ముస్లిం పర్సనల్ లా బోర్డు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది.
ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment