AP: YSRCP MLA RK Roja Punch Dialogues On Chandra Babu - Sakshi
Sakshi News home page

MLA RK Roja: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా పంచ్‌లు.. టీడీపీకి కొత్త అర్థం..

Published Tue, Mar 8 2022 3:37 PM | Last Updated on Tue, Mar 8 2022 4:29 PM

YSRCP MLA Roja Punch Dialogues On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: నారీ భేరీ సౌండ్‌.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్‌ రావాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఆమె మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ లాంటి మహిళా పక్షపాతి సీఎం.. దేశంలోనే ఉండరన్నారు.

చదవండి: ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

‘‘సీఎం జగన్‌ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారు. మహిళలను మహారాణులను చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేలా పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలందరికీ దేవుడితో సమానం’’ అని రోజా అన్నారు.

‘‘చంద్రబాబు, లోకేష్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూశారు. టీడీపీ అంటే.. తెలుగు దుశ్సాసన పార్టీ. చంద్రబాబు.. వైఎస్ జగన్ బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు బోత్ ఆర్ నాట్ సేమ్‌. చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని ఎమ్మెల్యే రోజా తన మార్క్‌ పంచ్‌లు విసిరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement