ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు దఖలుపర్చుకున్నప్పటి నుంచి న్యాయవ్యవస్థ పనితీరు మున్నెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిందని భావిస్తున్నాను. అందుబాటులో ఉన్న వారిలో ఉత్తమమైన న్యాయమూర్తులను ఎంపిక చేయడంలో కొలీజీయం విఫలమైంది. ఇలాంటి నియమకాలు చేసేటప్పుడు పూర్తి స్వతంత్రత కలి గిన వ్యవస్థ చాలా అవసరం. దేశంలోని అన్ని అధికారిక సంస్థలు పారదర్శకంగానూ, జవాబుదారీతనంతోనూ ఉండాలని న్యాయవ్యవస్థ నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి న్యాయవ్యవస్థ అత్యంత బాధ్యతారహితమైన, అపారదర్శకమైన వ్యవస్థగా ఉంటోంది. పాలనావిషయానికివస్తే న్యాయవ్యవస్థ అంతర్గత పని విధానం గురించి ఎవరికీ తెలీదు. న్యాయవ్యవస్థ నిగూఢత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు కానీ, వాటిని సుప్రీం కోర్టు తోసిపుచ్చడమే కాకుండా అలా ఆరోపించిన మహిళను ఉద్యోగం నుంచి తొలిగించి, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాతే ఆమెకు తిరిగి ఉద్యోగం కల్పించిన వార్త కానీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అలాగే అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలికో పాల్ ఆత్మహత్య చేసుకుంటూ ఇద్దరు మాజీ చీఫ్ జస్టిస్‌లు జేఎస్ కెహర్, దీపక్ మిశ్రాలపై ఆరోపించడం, ఆయన భార్య ఈ విషయమై చేసిన ఫిర్యాదును విచారణ లేకుండానే మరుగునపడేయడం కూడా తెలిసిన విషయమే. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనలో మాత్రం కోర్టు వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల వ్యక్తిగత ప్రవర్తనను ప్రశ్నించే ఆస్కారమే మన వ్యవస్థలో లేదు. ఇక వారిపై విచారణ గురించి చెప్పపనిలేదు. సుదీర్ఘకాలంలో ఈ పరిస్థితి మార్పు చెందుతుందనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏపీ సీఎం జగన్ లేఖ అలాంటి యంత్రాం గాన్ని ఏర్పర్చే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందిస్తోంది. పైగా న్యాయమూర్తులు కూడా చట్టపరిధిలోనే ఉంటారని విశ్వాసం కలిగిస్తూ పౌరుల్లోని భయాలను ఇది తొలగిస్తుంది కూడా. సుప్రీంకోర్టుకు తాను రాసిన లేఖను ఏపీ సీఎం గుట్టుగా ఉంచాలని నేను తప్పక భావిస్తాను. కానీ ఆయన అలా గుట్టుగా పెట్టినా మన మీడియా ప్రతి దాన్నీ బట్టబయలు చేస్తోంది. కాబట్టి ఎంత రహస్యంగా ఉంచినా ఇలాంటివి జనాలకు అనివార్యంగా తెలిసిపోతుంటాయి. దుష్యంత్ దవే వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) షాక్ ట్రీట్మెంట్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనౌచిత్యంపై అవినీతిపై, ఏపీ హైకోర్టు జడ్జీలపట్ల పాక్షికత ప్రదర్శించడంపై ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ద్వారా మొత్తం న్యాయవ్యవస్థపైనే బాంబు విసిరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక, అమరావతి నూతన రాజధాని సరిహద్దులను ప్రకటించిన మధ్యకాలంలో వ్యవసాయ భూముల కొనుగోలు గురించి ఆ లేఖ ప్రస్తావించింది. రాజధాని సరిహద్దులు గుర్తించిన తర్వాత అక్కడి భూములను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు కొనుగోలు చేసిన వైనాన్ని పేర్కొంటూనే, రాజధాని సరిహద్దులు గీయక ముందు ఉన్న తక్కువ ధరలతో ఆ భూమిని వారు కొన్నారని, ఆవిధంగా వారికి భారీ ప్రయోజనం సిద్ధించిందని ఏపీ సీఎం లేఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ అమరావతి భూముల కొనుగోలుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. గత ప్రభుత్వంలో అధికార స్థానాల్లో ఉన్నవారు తమ హోదాను దుర్వినియోగపర్చి రాజధాని సరిహద్దులను తమకు అనుగుణంగా మార్చి తమ బంధువులు, వాణిజ్యవర్గాలు, కుటుంబ సభ్యులు, రాజ కీయ పార్టీ సభ్యులు వాటిని అక్రమంగా కొనుగోలు చేసేలా ప్రేరేపించారని ఆరోపించారు. ప్రత్యేకించి రాజకీయంగా సున్నితమైన కేసులను ఏపీ హైకోర్టులో తనకు అనుకూలురైన జడ్జీలకు కేటాయిస్తూ న్యాయవిచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు జడ్జిపై వైఎస్ జగన్ ఆరోపించారు. అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నివేదికపై అన్ని విచారణలను నిలిపివేయాలని హైకోర్టు అర్థరాత్రి వేళ ఆదేశాలు జారీ చేయడం వెనుక గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూల వైఖరి ప్రదర్శించడమే కాకుండా సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలు, మాజీ అడ్వొకేట్ జనరల్‌పై ఆరోపణలపై కూడా స్టే విధింపచేశారని ఏపీ సీఎం తన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. యావత్ దేశాన్ని నివ్వెరపర్చిన ఈ పరిణామాల నేపథ్యంలో రెండు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతిని ఉద్దేశించి రాసిన ఆ లేఖను బహిరంగపర్చవచ్చా? 2. ఈ లేఖ పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందన ఏమిటి? న్యాయమూర్తిపై అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముగ్గురు న్యాయమూర్తులతో ఇన్ హౌస్ విచారణ జరపాలని 1997లో ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేయరాదని అప్పట్లో కోర్టు పేర్కొంది కానీ ఈ ఆదేశం మాటున జడ్జీలపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలను ప్రజలకు తెలుపకుండా దాచి ఉంచే మార్గాన్ని న్యాయవ్యవస్థ కనుగొంది. ఇప్పుడు వైఎస్ జగన్ రాసిన లేఖను మీడియాకు బహిరంగపర్చడంపై చర్య తీసుకోవాలని కొందరు పిటిషన్లు వేశారు. కానీ ఒక రాష్ట్ర సీఎంపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడం వ్యతిరేకఫలితాలను తేవడమే కాకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్టకు మరింత నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంది. వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. జడ్డీల ప్రవర్తనా నియమావళికి భంగం కలిగినప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే విచారణ చేయాలి. కానీ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావలసిన వ్యక్తిపై ఆరోపణలను ఆయనకు కింది స్థానంలోని జూనియర్ జడ్డీలు నమ్మదగిన రీతిలో విచారించడం కష్టసాధ్యం అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయిపై ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఇన్ హౌస్ విచారణ చేసిన బెంచ్ ఆ మహిళ లాయర్ని అనుమతించలేదు. న్యాయవిచారణ ప్రక్రియను రికార్డు చేయడానికి కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం సుప్రీం కోర్టు జడ్డిపై చేసిన ఆరోపణలను అత్యంత విశ్వసనీయత కలిగిన రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి. ఇది మాత్రమే న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచగలదు. ప్రశాంత్ భూషణ్ వ్యాసకర్త సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది (ది హిందూ సౌజన్యంతో) ఆ లేఖ విస్మరించలేనిది.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖను న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని కొట్టిపారేయలేం. ఏపీ హైకోర్టు అనేక సందర్భాల్లో న్యాయదీపంలా కనిపించేది కానీ నేడు రాజ్యవ్యవస్థ మూడు విభాగాల్లో ఒకటైన కార్యనిర్వాహకవర్గం న్యాయవ్యవస్థ పైన, హైకోర్టుపైనే విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోంది. తొలి చీఫ్ జస్టిస్‌గా, తర్వాత 1966లో 9వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావును మర్చిపోగలమా? ఇతర హైకోర్టులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన మన జస్టిస్ ఓ చిన్నపరెడ్డిని మరవగలమా? ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాసి సీజేఐకి పంపడం కలవరం కలిగించింది. ఏపీ సీఎంకి న్యాయవ్యవస్థతో తగవు ఉంది కాబట్టి అలాంటి లేఖ రాశారని కొందరు వాదిస్తున్నారు కానీ ఏపీ హైకోర్టు పనితీరును ఎవరూ కప్పిపుచ్చలేరు. ఏపీ హైకోర్టు సుప్రీం న్యాయమూర్తి విశ్వాసపాత్రుల నియంత్రణలో ఉందని, పైగా తన రాజకీయ ప్రత్యర్థికి అనుకూలంగా తన విధానాలకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తోందని ప్రస్తుత సీఎం ఆరోపణ. ఇక హైకోర్టు వాదన ఏమిటంటే తనకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో జరుగుతున్న ప్రచారానికి కారకులపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నదే. అదేసమయంలో అమరావతి భూ కుంభకోణంలో పాత్ర ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్, ఇతర పాత్రధారుల అరెస్టును కోరుతూ దాఖలైన ఎఫ్ఐఅర్ని సైతం మీడియాలో ప్రచురించరాదని అర్థరాత్రి ఆదేశాలు చేసిన హైకోర్టు వ్యవహారం చాలామందిని కలపరపర్చింది. మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల పేర్లు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పైనే నిషేధం విధించడం న్యాయవ్యవస్థ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. అంతకుమించి అనేక కేసుల్లో హైకోర్టు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సంతోషంగా లేదు. పైగా హైకోర్టు ఆదేశాల పట్ల వ్యాఖ్యానాలు చేసిన ఎంపీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ పట్ల కూడా కోర్టు ధిక్కార చర్య కింద విచారణకు ఆమోదం తెలుపడంతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా హైకోర్టు వ్యవహరిస్తోందని ఏపీ సీఎం ఆరోపించడం, హైకోర్టు పట్ల ప్రభుత్వం శత్రుపూరిత వైఖరిని అవలంబిస్తోందని హైకోర్టులో రిట్ పిటిషన్ దఖలు కావడం రెండు రాజ్యాంగ సంస్థల మధ్య సఖ్యత లేదని స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టుపై దాఖలైన రిట్ పిటిషన్ వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హస్తముందని హైకోర్టు భావించడంతో రెండు రాజ్యాంగ సంస్థల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సస్పెండైన న్యాయమూర్తితో మాట్లాడిన సంభాషణలన్నీ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా సాగించిన కుట్రలో భాగమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భావించింది. రాజ్యాంగంలోని 226వ అధికరణ కింద తనకున్న అధికారాలను వినియోగించుకుని విచారించి, ఈ విషయంలో విచారణ చేయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్‌ను కోరింది. ఆయన ఈ కేసులోని నిజానిజాలను, సంభాషణలను నిగ్గుతేల్చాలని కోరింది. మూడో పక్షం ప్రయోజనాలను కూడా నిగ్గుతేల్చాలని ఆయనకు సూచించింది. మొత్తంమీద చూస్తే ఏపీ హైకోర్టు వ్యవహారాలు సజావుగా సాగటం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం రాసిన లేఖను ఒక విడి చర్యగా భావించలేం. పైగా దీన్ని న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకుంటున్న వ్యవహారంగా తోసిపుచ్చలేం కూడా. కృష్ణప్రసన్న వైట్ల, న్యాయశాస్త్ర విద్యార్థి (ది హిందూ సౌజన్యంతో) -
సోషల్ మీడియా
ప్రతీకార చర్యలు సబబేనా? ‘తీన్ మూర్తి మార్గ్ మెమోరియల్‌లో నెహ్రూజీ స్మృతుల్ని తొలగించే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. ఈ రకంగా జాతీయ ప్రాధాన్యం గల వ్యక్తుల చిహ్నాలపై ప్రతీకార చర్యల్ని తీసుకునే ప్రధానమంత్రిని ఇప్పటివరకు జాతి చూడలేదు. ఎందుకంటే మోదీజీ భావజాలాన్ని మరే మాజీ ప్రధానులు ఆచరించిన దాఖలాలు ఎక్కడా లేవు’’ – అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మౌనం ప్రమాదకరం ‘‘దేశంలోని మానవ హక్కుల కార్యకర్త లను అరెస్టు చేశారు. కానీ సనాతన సంస్థల వంటి వాటిని మాత్రం ఎవ్వరూ ముట్టుకోలేదు. ఈ విషయాలపైన దేశం యావత్తు మౌనంగా ఉంది. స్పందించవలసిన సమయంలో స్పందించకుండా ఉండటం ప్రమాదం’’ – రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్ సింధు క్రీడాస్ఫూర్తి ‘‘అత్యంత నైపుణ్యం కలిగిన, స్ఫూర్తినిచ్చే క్రీడాకారిణి పీవీ. సింధు. ఆమె క్రీడా నైపుణ్యం, పట్టుదల చెప్పుకోదగినది. తాజాగా ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు విజయం 125 కోట్ల మంది భారతీయులను సంతోష పెట్టింది. గర్వించేలా చేసింది’’ – ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఒక్కటీ ఉంటే చాలు ‘భారతదేశంలో ఒకే ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థకు స్థాన ముంది. దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్). అన్ని స్వచ్ఛంద సేవాసంస్థలను మూసి వేయండి. కార్యకర్తలందరినీ జైల్లోకి తోయండి. ఆరోపణలు గుప్పించే వారిని ఉన్నఫళాన కాల్చిపడేయండి’’ – రాహుల్ గాంధీ -
పురుషాధిక్యమే..!
మహిళలకు గౌరవం అంతంతే సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమాజంలో మహిళలకు గౌరవం అంతంత మా త్రంగానే లభిస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగమంటూ నినదిస్తున్నా ఇప్పటికీ పురుషాధిక్యమే కొనసాగుతోంది. పురుషులతో సమానంగా తమకు ఎక్కడా గౌరవం దక్క డం లేదని మహిళామణులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది మగువల అభిప్రాయాలు సేకరించింది. సమాజంలో తమ పట్ల ఇంకా చిన్నచూపే ఉందని, సముచిత గౌరవం మాటలకే పరిమితమైందని 65 శాతం మంది మహిళలు చెప్పారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలూ వారి మనసును గెలుచుకోకపోవడం గమనార్హం. మగువలకు పెద్ద పీట వేస్తున్నామన్న ప్రకటనలే తప్ప.. అవి కార్యరూపం దాల్చడదం లేదని 47 శాతం మంది పెదవివిరిచారు. 33 శాతం మహిళలు మాత్రం ఆ విషయంలో సంతృప్తి వ్యక్తంచేశారు. మగువలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు కారణం సోషల్ మీడియానేనని తేల్చారు. సుమారు 58 శాతం మంది సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందన్నారు. పురుషులతో సమానంగా మీకు గౌరవం లభిస్తుందా ?............ లేదు 651 .. అవును 349 మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా?................ పర్వాలేదు 321 ఉన్నాయి 281 లేదు 398 మహిళలపై వేధింపులు, దాడులకు సోషల్ మీడియానే కారణమని భావిస్తున్నారా?............................ అవును 578 కాదు 422 -
తండ్రిగా మీరు బెస్టా?
సెల్ఫ్‌చెక్ చిన్న కుటుంబాలు సంఖ్య పెరగడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణమైంది. ఈ క్రమంలో భర్తగా, తండ్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలూ మారాయి. మంచిభర్త ఆటోమేటిగ్గా మంచి తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. 1. మీరు వారానికి 20 గంటలకంటే ఎక్కువ టైమ్ టీవీ చూడడానికి కేటాయిస్తున్నారు. ఎ. కాదు బి. అవును 2. ప్రతిరోజూ పిల్లలతో కనీసం పదిహేను నిమిషాల సమయాన్ని కూడా గడపలేకపోతున్నారు. ఎ. కాదు బి. అవును 3. పిచ్చాపాటిగా కబుర్లు చెబుతూ పిల్లల అభిప్రాయాలను తెలుసుకుంటూ అవసరమైతే వాటిని సరిదిద్దుతారు. ఎ. అవును బి. కాదు 4. మీ దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా లైఫ్ పార్ట్నర్తో గడిపే టైమ్ తగ్గుతోంది. ఎ. కాదు బి. అవును 5. మీ కుటుంబంలో జరిగే ప్రతి పనిలోనూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీ పాత్ర ఉంటుంది. ఎ. అవును బి. కాదు 6. కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బయటకు వెళ్లిన సందర్భాలకు కొదవలేదు. ఎ. అవును బి. కాదు 7. మీకు వృత్తివ్యాపారాలు– కుటుంబ బాధ్యతలకు మధ్య కచ్చితమైన విభజన రేఖ ఉంది. అలాగే మీ అభిరుచి కోసం కొంత పర్సనల్ స్పేస్ మిగుల్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. టైమ్ మేనేజ్మెంట్ పాటిస్తున్నారు కాబట్టి ఎప్పుడూ కంగారు, ఒత్తిడి లాంటివి ఉండవు. మీ రొటీన్లో వ్యాయామం కూడా ఉంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు మంచి భర్తగా, మంచి తండ్రిగా సక్సెస్ అవుతున్నారనుకోవచ్చు, ‘బి’లు ఎక్కువైతే చక్కని ఫ్యామిలీమేన్ కావాలంటే మీరు కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. -
ప్రజాభిప్రాయమే ఫైనల్
కొత్త జిల్లాలపై ప్రభుత్వానికి శషబిషలేమీ లేవు: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రతిపాదనలను మార్చుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి శషబిషలు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజా ప్రతినిధులు రాజకీయ కారణాలతో కాకుండా ప్రజల కోణంలో ఆలోచించాలని సూచించా రు. గద్వాల జిల్లా ప్రసక్తి లేనే లేదని, హన్మకొండ జిల్లా విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్‌ఫోర్స్‌కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పుచేర్పులు చేయాలని ఆదేశించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భౌగోళికంగా పెద్దదైన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా మారడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, తెలంగాణలో అడుగుపెట్టే వారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చ తోరణాలతో స్వాగతం పలికినట్లుగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రిలో, కొన్ని మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయని అన్నారు. మిగిలిన మండలాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వరంగల్ జిల్లాను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్లు సీఎం చెప్పారు. రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గోదావరి జిల్లాల సరసన పాలమూరు మహబూబ్‌నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతోందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టు కూడా శరవేగంతో నిర్మిస్తామని సీఎం చెప్పారు. నీటిపారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందన్నారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అంతటా నీటి సౌకర్యం వస్తుందని, అందుకే రైతులెవరూ తమ భూములు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల జరగడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కృష్ణా నదితో ఈ జిల్లాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని, పాలమూరు రైతులకు నీళ్లివ్వడం గొప్ప కార్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు అయిదు కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వరంగల్‌కు మహర్దశ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హెల్త్, ట్రైబల్ యూనివర్సిటీలతోపాటు అనేక విద్యాసంస్థలను మంజూ రు చేశామని, టెక్స్టైల్ పార్కు నిర్మించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.300కోట్లు కేటాయించామని, హృదయ్, స్మార్ట్ సిటీలో కూడా ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాజీపేట వద్ద ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు ప్రకటించారు. వెంటనే అంచనాలు రూపొందించాలని నేషనల్ హైవేస్ ఈఎన్సీ గణపతిరెడ్డిని ఆదేశించారు. కొత్త ప్రతిపాదనలు.. మార్పులివీ.. ⇔ {పజాభిప్రాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. ⇔ {పతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని, కొడకండ్ల మండలాన్ని తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలని సూచించారు. ⇔ వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్దవంగర,కొమురవెల్లి మండలాల ఏర్పాటు కు అవకాశాలు పరిశీలించాలన్నారు. ⇔ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ⇔ ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్తీర్ణంపరంగా పెద్దగా ఉన్నందున రెండుగా విభజించాలన్నారు. -
జిల్లాలపై అభిప్రాయాలను తెలియజేయాలి
భువనగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా ఏర్పాటు చే యనున్న జిల్లాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మోహన్రావు కోరారు. శుక్రవారం స్థానికంగా జరిగిన సంఘం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధులు జంపాల అంజయ్య, కాచరాజు జయప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
ఎవరి అంచనాలు వారివి..!
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29 బడ్జెట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా... మరికొందరు... బడ్జెట్ అంచనాలతో నిమగ్నమయ్యారు. వీటిలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే... 2 శాతం వరకూ కార్పొరేట్ పన్ను తగ్గింపు నాలుగేళ్లలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రానున్న బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 1 నుంచి 2 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది. అయితే దీనిని భర్తీచేసుకునే దిశలో ఏ మినహాయింపులు తొలగిస్తారన్న అంశాన్ని చెప్పలేం. పన్ను చట్టాలు మరీ అంత క్లిష్టంగా ఏమీ లేవు. నిర్వహణా పరంగా మాత్రం ఈ విభాగంలో కొన్ని సంస్కరణలు అవసరమే. అయితే సమీప కాలంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కొద్దికొద్దిగా కాకుండా మొత్తంగా వ్యవస్థాపరమైన మార్పులు తీసుకురావాల్సి ఉండడమే దీనికి కారణం. - బాబీ పరేఖ్, బీఎంఆర్ అడ్వైజర్స్ ఐటీ పురోగతికి చర్యలు... ఐటీ పరిశ్రమ... ప్లాట్‌ఫామ్స్, ప్రొడక్ట్స్ దిశలో అడుగులు వేయాల్సిన తక్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి నైపుణ్య శిక్షణ, సబ్సిడీలు, పన్ను రాయితీలు, నిధుల లభ్యత వంటి అంశాల కోణంలో 2016-17 బడ్జెట్లో తగిన చర్యలు ఉంటాయని భావిస్తున్నాం. ఈ రంగం వృద్ధి లక్ష్యంగా ఒక ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. తయారీ, సేవలు, ఇన్ఫ్రా వంటి కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాలు రూపొందించాలి. ప్రత్యేక ఆర్థిక జోన్లకు పన్ను ప్రయోజనాలను పునరుద్ధరించాలి. - పీ వెంకటేశ్, మావరిక్ సిస్టమ్స్, డెరైక్టర్ ఆదాయాలు పెరిగే అవకాశం రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా పన్ను వసూళ్లు 12.5 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. నికరంగా ఇది 18 శాతంగా ఉంటుంది. జీఎస్టీ రేటు (17 శాతం)కు అనుగుణంగా సేవల పన్నును స్వల్పంగా పెంచవచ్చు. పెట్రోలియం ప్రొడక్టులపై సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం తన రెవెన్యూ పెంపునకు కృషి చేయవచ్చు. పరోక్ష పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులను తీసుకురావడం ద్వారా కూడా ఆదాయాల పెంపునకు మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. ప్రణాళికేతర వ్యయాలను 15 శాతం పెంచుతుందని భావిస్తున్నాం. ఇంధన సబ్సిడీల భారం తగ్గినా... ఆహార సబ్సిడీల భారం అధికంగానే కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటవుతుందని భావిస్తున్నాం. కొన్ని అదనపు భారాలు ఉన్నప్పటికీ, బడ్జెట్ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయాలు అందుతుండడం వల్ల మూలధన వ్యయాల పెంపుదలవైపే ప్రభుత్వం దృష్టి సారించే వీలుంది. స్థూల రుణాలు రూ. 6.1 లక్షల కోట్లు, నికర రుణాలు రూ.4.3 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించవచ్చన్నది అంచనా. ప్రభుత్వ రంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్రం వ్యూహ రచన చేసే వీలుంది. - రీసెర్చ్ విభాగం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ -
సమ్...అంత
ఇంటర్వ్యూ మనమిచ్చే సమ్‌థింగ్ (కొంత) వాళ్లకు ఎవ్రీథింగ్ (అంతా) అంటూ సేవకు భాష్యం చెబుతుంది ‘సమ్... అంత’. ఎవరైనా ‘సమ్’ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు... తనకున్నది ‘అంతా’ ఇచ్చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది. ఎదుటివారి కళ్లల్లో సంతోషాన్ని చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటుంది. తెరపై తారకలా మెరుస్తూ... సమాజంలో మంచి వ్యక్తిగా మన్ననలందుకుంటోన్న సమంత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఇవి... ♦ మీకు నచ్చే రంగు? నలుపు. తెలుపు కూడా ఇష్టమే. ♦ నచ్చే ఆహారం? సౌత్ ఇండియన్ వంటకాలు ఏవైనా ఇష్టమే. ♦ నచ్చే దుస్తులు? జీన్స్, టీషర్ట్స్ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్య సందర్భాల్లో చీరలు ఇష్టపడతాను. ♦ నచ్చే హీరోలు? షారుఖ్, రజనీకాంత్, కమల్ హాసన్ ♦ నచ్చే హీరోయిన్లు? శ్రీదేవి, రేఖ, శోభన ♦ ఎదుటివారిలో నచ్చేది? నిజాయితీ, పాజిటివ్ దృక్పథం ♦ ఇతరుల్లో నచ్చనిది? అబద్ధాలు చెప్పడం ♦ భక్తిగా ఉంటారా? మరీ అంత కాదు. ఎప్పుడైనా ఓసారి ప్రార్థన చేసుకుంటానేమో కానీ అన్నీ క్రమం తప్పకుండా పాటించేయను. కాకపోతే దేవుడంటే నమ్మకం ఉంది. మనం తప్పటడుగులు వేయకుండా ఆపేది దేవుడిపై ఉండే నమ్మకం, భయమే! ♦ తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఏమీ చేయను. ఒక్కోసారి అలా ఖాళీగా ఉండటంలో కూడా ఆనందం ఉంటుంది. టీవీ చూస్తూనో, పాటలు వింటూనో గడిపేస్తాను. నాకు పెద్ద పెద్ద శబ్దాలు నచ్చవు. అలాగే ఎక్కువ జనం ఉండే చోట్లకు వెళ్లడం కూడా ఇష్టముండదు. అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతాను. ♦ మీ ఫిట్నెస్ సీక్రెట్? బరువు తగ్గడానికి నేనెప్పుడూ వ్యాయామాలు చేయను. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వంటి జాగ్రత్తలేవో తీసు కుంటాను తప్ప వర్కవుట్లు ఉండవు. ♦ గాసిప్స్‌కి బాధపడతారా? కచ్చితంగా. మన గురించి తప్పుగా మాట్లాడితే బాధ ఉండదా చెప్పండి! కాకపోతే వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోను. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఎవరో ఏదో అంటారని నన్ను నేను మార్చేసుకోలేను కదా! ♦ గుర్తుండిపోయిన కాంప్లిమెంట్? కాంప్లిమెంట్స్‌ని పెద్దగా గుర్తుంచుకోను కానీ కామెంట్స్‌ని మాత్రం గుర్తుంచుకుంటాను. అది కూడా సద్విమర్శ అయితేనే. అలాంటి విమర్శలు మనలో ఉన్న లోపాల్ని సరి చేసుకోవడానికి పనికొస్తాయి. మనల్ని మనం ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయి. ♦ అవార్డులు కోరుకుంటారా? నేను నటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఒక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్ చాలు నన్ను ఇంటికి పంపేయడానికి అనుకుంటాను. అందుకే ఎప్పుడూ పనిని నిర్లక్ష్యం చేయను. బాగా చేయాలి అని తపిస్తాను తప్ప అవార్డులు రావాలి అన్న దృష్టితో బాగా నటించడం అన్నది ఉండదు. మన పని పర్ఫెక్ట్గా ఉంటే అవార్డులు, రివార్డులు అవే వస్తాయి. ♦ పరాజయాలకు కుంగిపోతారా? కుంగిపోను కానీ కంగారుపడతాను. ఆ మధ్య వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాంతో కాస్త బెంగపడ్డాను. ఎందుకంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలనే శాయశక్తులా కష్టపడతాం. తీరా అది ఫెయిలైతే చాలా నిరాశ అనిపిస్తుంది. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సక్సెస్ కావడంతో నా బెంగ తీరిపోయింది. ♦ మీకు సేవ చేయడం ఇష్టం కదా? అవును. నేనో సమయంలో పదిహేను రోజుల పాటు అనారోగ్యంతో మంచమ్మీదే ఉండిపోయాను. అప్పుడు నాలో పెద్ద మథనమే జరిగింది. జీవితపు విలువ తెలిసింది. ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. అందుకే స్వార్థంగా ఉండకూడదని, వీలైనంత వరకూ ఇతరులకు ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నాను. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ♦ అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి? ఈ భూమి మీద పుట్టినందుకు, సుఖంగా జీవిస్తున్నందుకు ఈ సమాజానికి కొంతయినా మేలు చేయాలి. నేనే కాదు... అందరూ ఇలానే ఆలోచించాలి. అలా అని ఉన్నదంతా పెట్టాల్సిన పని లేదు. మనకి ఉన్నదాంట్లో కొంత ఇతరుల కోసం ఇవ్వగలిగితే చాలు. కొందరి కళ్లలోనైనా మన వల్ల సంతోషం కనిపిస్తే చాలు. సాక్షి ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్. ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్డాట్కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు. ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు. సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు. ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. -
స్వేచ్చగా ఆభిప్రాయాలు చెప్పొచ్చు:కమల్‌నాధ్
-
టీ బిల్లుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల భిన్నాభిప్రాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివా రం ఇక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజరైన వీరు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బిల్లుపై రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహా కోరవచ్చని, లేదా మంత్రివర్గ నిర్ణయాన్ని ఆమోదించవచ్చని సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది టి.ఆర్.అంద్యార్జున మరో అభిప్రాయం వెలిబుచ్చారు. రాష్ట్రపతి మంత్రిమండలి నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిందేనని చెప్పారు. బిల్లు సమగ్రతపై మాత్రమే ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని మరో సీనియర్ న్యాయవాది పీపీ రావు తెలిపారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా పొందవచ్చు: నారీమన్ ‘‘తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకొనేందకు రాష్ట్రపతి వద్ద రెండు మార్గాలు ఉన్నాయి. బిల్లుపై సుప్రీం కోర్టు సలహా కోరవచ్చు. లేదంటే నేరుగా మంత్రివర్గం నిర్ణయం మేరకు నడుచుకోవచ్చు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం రాష్ట్ర అధికారాలను కూడా తీసుకుని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 3 ఇందుకు పూర్తి అధికారం ఇచ్చింది. బిల్లు అసమగ్రంగా ఉందనడం సరికాదు. ఎలా అయినా పంపొచ్చు. ఆర్థిక మెమోరాండం వంటివి లేకపోయినా పరవాలేదు.’’ బిల్లు తీరుపై ఇప్పుడు కోర్టుకు వెళ్లొచ్చు: పీపీ రావు ‘‘బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకోవచ్చు. లేదా ఆయనకు తోచిన అభిప్రాయాన్ని మంత్రిమండలికి చెప్పొచ్చు. కానీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి వస్తుంది. సుప్రీం కోర్టు సలహా తీసుకోవడం ఒక మార్గం మాత్రమే. ప్రస్తుత తరుణంలో బిల్లు సమగ్రంగా ఉందా లేదా అనే అంశంపై మాత్రమే సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లుపై వెళ్లలేం. చట్టరూపం దాల్చాక బిల్లుపై కూడా వెళ్లవచ్చు.’’ రాష్ట్రపతి పాత్ర ఏమీ లేదు: టి.ఆర్.అంద్యార్జున ‘‘అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంటు బిల్లును ఆమోదించవచ్చు. ఇక్కడ రాష్ట్రపతి పాత్ర కూడా ఏమీ ఉండదు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే. కేంద్రం దానంతట అదే వెనక్కి తీసుకుంటే తప్ప బిల్లు ఆగకపోవచ్చు. పైగా, బీజేపీ కూడా మద్దతిస్తోంది. తెలంగాణ ప్రజలు 50 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. ప్రజలు కోరుకుంటే ప్రత్యేక రాష్ట్రమివ్వడంలో తప్పేమీలేదు.’’ -
లాబీలు, మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అత్తా.. దెబ్బలేమైనా తగిలాయా! సాక్షి, హైదరాబాద్: అత్తా దెబ్బలు తగిలాయా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం శాసనమండలి మీడియా పాయింట్లో టీఆర్ ఎస్, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య జరిగిన తోపులాటలో నన్నపనేని కింద పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ లాబీల్లో కేటీ ఆర్ తనకు ఎదురుపడిన నన్నపనేనిని పరామర్శించారు. ‘‘మీరు మండలి మీడియా పాయింట్ వద్ద కింద పడిపోవటాన్ని నాన్న కేసీఆర్ చూశారు. చాలా బాధపడ్డారు. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీశారు. టీడీపీ సభ్యుడు సతీష్‌రెడ్డి, టీఆర్ఎస్ సభ్యుడు స్వామిగౌడ్ మధ్య తోపులాటలో మీరు కిందపడ్డారని, కావాలని స్వామిగౌడ్ మిమ్మల్ని నెట్టలేదని ఆ తర్వాత విచారిస్తే తెలిసింది’’ అని అన్నారు. దీనికి నన్నపనేని స్పందిస్తూ ఈ ఘటన పట్ల సభ లోపల, వెలుపల స్వామిగౌడ్ విచారం వ్యక్తం చేశారని, దీంతో తాను కూడా దాన్ని వివాదాస్పదం చేయకుండా వదిలిపెట్టానని నన్నపనేని తెలిపారు. అసెంబ్లీకి వచ్చిన మోపిదేవి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజర య్యారు. అయ్యప్ప మాలధారణలో ఆయన అసెంబ్లీకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ ఆయన్ను గత ఏడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తొలిసారిగా అసెంబ్లీకి వచ్చారు. పలువురు సభ్యులు ఆయనను ఆప్యాయంగా పలకరించారు. జైలులో ఉన్న సమయంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మోపిదేవి అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన సభకు రావటం ఇదే తొలిసారి. స్పీకర్, సీఎం దిష్టిబొమ్మల దహనం ‘‘సీమాంధ్ర ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి సభను వాయిదా వేసిన సీఎం, స్పీకర్ వైఖరులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వారిద్దరి దిష్టిబొమ్మలను దహనం చేస్తాం. సభను ఆర్డర్లో ఉంచటం కంటే బిల్లు పెట్టడం ముఖ్యం. బిల్లుపై చర్చించండి అని కోరుతుంటే వాయిదా వేయాలని సీమాంధ్ర సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు అడ్డుకొని మరికొంత సమయం కావాలని కోరతారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం.’’ - హరీశ్‌రావు, జోగు రామన్న, నల్లాల ఓదెలు (టీఆర్ఎస్) కేసీఆర్ పార్టీని విలీనం చేస్తే వెంటనే తెలంగాణ ‘‘స్పీకర్, సీఎం కలసి సభను పక్కదోవ పట్టిస్తునారు. స్పీకర్ సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గడం సరికాదు. సోనియా-కేసీఆర్ హాట్లైన్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ తెలంగాణ ఇవ్వకపోవడం వల్లే బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఈ తల నొప్పులు ఉండకుండా తెలంగాణ ఏర్పడుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే ఈ నాటకం ఆడుతున్నాయి.’’ - ఎర్రబెల్లి, మోత్కుపల్లి (టీడీపీ) విభజన బిల్లు తప్పుల తడక: శైలజానాథ్, గాదె సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉందని, దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తామని వుంత్రి సాకే శైలజానాథ్, వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి వెల్లడించారు. కీలకమైన జలవనరులతో మొదలుకొని చిన్న అంశాల్లోనూ అనేక లోపాలున్నాయుని, వీటి గురించి రాష్ట్రపతికి వివరిస్తామని తెలిపారు. గురువారం సీఎల్పీ కార్యాలయుంలో విప్ రుద్రరాజు పద్మరాజుతో కలసి వారు మీడియూతో వూట్లాడారు. బిల్లులో రాజ్యాంగబద్ధమైన నిబంధనలనూ చేర్చలేదని, ఆర్థిక అంశాలపైనా స్పష్టతనివ్వలేదన్నారు. కాగా విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు చివరి రోజు అర్ధరాత్రి వరకూ అసెంబ్లీలో చర్చిస్తామని, అవసరమైతే మరింత అదనపు సమయమూ కోరతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ వుంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బిల్లుపై చివరి నిమిషం వరకూ చర్చించి, తవు ప్రాంత ఆకాంక్షలను తెలియుచేస్తావున్నారు. గురువారం అసెంబ్లీ వద్ద ఆయున ఈ మేరకు ఇష్టాగోష్టిగా వూట్లాడుతూ.. సభ్యులందరూ సభలో తమ అభిప్రాయూలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలన్నారు. -
రాష్ట్ర విభజన, ఆర్టికల్-3పై ఎవరేమన్నారు?
అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణ దుర్వినియోగాన్ని నిరోధించాలని, ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించేందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3 సవరణ కోసం మద్దతివ్వాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు నవంబర్ 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా పర్యటించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో న్యూఢిల్లీ నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. ఆయా పార్టీల అధ్యక్షులు, అగ్రనాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల స్పందనలు ఇవీ... ఏ రాష్ట్ర విభజనకైనా మేం వ్యతిరేకం ‘‘భాషాప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన ఏ రాష్ట్రం విభజననైనా సరే సీపీఎం గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకసారి విభజన ప్రక్రియను ఆరంభించినట్టయితే, తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని మేం మొదట్నుంచీ చెప్తున్నాం. అది మున్ముందు కూడా కొనసాగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు, ఇంకా ఈ అంశం చర్చకొచ్చే ఇతరత్రా వేదికలన్నింటిపైనా వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని మేం గట్టిగా కోరతాం.’’ - సీతారాం ఏచూరి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు (న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013) ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తాం ‘‘రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారమిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూసే అంశంపై తప్పనిసరిగా పార్టీలో చర్చిస్తాం. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుపై మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పునరాలోచన ప్రసక్తే లేదు.’’ - సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి (న్యూఢిల్లీ, 16 నవంబర్) సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ‘‘ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయం. దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మాది చిన్న రాష్ట్రాల విధానం. అయినా ఈ అంశాలను తప్పక పార్టీ దృష్టికి తీసుకెళ్తా.’’ - రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు (17 నవంబర్ 2013) పార్లమెంటులో అడ్డుకుంటాం... ‘‘ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే ఇటు లోక్‌సభలోనూ అటు రాజ్యసభలోను అడ్డుకుంటాం.’’ - మమతాబెనర్జీ, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత(కోల్‌కతా, 20 నవంబర్) విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం ‘‘ఏపీ విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకుండా సవరించాలి. - ఉద్ధవ్‌ఠాక్రే, శివసేన అధ్యక్షుడు (ముంబై, 25 నవంబర్, ) జగన్ లేవనెత్తిన అంశాలు కీలకమైనవి ‘‘ఎన్సీపీ 9 నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకు వెళ్లరాదని, మూడో అధికరణ సవరణ విషయాన్ని ప్రస్తావించారు. మా వర్కింగ్ కమిటీలో వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం.’’ - శరద్‌పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, (ముంబై, 25 నవంబర్) ప్రజలను సంప్రదించాల్సింది.. ‘‘ఆంధ్రప్రదేశ్ విషయంలో.. విభజన నిర్ణయం తీసుకోవటానికి ముందు రాష్ట్ర ప్రజలను సంప్రదించి ఉండాల్సింది. సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించటం సరికాదు.’’ - నవీన్‌పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి, (భువనేశ్వర్, 24 నవంబర్) తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం ‘‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. ఆర్టికల్-3 ప్రకారమే కాదు.. ఏవిధంగా విభజించినా సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకిస్తుంది.’’ - అఖిలేష్‌యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, (లక్నో, 06 డిసెంబర్) బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటాం ‘‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును మా పార్టీ పార్లమెంట్లో అడ్డుకుంటుంది’’ - ములాయంసింగ్‌యాదవ్, సమాజ్‌వాది పార్టీ అధినేత (ఢిల్లీ, 9 డిసెంబర్) సవరణకు మద్దతిస్తా ‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం. - దేవెగౌడ, మాజీ ప్రధాని, (ఢిల్లీ, 9 డిసెంబర్ ) అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం ‘‘రాష్ట్రాల అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముంది.’’ - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి (పాట్నా, 13 డిసెంబర్ ) తీర్మానం తీసుకోవాల్సిందే: బాదల్ ‘‘ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకున్నపుడే విభజన అంశాన్ని పరిశీలించాలి.’’ - ప్రకాశ్‌సింగ్‌బాదల్, పంజాబ్ సీఎం, (ఢిల్లీ, 13 డిసెంబర్ )