ప్రతీకార చర్యలు సబబేనా?
‘తీన్ మూర్తి మార్గ్ మెమోరియల్‌లో నెహ్రూజీ స్మృతుల్ని తొలగించే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. ఈ రకంగా జాతీయ ప్రాధాన్యం గల వ్యక్తుల చిహ్నాలపై ప్రతీకార చర్యల్ని తీసుకునే ప్రధానమంత్రిని ఇప్పటివరకు జాతి చూడలేదు. ఎందుకంటే మోదీజీ భావజాలాన్ని మరే మాజీ ప్రధానులు ఆచరించిన దాఖలాలు ఎక్కడా లేవు’’
– అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
మౌనం ప్రమాదకరం
‘‘దేశంలోని మానవ హక్కుల కార్యకర్త లను అరెస్టు చేశారు. కానీ సనాతన సంస్థల వంటి వాటిని మాత్రం ఎవ్వరూ ముట్టుకోలేదు. ఈ విషయాలపైన దేశం యావత్తు మౌనంగా ఉంది. స్పందించవలసిన సమయంలో స్పందించకుండా ఉండటం ప్రమాదం’’ – రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్
సింధు క్రీడాస్ఫూర్తి
‘‘అత్యంత నైపుణ్యం కలిగిన, స్ఫూర్తినిచ్చే క్రీడాకారిణి పీవీ. సింధు. ఆమె క్రీడా నైపుణ్యం, పట్టుదల చెప్పుకోదగినది. తాజాగా ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు విజయం 125 కోట్ల మంది భారతీయులను సంతోష పెట్టింది. గర్వించేలా చేసింది’’ – ప్రధాని నరేంద్ర మోదీ
ఆ ఒక్కటీ ఉంటే చాలు
‘భారతదేశంలో ఒకే ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థకు స్థాన ముంది. దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్). అన్ని స్వచ్ఛంద సేవాసంస్థలను మూసి వేయండి. కార్యకర్తలందరినీ జైల్లోకి తోయండి. ఆరోపణలు గుప్పించే వారిని ఉన్నఫళాన కాల్చిపడేయండి’’ – రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment