సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మహిళలపై వేధింపుల కేసులు ఏటా పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ నగరంలో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్‌అవే అనే రెంటల్ సంస్థ ఆన్‌లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు, ఢిల్లీ నగరాలపై మహిళా నెటిజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో పనిచేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణే రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడోస్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు కాగా.. నాలుగో స్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ కేవలం 3.4 పాయింట్లు మాత్రమే సాధించిందని ప్రకటించింది.
నగరాల్లో జీవన వ్యయాలు ఇలా..
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి ఏడు వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణే నగరంలోలో సగటున రూ.8–9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 వేలనుంచి రూ.10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే
పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment