
సాక్షి, ప్రకాశం: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత ద్వారానే మహిళలు నిజమైన ప్రగతిని సాధించగలరని, ఇందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ ప్రకటించిన నవరత్నాలతోపాటు ఇతర పథకాల్లో మహిళల ప్రగతి కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేయించారు.