పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య | a person to commit suicide with Financial difficulties | Sakshi
Sakshi News home page

పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

Published Thu, Nov 19 2015 11:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

a person to commit suicide with Financial difficulties

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీ సాయిబాబానగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్‌జిల్లా గజ్వేల్‌కు చెందిన రవీంద్రాచారికి రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌కు చెందిన రాధికతో వివాహమైంది. రవీంద్రాచారి హైదరాబాద్ వచ్చి సాయిబాబా కాలనీలో అద్దెఇంట్లో ఉంటూ బంగారు నగల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరిగింది. దీంతో గురువారం ఉదయం ఇద్దరు ఆడపిల్లలకు విషయం ఇచ్చి తనూ విషం తాగాడు. రవీంద్రాచారి విషం తాగిన కాసేపటికే మృతిచెందగా కుమార్తెలు జయశ్రీ(10), అపర్ణ(9) కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

ఉదయం రవీంద్రాచారి భార్య రాధిక చిన్నకొడుకు సూర్యప్రసాద్‌ను తీసుకుని పాలు తెచ్చేందుకు బయటికి వెళ్లి సమయంలో ఇంట్లో వంటరిగా ఉన్న రవీంద్రాచారి విషంతాగి పిల్లలకూ విషం తాగించాడు. ఇంటికి వచ్చిన రాధిక భర్త, పిల్లలు పడి ఉండడం చూసి కేకలు పెట్టింది. ఇరుగు పొరుగువారు వచ్చి ప్రాణంతో ఉన్న పిల్లలను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జయశ్రీని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘఠనా స్థలాన్ని పరిశీలించి రవీంద్రాచారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement