సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలపై పోస్టర్లు ఆవిష్కరించిన జయశ్రీ, పద్మజ
ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవంలో జయశ్రీ, పద్మజ
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు.
జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment