Women day
-
జగన్‌లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, కరీంనగర్: ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అన్ని శాఖల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఆమె తిమ్మాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని కవిత అన్నారు. గ్యాస్ ధర పెంపుతో కట్టెల పొయ్యి రోజులు వచ్చాయన్నారు. మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 54 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలను స్వాలంబన కింద అందిస్తున్నామని, వడ్డీ లేని రుణాలు.. అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామని కవిత అన్నారు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో రాష్ట్రానికి కొత్తగా 20 వేల కంపెనీలు వచ్చాయి. దీంతో తెలంగాణలో 30 లక్షల కొలువులు పెరిగాయి. ప్రభుత్వం కూడా రెండున్నర లక్షల కొలువులు ఇస్తుంది. ఏది తోడున్నా లేకున్నా.. ఆడబిడ్డ తాను చదువుకున్న చదువు.. జీవిత కాలం తోడుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలి’’ అని కవిత పిలుపునిచ్చారు. చదవండి: కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్ -
స్త్రీ,పురుష సమానత్వమే సమాజ ప్రగతికి మూలం
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా పంచ్‌లు.. టీడీపీకి కొత్త అర్థం..
సాక్షి, విజయవాడ: నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ రావాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్ లాంటి మహిళా పక్షపాతి సీఎం.. దేశంలోనే ఉండరన్నారు. చదవండి: ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్ ‘‘సీఎం జగన్ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారు. మహిళలను మహారాణులను చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేలా పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళలందరికీ దేవుడితో సమానం’’ అని రోజా అన్నారు. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూశారు. టీడీపీ అంటే.. తెలుగు దుశ్సాసన పార్టీ. చంద్రబాబు.. వైఎస్ జగన్ బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని ఎమ్మెల్యే రోజా తన మార్క్ పంచ్‌లు విసిరారు. -
గ్రేటర్.. కాస్త బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మహిళలపై వేధింపుల కేసులు ఏటా పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ నగరంలో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్అవే అనే రెంటల్ సంస్థ ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు, ఢిల్లీ నగరాలపై మహిళా నెటిజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో పనిచేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణే రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడోస్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు కాగా.. నాలుగో స్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ కేవలం 3.4 పాయింట్లు మాత్రమే సాధించిందని ప్రకటించింది. నగరాల్లో జీవన వ్యయాలు ఇలా.. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి ఏడు వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణే నగరంలోలో సగటున రూ.8–9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 వేలనుంచి రూ.10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. -
మహిళా ప్రగతికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది
-
పురుషాధిక్యమే..!
మహిళలకు గౌరవం అంతంతే సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమాజంలో మహిళలకు గౌరవం అంతంత మా త్రంగానే లభిస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగమంటూ నినదిస్తున్నా ఇప్పటికీ పురుషాధిక్యమే కొనసాగుతోంది. పురుషులతో సమానంగా తమకు ఎక్కడా గౌరవం దక్క డం లేదని మహిళామణులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది మగువల అభిప్రాయాలు సేకరించింది. సమాజంలో తమ పట్ల ఇంకా చిన్నచూపే ఉందని, సముచిత గౌరవం మాటలకే పరిమితమైందని 65 శాతం మంది మహిళలు చెప్పారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలూ వారి మనసును గెలుచుకోకపోవడం గమనార్హం. మగువలకు పెద్ద పీట వేస్తున్నామన్న ప్రకటనలే తప్ప.. అవి కార్యరూపం దాల్చడదం లేదని 47 శాతం మంది పెదవివిరిచారు. 33 శాతం మహిళలు మాత్రం ఆ విషయంలో సంతృప్తి వ్యక్తంచేశారు. మగువలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు కారణం సోషల్ మీడియానేనని తేల్చారు. సుమారు 58 శాతం మంది సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందన్నారు. పురుషులతో సమానంగా మీకు గౌరవం లభిస్తుందా ?............ లేదు 651 .. అవును 349 మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా?................ పర్వాలేదు 321 ఉన్నాయి 281 లేదు 398 మహిళలపై వేధింపులు, దాడులకు సోషల్ మీడియానే కారణమని భావిస్తున్నారా?............................ అవును 578 కాదు 422 -
మహిళా ప్రగతికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంది: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత ద్వారానే మహిళలు నిజమైన ప్రగతిని సాధించగలరని, ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ప్రకటించిన నవరత్నాలతోపాటు ఇతర పథకాల్లో మహిళల ప్రగతి కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. -
విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్