Rituraj
-
Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సాధ్యం కాదని లా కమిషన్ తేలి్చచెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ అధ్యయనం చేస్తోంది. 2029 నుంచి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిషన్ ఓ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం.. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని తగ్గించాలి. ఈ ఫార్ములాతోజమిలి ఎన్నికలు నిర్వహించడం సులువేనని లా కమిషన్ నిర్ణయానికి వచి్చనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఓటర్ల జాబితాతో మేలు ఓటర్ల జాబితా విషయంలోనూ లా కమిషన్ కీలక సిఫార్సును తెరపైకి తీసుకొస్తోంది. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం వేర్వేరు ఓటర్ల జాబితాలను ఉపయోగిస్తున్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రూపొందిస్తున్నాయి. అన్ని రకాల ఎన్నిలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలన్నదే లా కమిషన్ ఉద్దేశమని సమాచారం. దీనివల్ల ఖర్చు, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి ఎన్నికల జాబితా కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెబుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌కు కేవలం ఒకే ఒక్కసారి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్ సూచిస్తోంది. అంటే ఒకే పోలింగ్ బూత్‌లో ఒకేసారి రెండు ఎన్నికల్లో ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ సిఫార్సులు కొన్ని అనధికారికంగా బయటకు వచి్చనప్పటికీ తుది నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దశలు లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం బాధ్యతను రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. లా కమిషన్ మాత్రం ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తోంది. కోవింద్ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో లా కమిషన్ కూడా మూడు రకాల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒక దశలో, స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించాలని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. -
ఉమ్మడి పౌర స్మృతిపై 8.5 లక్షల ప్రతిస్పందనలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై ఇప్పటిదాకా ప్రజల నుంచి 8.5 లక్షల ప్రతిస్పందనలు తమకు అందాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూ రాజ్ అవస్తీ బుధవారం చెప్పారు. యూసీసీపై అభిప్రాయాలు తెలియజేయాలని రెండు వారాల క్రితం లా కమిషన్ కోరిన సంగతి తెలిసిందే. యూసీసీపై రాజకీయ పక్షాలు, మత సంస్థలు, ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. ఒక దేశంలో రెండు రకాల చట్టాలు ఉండడం సమంజసం కాదని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతికి ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మద్దతు పలికింది. అయితే, ఏకాభిప్రాయంతోనే యూసీసీని అమలు చేయాలని సూచించింది. -
మాజీ మంత్రి రాఖీ బిర్లా జన్మదిన వేడుకల్లో ఘర్షణ
సంజాయిషీ కోరిన ఆప్ సాక్షి, న్యూఢిల్లీ : మంగోల్‌పురి ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీబిర్లా పుట్టినరోజు వేడుకల్లో బుధవారం రాత్రి కిరిడి ఎమ్మెల్యే వర్గానికి, కొందరు వ్యక్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వివాదంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు ఆశుతోష్, సంజయ్‌సింగ్ గురువారం మధ్యాహ్నం రాఖీ బిర్లాతో పాటు కిరాడీ శాసనసభ సభ్యుడు రితురాజ్‌లతో సమావేశమయ్యారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా తలెత్తిన వివాదం గురించి ఇద్దరు ఎమ్మెల్యేలను సంజాయిషీ కోరినట్లు తెలిసింది. వివరాలు.. మంగోల్‌పురి ఎమ్మెల్యే రాఖీ బిర్లా జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో గొడవ జరిగింది. శాసనసభ్యురాలి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆడంబరంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు పలువురు ఆప్ ఎమ్మెల్యేలతో పాటు కిరాడీ నియోజకవర్గం ఎమ్మెల్యే రితురాజ్ కూడా హాజరయ్యారు. ఆయన పండాల్‌కు చేరుకోగానే గొడవ ప్రారంభమైంది. రితురాజ్ వెనుకనే ఆయన నియోజకవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా పండాల్‌కు చేరుకున్నారు. ఓ హత్యకాండ విషయమై కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న కొందరు వ్యక్తులు రితురాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ పరిణామం రాఖీ బిర్లా సోదరునితో పాటు రితురాజ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. రెండుపక్షాల వారు పరస్పరం చేయి చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇదిలా ఉండగా మరోవైపు జన్మదినం సందర్భంగా రాఖీ బిర్లాకు స్కార్పియో వాహనాన్ని కూడా కానుకగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. స్కార్పియోని కానుకగా ఇచ్చిన వారెవర న్నది తెలియరాలేదు. ఆప్ నేతల సమావేశం సందర్భంగా ఈ విషయాలపై వారిద్దరి వివరణ కోరినట్లు సమాచారం.