లాబీలు, మీడియా పాయింట్‌లో ఎవరేమన్నారంటే..
అత్తా.. దెబ్బలేమైనా తగిలాయా!
సాక్షి, హైదరాబాద్: అత్తా దెబ్బలు తగిలాయా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం శాసనమండలి మీడియా పాయింట్‌లో టీఆర్ ఎస్, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య జరిగిన తోపులాటలో నన్నపనేని కింద పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ లాబీల్లో కేటీ ఆర్ తనకు ఎదురుపడిన నన్నపనేనిని పరామర్శించారు. ‘‘మీరు మండలి మీడియా పాయింట్ వద్ద కింద పడిపోవటాన్ని నాన్న కేసీఆర్ చూశారు. చాలా బాధపడ్డారు. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీశారు. టీడీపీ సభ్యుడు సతీష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యుడు స్వామిగౌడ్ మధ్య తోపులాటలో మీరు కిందపడ్డారని, కావాలని స్వామిగౌడ్ మిమ్మల్ని నెట్టలేదని ఆ తర్వాత విచారిస్తే తెలిసింది’’ అని అన్నారు. దీనికి నన్నపనేని స్పందిస్తూ ఈ ఘటన పట్ల సభ లోపల, వెలుపల స్వామిగౌడ్ విచారం వ్యక్తం చేశారని, దీంతో తాను కూడా దాన్ని వివాదాస్పదం చేయకుండా వదిలిపెట్టానని నన్నపనేని తెలిపారు.
అసెంబ్లీకి వచ్చిన మోపిదేవి
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజర య్యారు. అయ్యప్ప మాలధారణలో ఆయన అసెంబ్లీకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ ఆయన్ను గత ఏడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తొలిసారిగా అసెంబ్లీకి వచ్చారు. పలువురు సభ్యులు ఆయనను ఆప్యాయంగా పలకరించారు. జైలులో ఉన్న సమయంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మోపిదేవి అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన సభకు రావటం ఇదే తొలిసారి.
స్పీకర్, సీఎం దిష్టిబొమ్మల దహనం
‘‘సీమాంధ్ర ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి సభను వాయిదా వేసిన సీఎం, స్పీకర్ వైఖరులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వారిద్దరి దిష్టిబొమ్మలను దహనం చేస్తాం. సభను ఆర్డర్‌లో ఉంచటం కంటే బిల్లు పెట్టడం ముఖ్యం. బిల్లుపై చర్చించండి అని కోరుతుంటే వాయిదా వేయాలని సీమాంధ్ర సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు అడ్డుకొని మరికొంత సమయం కావాలని కోరతారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం.’’
- హరీశ్‌రావు, జోగు రామన్న, నల్లాల ఓదెలు (టీఆర్‌ఎస్)
కేసీఆర్ పార్టీని విలీనం చేస్తే వెంటనే తెలంగాణ
‘‘స్పీకర్, సీఎం కలసి సభను పక్కదోవ పట్టిస్తునారు. స్పీకర్ సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గడం సరికాదు. సోనియా-కేసీఆర్ హాట్‌లైన్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ తెలంగాణ ఇవ్వకపోవడం వల్లే బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఈ తల నొప్పులు ఉండకుండా తెలంగాణ ఏర్పడుతుంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసే ఈ నాటకం ఆడుతున్నాయి.’’
- ఎర్రబెల్లి, మోత్కుపల్లి (టీడీపీ)
విభజన బిల్లు తప్పుల తడక: శైలజానాథ్, గాదె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉందని, దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తామని వుంత్రి సాకే శైలజానాథ్, వూజీ వుంత్రి గాదె వెంకటరెడ్డి వెల్లడించారు. కీలకమైన జలవనరులతో మొదలుకొని చిన్న అంశాల్లోనూ అనేక లోపాలున్నాయుని, వీటి గురించి రాష్ట్రపతికి వివరిస్తామని తెలిపారు. గురువారం సీఎల్పీ కార్యాలయుంలో విప్ రుద్రరాజు పద్మరాజుతో కలసి వారు మీడియూతో వూట్లాడారు. బిల్లులో రాజ్యాంగబద్ధమైన నిబంధనలనూ చేర్చలేదని, ఆర్థిక అంశాలపైనా స్పష్టతనివ్వలేదన్నారు. కాగా విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు చివరి రోజు అర్ధరాత్రి వరకూ అసెంబ్లీలో చర్చిస్తామని, అవసరమైతే మరింత అదనపు సమయమూ కోరతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ వుంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. బిల్లుపై చివరి నిమిషం వరకూ చర్చించి, తవు ప్రాంత ఆకాంక్షలను తెలియుచేస్తావున్నారు. గురువారం అసెంబ్లీ వద్ద ఆయున ఈ మేరకు ఇష్టాగోష్టిగా వూట్లాడుతూ.. సభ్యులందరూ సభలో తమ అభిప్రాయూలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలన్నారు.