సాక్షి, కరీంనగర్: ఆడబిడ్డల్లో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అన్ని శాఖల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. సోమవారం ఆమె తిమ్మాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని కవిత అన్నారు. గ్యాస్ ధర పెంపుతో కట్టెల పొయ్యి రోజులు వచ్చాయన్నారు.
మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 54 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలను స్వాలంబన కింద అందిస్తున్నామని, వడ్డీ లేని రుణాలు.. అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామని కవిత అన్నారు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కవిత అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో రాష్ట్రానికి కొత్తగా 20 వేల కంపెనీలు వచ్చాయి. దీంతో తెలంగాణలో 30 లక్షల కొలువులు పెరిగాయి. ప్రభుత్వం కూడా రెండున్నర లక్షల కొలువులు ఇస్తుంది. ఏది తోడున్నా లేకున్నా.. ఆడబిడ్డ తాను చదువుకున్న చదువు.. జీవిత కాలం తోడుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలి’’ అని కవిత పిలుపునిచ్చారు.
చదవండి: కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment