ప్రతీకాత్మక చిత్రం
మహిళలకు గౌరవం అంతంతే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమాజంలో మహిళలకు గౌరవం అంతంత మా త్రంగానే లభిస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగమంటూ నినదిస్తున్నా ఇప్పటికీ పురుషాధిక్యమే కొనసాగుతోంది. పురుషులతో సమానంగా తమకు ఎక్కడా గౌరవం దక్క డం లేదని మహిళామణులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే చేపట్టింది.
జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది మగువల అభిప్రాయాలు సేకరించింది. సమాజంలో తమ పట్ల ఇంకా చిన్నచూపే ఉందని, సముచిత గౌరవం మాటలకే పరిమితమైందని 65 శాతం మంది మహిళలు చెప్పారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలూ వారి మనసును గెలుచుకోకపోవడం గమనార్హం.
మగువలకు పెద్ద పీట వేస్తున్నామన్న ప్రకటనలే తప్ప.. అవి కార్యరూపం దాల్చడదం లేదని 47 శాతం మంది పెదవివిరిచారు. 33 శాతం మహిళలు మాత్రం ఆ విషయంలో సంతృప్తి వ్యక్తంచేశారు. మగువలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు కారణం సోషల్ మీడియానేనని తేల్చారు. సుమారు 58 శాతం మంది సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందన్నారు.
పురుషులతో సమానంగా మీకు గౌరవం లభిస్తుందా ?............ లేదు 651 .. అవును 349
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా?................ పర్వాలేదు 321 ఉన్నాయి 281 లేదు 398
మహిళలపై వేధింపులు, దాడులకు సోషల్ మీడియానే కారణమని భావిస్తున్నారా?............................ అవును 578 కాదు 422
Comments
Please login to add a commentAdd a comment