Jayashree
-
జగన్‌లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
మహా గంగ
మనిషి బతకాలంటే గాలి తర్వాత అంత ముఖ్యమైనది నీటిచుక్క. గాలి మన చుట్టూ ఆవరించి ఉంటుంది. మరి నీరు... అవి మన దగ్గరకు రావు, మనమే నీటి దగ్గరకు వెళ్లాలి. అందుకే ప్రాచీన నాగరకతలు నీటి ఆధారంగానే విస్తృతమయ్యాయి. మరి ఈ ఆధునిక కాలానికి ఏమైంది? మనిషి టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు. తానున్న చోటుకే నీటి తెచ్చుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని కొండ మీద కూడా కాలు మీద కాలేసుకుని జీవిస్తున్నాడు. మరి భూగర్భంలో జలం పాతాళానికి ఇంకిపోతే ఏం చేయాలి? బిందెలు తలమీద పెట్టుకుని నీటిబొట్టును వెతుక్కుంటూ మైళ్లకు మైళ్ల దూరం నడిచి వెళ్లాలి. మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి అదే. ఇరవై ఏళ్ల కిందట అయితే మరీ దుర్భరంగా ఉండేది. అక్కడి నీటి ఎద్దడిని నివారించడానికి విశాల మనస్కులు వస్తూనే ఉన్నారు. వారికి చేతనైంత మేర గంగను పునఃప్రతిష్ఠించి జనం గొంతు తడుపుతున్నారు. బెంగళూరుకు చెందిన జయశ్రీ అయితే ఏకంగా రెండు వందల గ్రామాల దాహార్తిని తీర్చింది. నీటి కొరతతో గంగవెర్రులెత్తుతున్న మహారాష్ట్ర గ్రామాల పాలిట గంగాభవానిగా మారింది. తిరిగి ఇవ్వాల్సిన సమయం జయశ్రీ వయసు 72. బెంగళూరులో పుట్టి పెరిగింది. చదువుకునే రోజుల్లో ఆసక్తి కొద్దీ ఒక ఎన్జీవోలో ఉద్యోగం చేసింది. పెళ్లి తర్వాత భర్తతోపాటు యూకేకి వెళ్లి పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కుటుంబంతో తిరిగి ఇండియాకి వచ్చిందామె. ఆమె తండ్రి నిర్వహిస్తున్న జేఆర్‌రావు అండ్ కో బాధ్యతలను చేపట్టింది. అది ఇంజనీరింగ్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. పరిశ్రమ నిర్వహణలో మంచి పట్టు వచ్చేసింది. 2006లో ఓరోజు... ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. మెషినరీ పరికరాల అమ్మకంలో నికరంగా లక్ష రూపాయలు మిగిలాయి. జయశ్రీ సంతోషంగా ఇంటికి వచ్చింది. రోజూ కూరగాయలిచ్చే అతడు వచ్చాడు. ఐదు రూపాయలు తగ్గింపు కోసం బాగా బేరం చేసింది. ఆమె కోరినట్లే ఐదు రూపాయలు తగ్గించి కూరగాయలిచ్చి వెళ్లిపోయాడతడు. అప్పుడు ఆమెలో ఆత్మావలోకనం మొదలైంది. ‘నేనేం చేశాను. లక్ష రూపాయలు లాభంతో సంతోషంగా ఇంటికి వచ్చాను. బేరం చేయకుండా కూరగాయలు కొని ఉంటే కూరగాయలమ్మే అతడు కూడా ఎంతో కొంత సంతోషంగా ఇంటికి వెళ్లే వాడు కదా’ అనుకుంది. మన జీవిక కోసం సమాజం నుంచి తీసుకుంటాం. అలాగే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సందర్భాలను కూడా గమనింపు లో ఉంచుకోవాలి’ అనుకుందా క్షణంలో. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి అని గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాటి చిత్రమే నేటికీ జయశ్రీకి తాను పెళ్లికి ముందు పని చేసిన మహారాష్ట్ర గ్రామాలు గుర్తుకు వచ్చాయి. నీటి కోసం బిందె తల మీద పెట్టుకుని నడుస్తున్న మహిళల ఫొటోలు పేపర్లలో చూసిన సంగతి గుర్తు వచ్చింది. ఒకసారి ఆ గ్రామాలకు వెళ్లి చూసింది. వెంటనే పని మొదలు పెట్టింది జయశ్రీ. సమావేశం ఏర్పాటు చేసి తాను ఏం చేయదలుచుకున్నాననేది గ్రామస్థులకు వివరించడమే పెద్ద సమస్య అయింది. మీటింగ్ అంటే ఎవరూ వచ్చే వాళ్ల కాదు. గ్రామస్థులను కూర్చోబెట్టడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించింది. చివరికి ఒక దీపావళికి ప్రమిదలు తయారు చేసే అవకాశం కల్పించడంతో మహిళలు వచ్చారు. వారికి ప్రమిదలు చేసినందుకు డబ్బు ఇవ్వడంతోపాటు నీటి సంరక్షణ కోసం తాను చేయదలుచుకున్న విషయాన్ని కూడా చెప్పి వారిని సమాధాన పరిచింది. ఎండిపోయిన నీటి కుంటల పూడిక తీయించడానికి రంగం సిద్ధం చేసింది. యంత్రాల సహకారం ఆమె వంతు భాగస్వామ్యం– శ్రమదానం గ్రామస్థుల భాగస్వామ్యం. ఈ అంగీకారంతో ఒక్కో గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు, సరస్సులు, కాలువలు శుభ్రపడ్డాయి. తర్వాతి వర్షాకాలం నీటితో కళకళలాడాయి. అలాగ ఒక ఊరి తర్వాత మరో ఊరు... అలా రెండు వందల గ్రామాల్లో నీటి సంరక్షణను విజయవంతంగా పూర్తి చేసింది జయశ్రీ. వాటర్ కన్సర్వేషన్ స్ప్రింగ్ బాక్స్ గ్రామస్తులను చైతన్యపరుస్తున్న జయశ్రీ జయశ్రీ -
డిప్రెషన్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య!
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జయ శ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. డిప్రెషన్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు. కాగా గతేడాది జూలై 22న ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా అభిమానులకు వెల్లడించింది. దీంతో అభిమానులు ఆందోళన చెందగా వెంటనే ఆమె సదరు పోస్టును తొలగించింది. బాగానే ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని తన మానసిక స్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో హీరో కిచ్చా సుదీప్ ఆమెకు ధైర్యం చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి. (చదవండి: ఏడు నిముషాల పాత్రే.. కానీ ఎంత పేరు) కానీ మళ్లీ ఐదు రోజులకే అంటే జూలై 25న అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ తన మనసులో ఉన్న బాధనంతా కక్కేసింది. "నేనిదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదు. సుదీప్ సర్ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదు. నా చావును మాత్రమే కోరుకుంటున్నాను. డిపప్రెషన్‌తో పోరాడలేకపోతున్నా. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను కానీ మానసిక ఒత్తిడితోనే చచ్చిపోతున్నా. ఎన్నో వ్యక్తిగత సమస్యలు నన్ను చీల్చి చెండాడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ సమస్యల ఊబిలో చిక్కుకున్న నేను వాటిని అధిగమించలేకపోతున్నాను" అని పేర్కొంది. ఈ మధ్య కాలంలో కూడా ఆమె తన మానసిక పరిస్థితి గురించి చెప్తూ ఓడిపోయానని, చనిపోవాలని ఉందని పేర్కొంది. దీర్ఘకాలంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన జయశ్రీ చివరికి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె కిచ్చా సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కన్నడ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొంది. (చదవండి: మాజీ ప్రియుడు, పెళ్లిపై స్పందించిన హీరోయిన్) -
బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నం
బుల్లితెర నటి జయశ్రీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. స్థానిక తిరువాణ్మయూర్‌కు చెందిన భార్యాభర్తలు ఈశ్వర్, జయశ్రీ. ఇద్దరూ టీవీ నటులే. కాగా గత ఏడాదిన్నరగా వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో నటి జయశ్రీ ఆడయార్ పోలీస్‌స్టేషన్, చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త ఈశ్వర్‌కు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, కట్నం కావాలంటూ తనను రోజూ హింసిస్తున్నాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉంది. కాగా ఇలాంటి పరిస్థితుల్లో నటి జయశ్రీ బుధవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం వండలూర్ ప్రాంతంలోని గుడిసెలు దగ్ధమయ్యాయి. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నటి జయశ్రీ, తిరిగి కారులో తిరువాణ్మయూర్ వెళ్తుండగా భర్త నుంచి ఫోన్ వచ్చింది. అతనితో మాట్లాడిన తరువాత ఒక మందుల దుకాణంలో నిద్ర మాత్రలు కొనుగోలు చేసి మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కారు నీలాంగరై సముద్ర తీరంలోకి రాగానే జయశ్రీ మైకంతో పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆమెకు సహాయంగా వచ్చిన వ్యక్తి వెంటనే జయశ్రీని నీలాంగరైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి నీలాంగరై పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
మహిళా సినీ నిర్మాత అరెస్ట్
సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : చెక్ బౌన్స్ కేసులో కన్నడ నిర్మాత జయశ్రీదేవిని చామరాజపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద అనే వ్యక్తి నుంచి నిర్మాత జయశ్రీదేవి ఎడాది క్రితం రూ. 34 లక్షలను అప్పుగా తీసుకున్నారు. రోజులు గడిచినా డబ్బు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రూ.34 లక్షలకు పూచీగా ఇచ్చిన చెక్ బ్యాంక్‌లో బౌన్స్ అయ్యింది. దీంతో ఆనంద బెంగళూరు 18వ ఎసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు జయశ్రీని చామరాజపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కన్నడంలో సుమారు 25కుపైగా సినిమాలను తీశారు. -
ఇంట్లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్‌పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జయశ్రీ (30), ఆమె కుమారుడు సాయి కార్తీక్ (6)కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జయశ్రీ భర్త కర్నూలులో ఉన్నారు. ఆయన ఎస్బీఐ ఉద్యోగి. -
పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీ సాయిబాబానగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌జిల్లా గజ్వేల్‌కు చెందిన రవీంద్రాచారికి రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌కు చెందిన రాధికతో వివాహమైంది. రవీంద్రాచారి హైదరాబాద్ వచ్చి సాయిబాబా కాలనీలో అద్దెఇంట్లో ఉంటూ బంగారు నగల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరిగింది. దీంతో గురువారం ఉదయం ఇద్దరు ఆడపిల్లలకు విషయం ఇచ్చి తనూ విషం తాగాడు. రవీంద్రాచారి విషం తాగిన కాసేపటికే మృతిచెందగా కుమార్తెలు జయశ్రీ(10), అపర్ణ(9) కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఉదయం రవీంద్రాచారి భార్య రాధిక చిన్నకొడుకు సూర్యప్రసాద్‌ను తీసుకుని పాలు తెచ్చేందుకు బయటికి వెళ్లి సమయంలో ఇంట్లో వంటరిగా ఉన్న రవీంద్రాచారి విషంతాగి పిల్లలకూ విషం తాగించాడు. ఇంటికి వచ్చిన రాధిక భర్త, పిల్లలు పడి ఉండడం చూసి కేకలు పెట్టింది. ఇరుగు పొరుగువారు వచ్చి ప్రాణంతో ఉన్న పిల్లలను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జయశ్రీని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘఠనా స్థలాన్ని పరిశీలించి రవీంద్రాచారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.