All India Muslim Personal Law Board
-
ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. -
యూసీసీని వ్యతిరేకిస్తాం
లక్నో: ఒకే దేశం ఒకే చట్టం ఆవశ్యకతపై ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం రాత్రికి రాత్రి సమావేశమైంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన బోర్డు సభ్యులు యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటంపై వ్యూహ రచన చేయనున్నట్టు చెప్పారు. ఈ అంశంలో ఏర్పాటు చేసిన 22వ లా కమిషన్‌కు సమరి్పంచాల్సిన ముసాయిదా పత్రంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఏఐఎంపీఎల్బీ సభ్యుడు ఖలీద్ రషీద్ వెల్లడించారు. న్యాయ కమిషన్ ఎదుట అభ్యంతరాలను వెల్లడించడానికి చివరి తేదీ జూలైæ 14 అని, అందుకే దీనిపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే యూసీసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. భారత్‌లో ఎన్నో మతాలు, సంస్కృతులకు ఉన్నాయని ఉమ్మడి పౌరచట్టాన్ని తీసుకువస్తే ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, యూదులు ఇలా అందరిపై ప్రభావం చూపిస్తుందన్నారు. -
UCC: అర్ధరాత్రి హడావిడిగా భేటీ
ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన రావడంతో.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి హడావిడిగా సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. వర్చువల్‌గానే జరిగిన ఈ భేటీ మూడు గంటలపాటు సాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భోపాల్ వేదికగా ప్రధాని చేసిన ప్రంసగంతో ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు.. దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ నేపథ్యంలో.. వర్చువల్‌గానే ముస్లిం లాబోర్డు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలనే ప్రధానాంశంగా చర్చించి.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు లా కమిషన్‌కు ఓ డ్రాఫ్ట్‌ను సమర్పించేందుకు ముస్లిం బోర్డు సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
AIMPLB ప్రెసిడెంట్ కన్నుమూత
ఢిల్లీ: ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు AIMPLB ప్రెసిడెంట్ రాబే హసానీ నద్వి(94) ఇక లేరు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నద్వి.. గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. సున్నీ ఇస్లామిక్ స్కాలర్ అయిన నద్వి.. ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విపరీతంగా కృషి చేశారు. ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీ టాకియా కలాన్‌లో జన్మించిన రబే హసానీరాబే హసానీ నద్వి.. 2018 నుంచి ఏఐఎంపీ చీఫ్‌గాను పని చేస్తూ వచ్చారు. దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా ఛాన్సలర్‌గా పని చేశారీయన. విద్యా రంగానికి నద్వి అందించిన సేవలకు మంచి పేరు దక్కింది. ప్రతీ సంవత్సరం ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ముస్లింల జాబితాలో ఈయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. యూపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు అరబిక్ భాషకు, సాహిత్యానికి చేసిన కృషికిగానూ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నద్వి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. -
భిన్న మతాలున్న భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి వీలుకాదు
కాన్పూర్: భిన్న మతాలకు నెలవైన భారత సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనువైనది కాదని, ఉపయుక్తకరం కూడా కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. నచ్చిన మతాన్ని అనుసరించొచ్చని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు ఉమ్మడి పౌరస్మృతి విరుద్ధమని (భంగకరమని) అభిప్రాయపడింది. ‘‘భారత్ బహుళా విశ్వాసాలను ఆచరించే దేశం. ఏ విశ్వాసాలనైనా నమ్మే, ఏ మతాన్నైనా ఆచరించే, ప్రచారం చేసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. యూసీసీ దిశగా ఏ ప్రయత్నం జరిగినా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమే’’ అని ఆదివారం ముగిసిన తమ 27వ సదస్సులో ముస్లిం బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఉమ్మడి పౌరస్మృతిని రుద్దే ప్రయత్నం ప్రత్యక్షంగా, పరోక్షంగా... పాక్షికంగా, సంపూర్ణంగా ఇలా ఏరూపంలో చేసినా అది తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాబోదని తెలిపింది. ఏఐఎంపీఎల్బీ అధ్యక్షుడిగా మౌలానా రబే హసన్ నద్వీ బోర్డు ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. -
నాడు మసీదులకు మహిళలు వెళ్లేవారు
న్యూఢిల్లీ : ఢిల్లీ సామ్రాజ్యానికి రారాణిగా సరిగ్గా 800 సంవత్సరాల క్రితం రజియా సుల్తాన్ ఎన్నికై ఢిల్లీ తొలి మహిళా పాలకులుగా చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. యుద్ధరంగంలో పోరాడిన అనుభవం, ధైర్య సాహసాలతో పాటు నీతి, నిజాయితీ, వివేచన, విజ్ఞానం కలిగినప్పటికీ ఆమె ఆ పదవికి ఎన్నికవడానికి ఆదిలో పలు అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహిళ కావడమే అందుకు కారణం. ఉలేమా (ముస్లిం గురువులతో కూడిన మండలి) ఆమె ఎన్నికకు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. రజియా సుల్తాన్ ఓ శుక్రవారం నాడు మెహ్రౌలీలోని కువ్వాతుల్ ఇస్లాం మసీద్‌కు వెళ్లి ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ప్రార్థనల కోసం అక్కడికి వచ్చిన వారందరని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాజ్యాధికారం చేపట్టేందుకు తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. అంతే కాకుండా మహిళలు మసీదులకు ఎక్కువగా రావాల్సిందిగా పిలుపునిచ్చారు. రజియా మహిళా పాలకులు అవడం వల్ల ఆమెను రజియా సుల్తానా అని అంటారుగానీ, ఆమె ఎప్పుడూ రజియా సుల్తాన్‌గానే చెప్పుకున్నారు. ఆమె ముఖాన ముసుగు ధరించేది కాదు, ఆమె గుర్రాలపై, ఏనుగులపై స్వారీ చేస్తూ మసీదులు, మదర్సాలను తరచుగా సందర్శించేవారు. నూర్జహాన్ సహా నాటి మొఘల్ రాజుల భార్యలు, పిల్లలు ముఖాన బుర్ఖాలు ధరించిన దాఖలాలు లేవు. ఒకప్పుడు ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు జరపడమే కాకుండా మసీదులను నిర్మించినట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొఘల్ పాలకుడు జలాలుద్దీన్ అక్బర్ పెంపుడు తల్లి మహమ్ అంగా 1561లో ఢిల్లీలో ‘ఖైరుల్ మంజిల్ మసీద్’ను నిర్మించడమే కాకుండా దానికి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఆ మసీదులోని కేంద్ర ద్వారంపై మసీదు నిర్మాతగా మహమ్ అంగా పేరు కూడా చెక్కారు. మసీదులకు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మహిళలు వెళ్లకపోయినా పండుగలప్పుడు మాత్రం వారు తప్పకుండా వెళ్లేవారట. ఢిల్లీలో తుగ్లక్ కాలంలో నిర్మించిన వజీరాబాద్ మసీదులో ఓ పక్కన జాలిలాగా రంద్రాలున్న గోడలు ఉన్నాయి. అవి మహిళలు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోడలని, వారు షాహీ దర్వాజా నుంచి నేరుగా వచ్చి ప్రార్థనలు చేసి, వెళ్లేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో నిర్మించిన అదీన మసీదులో కూడా ఓ అర్ద చంద్రాకార ద్వారంతో ఓ జాలి గోడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది మహిళల ప్రార్థనల కోసమని సులభంగానే అర్థం అవుతుంది. ఇలా మధ్యకాలం నాటి మసీదుల్లో పాలకులు, మహిళలు ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆ తర్వాత నిర్మించిన మసీదుల్లో ఆ ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా పోవడమే కాకుండా మహిళలు కూడా మసీదులకు రాకుండా పోయారు. సూఫీ మందిరాలు, దర్గాలను కూడా మహిళలు తరచుగా సందర్శించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ‘హజ్’ యాత్రలో మధ్య యుగాల నాటి నుంచి నేటి వరకు మహిళలు పాల్గొంటున్నారు. మక్కా, మదీనాలో వారు ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. (గమనిక: మసీదులకు మహిళలు వెళ్లి ప్రార్థనలు జరపడం ఇస్లాంకు వ్యతిరేకం కాదంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో జియా ఉస్ సలామ్ రాసిన ‘విమెన్ ఇన్ మసీద్: ఏ క్వెస్ట్ ఫర్ జస్టిస్’ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు
న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్బీ ఈ అఫిడవిట్ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ‘ఇస్లాం గ్రంధాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది. ఈ విషయానికి సంబంధించి ఉన్న విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై మేం స్పందించదలచుకోలేదు’ అని ఏఐఎంపీఎల్బీ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ముస్లిం మహిళలు కచ్చితంగా సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కానీ, శుక్రవారం ప్రార్థనల్లో పాలు పంచుకోవాలని కానీ ఏ నిబంధన ఇస్లాంలో లేదని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి మొహ్మద్ ఫజ్లుర్రహీమ్ తన న్యాయవాది షంషాద్ ద్వారా కోర్టుకు తెలిపారు. మసీదుల్లో కానీ, ఇంట్లో కానీ ప్రార్థన చేసే అవకాశం ఇస్లాం ముస్లిం మహిళలకు కల్పించిందన్నారు. -
బహుభార్యత్వం పిటిషన్లపై ఇంప్లీడ్
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కక్షిదారుగా చేర్చుకోవాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ంది. ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాలపై దాఖలైన పిటిషన్లను 1997లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏఐఎంపీఎల్బీ తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొంది. బహుభార్యత్వ సంప్రదాయం ప్రకారం...ఒక ముస్లిం వ్యక్తికి నలుగురు భార్యలుండవచ్చు. అదేవిధంగా నిఖా హలాలా..భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడిని వివాహం చేసుకోవాలంటే.. మొదటగా ఆమె మరో వ్యక్తి పెళ్లి చేసుకుని, అతడి కి విడాకులివ్వడం తప్పనిసరి. ఈ రెండు ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన నఫీసా ఖాన్ అనే మహిళ 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. -
రివ్యూనే కోరుకుంటున్నారు!
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలనే దేశంలోని 99 శాతం ముస్లింలు కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి నవంబర్ 9న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముస్లింల తరఫు పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌బోర్డు ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కానీ, ఏఐఎంపీఎల్బీ మాత్రం డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలవుతుందని పేర్కొంది. తాజాగా, ఆదివారం ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వాలి రహ్మానీ మాట్లాడుతూ.. ‘99% ముస్లింలు రివ్యూ పిటిషన్ వేయాలనే కోరుకుంటున్నారు. ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. వారిలో ఆ నమ్మకం తగ్గింది’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్ వేసినా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తారనే అనుమానం తమకుందన్నారు. పిటిషన్ వేయడం తమ హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుద్ధ్యాలున్నాయన్నారు. ఉద్రిక్తతలు సృష్టించాలనే.. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుబట్టారు. పిటిషన్ వేయడం ద్వారా సమాజంలో విభజనపూరిత, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడేలా చేయాలనుకుంటున్నాయని ఏఐఎంపీఎల్బీ, జమాయిత్ సంస్థలపై మండిపడ్డారు. ‘ముస్లింలు బాబ్రీని కాదు.. ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోరుకుంటున్నార’న్నారు. ఆర్థికంపై దృష్టిపెట్టండి రివ్యూ పటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని గతంలో అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన శ్రీశ్రీ రవిశంకర్ కూడా తప్పుబట్టారు. ఆ వివాదాన్ని మర్చిపోయి, హిందూ, ముస్లింలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. -
9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు. అయోధ్య పోలీసుల తీరును పిటిషన్లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. -
అయోధ్య తీర్పు: యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తప్పుబట్టారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై లిటరేచర్ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది కచ్చితంగా తప్పుడు తీర్పే. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అయితే ముస్లిం వర్గం ఈ తీర్పును ఆమోదించాలని కోరుతున్నా. జరిగిందేదో జరిగిపోయింది. ముందుకు సాగాల్సిందే తప్పదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మరో తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో ఎల్కే అద్వానీ, మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు తొలుత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణ ఉద్యమం ద్వారా వచ్చిన కీర్తి కారణంగా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు. కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రామ్‌లల్లాకే చెందుతుందని మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా అయోధ్యలోనే ముస్లింల కోసం మసీదు నిర్మాణానికై ఐదెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తొలుత ఈ తీర్పును స్వాగతించిన ముస్లిం లా బోర్డు.. తీర్పును సవాలు చేయబోమని స్పష్టం చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆదివారం సంచలన ప్రకటన చేసింది. అదే విధంగా తమకు కేటాయిస్తామన్న ఐదెకరాల భూమి కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. -
అయోధ్య’పై రివ్యూ పిటిషన్ వేస్తాం
అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ఏఐఎంపీఎల్బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఏఐఎంపీఎల్బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు. ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్ సంస్థ ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ -
అయోధ్య తీర్పు: ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎఐఎంపీఎల్బీ నిర్ణయించింది. అలాగే మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో ఇవ్వబోయే ఐదెకరాల భూమిని కూడా ముస్లిం లా బోర్డు నిరాకరించింది. తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సమీక్షించిన బోర్డు సభ్యులు.. తీర్పును సవాలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ ఎప్పుడు వేయాలనేది మాత్రం వారు వెల్లడించలేదు. వారి తరఫున న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తేదీని వెల్లడిస్తామని తెలిపారు. వీరితో భేటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. అలాగే అయోధ్యలోనే ముస్లింలు మసీదు నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వారికి ఐదెకరాల భూమిని కేటాయించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును పలు ముస్లిం సంఘాలు మినహా.. దేశంలోని అన్ని వర్గాల వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఎఐఎంపీఎల్బీ దాఖలు చేయబోయే సమీక్ష పిటిషన్‌ను సుప్రీం పరిగణిస్తుందా లేక విచారణకు నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఇస్లాం, షరియత్‌ల పరిరక్షణకు కృషిచేయండి
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సమాజంలోని అన్నివర్గాలు ఇస్లాం, షరియత్‌ల పరిరక్షణ కోసం కలసికట్టుగా కృషిచేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా రాబే హసనీ నద్వీ పిలుపునిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు శుక్రవారం కంచన్‌బాగ్‌లోని సాలారే మిల్లత్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ముస్లిం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం బోర్డు అధ్యక్షుడు హసనీ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్లాంతోపాటు షరియత్ చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లింలపై, షరియత్‌పై దాడులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలలోని అన్ని వర్గాలు సంఘటితమై ఎదుర్కొనాల్సిందిగా పిలుపునిచ్చారు. బాబ్రీ మసీదు అంశం కేవలం భూ వివాదం కాదని, ఇస్లాం ధర్మానికి అత్యంత గౌరవమైన విషయమని పేర్కొన్నారు. కాగా, బాబ్రీ మసీదు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున అది ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తామన్నారు. ప్రస్తుత స్థానంలోనే తిరిగి మసీదును నిర్మించాలని కోరారు. బాబ్రీ మసీదు విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానాలు చేశారు. -
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా నిఖానామా
లక్నో: ముస్లింలలో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేలా త్వరలో నిఖానామా(వివాహ ఒప్పందం)లో మార్పులు తీసుకురానున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అధికార ప్రతినిధి మౌలానా ఖలీల్ రెహ్మాన్ చెప్పారు. కొత్త నిఖానామాలో భాగంగా భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వబోనని పురుషుడు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ‘‘కొత్త నిఖానామాలో ‘నేను ట్రిపుల్ తలాక్ ఇవ్వను’ అనే నిబంధనను చేరుస్తున్నాం. ఒక్కసారి దీనికి పురుషుడు ఆమోదం తెలిపితే, ట్రిపుల్ తలాక్ ఇవ్వడం కుదరదు. హైదరాబాద్‌లో జరగబోయే బోర్డు జాతీయ వార్షిక సమావేశాల్లో ఇలాంటి సమస్యలపై చర్చిస్తాం’’ అని చెప్పారు. సాధారణంగా నిరక్షరాస్యుల్లో ట్రిపుల్ తలాక్ మహమ్మారి అధికంగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. -
‘తలాక్’కు సంఘ బహిష్కరణ
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం ► భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ ► ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఖాజీలకు సలహా ఇస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ట్రిపుల్ తలాక్ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని సోమవారం సుప్రీం కోర్టుకు అఫిడవిట్లో తెలిపింది. షరియత్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. దంపతుల మధ్య రాజీ కుదరని పరిస్థితిలో తప్పనిసరైతే ఒకసారి తలాక్ చెప్పొచ్చని, ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పకూడదని స్పష్టం చేసింది. ‘‘గత నెల 15–16న జరిగిన మా వర్కింగ్ కమిటీ భేటీలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. నిష్కారణంగా ట్రిపుల్ తలాక్‌తో విడాకులివ్వడాన్ని షరియత్ తీవ్రంగా ఖండిస్తుంది.. ఈ సందేశాన్ని ముస్లింలలోని అన్ని వర్గాలకు.. ముఖ్యంగా పేదలకు చేరవేసేందుకు అన్ని విధాలా యత్నించాలి. మసీదుల్లోని ఇమాంల, బోధకుల సహాయం తీసుకోవాలి. ఈ అంశంపై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’’ అని బోర్డు తెలిపింది. ట్రిపుల్ తలాక్ వద్దని పెళ్లికొడుకులకు చెప్పండి.. భార్యతో విభేదాలేవైనా వస్తే ట్రిపుల్ తలాక్ పాటించొద్దని నిఖానామా సమయంలో పెళ్లికొడుకులకు చెప్పాలని ఖాజీలను కోరాతామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. తమ వెబ్సైట్, ప్రచురణలు, సోషల్ మీడియా వేదికల ద్వారా సలహావళిని జారీ చేయాలని నిర్ణయించామంది. భర్త ట్రిపుల్ తలాక్‌కు చెప్పకూడదనే షరతును నిఖానామాలో పొందుపరచాలని వధూవరులకు నిఖా జరిపించే వ్యక్తి సూచిస్తారని అఫిడవిట్లో తెలిపింది. ఈ అఫిడవిట్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఈ ధర్మాసనం తన తీర్పును గత వారం రిజర్వులో ఉంచడం తెలిసిందే. అఫిడవిట్‌పై విమర్శలు ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు అందజేసిన అఫిడవిట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు గందరగోళాన్ని సృష్టించిందని ట్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఫరా ఫైజ్ ఆరోపించారు.బోర్డు ప్రైవేటు సంస్థ అని, అది ఖాజీలకు ఇచ్చే ఆదేశాలు అందరికీ వర్తించవని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ పేర్కొంది. భార్యాభర్తలకు బోర్డు నియమావళి ⇒ వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. ఒకరి తప్పులను ఒకరు మరచిపోయేందుకు యత్నించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి. ⇒ అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్(వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్ ముగిశాక వివాహం రద్దు అవుతుంది. ఇద్దత్ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్ చెప్పి తద్వారా విడాకులు పొం దొచ్చు. మూడో తలాక్ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు. -
‘పర్సనల్ లా’ ముస్లింల హక్కు
► ఆలిండియా పర్సనల్ లా బోర్డు స్పష్టీకరణ ► బాబ్రీ అంశంలో కోర్టు వెలుపలి ఒప్పందాలకు నో లక్నో: ‘పర్సనల్ లా’ అనుసరించడమనేది ముస్లింల రాజ్యాంగపరమైన హక్కు అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నొక్కి చెప్పింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి బోర్డు అంగీకరిస్తుందని, అయితే ‘కోర్టు వెలుపలి ఒప్పందాల’కు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రవర్తనా నియమావళిని జారీ చేయాలని బోర్డు నిర్ణయించిందని ఏఐఎమ్‌పీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ ఆదివారం చెప్పారు. షరియా (ఇస్లామిక్ లా) కారణాలు తెలపకుండా విడాకులు ఇచ్చే వారు సాంఘిక బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ ప్రవర్తనా నియమావళిని చదివి వినిపించాలని ఇమామ్‌లను బోర్డు అభ్యర్థించింది. షరియత్ చట్టాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని, దేశంలోని మెజారిటీ ముస్లింలు ‘పర్సనల్ లా’లో ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదంది. పర్సనల్ లా అమలు చేయడంలో అడ్డంకులు సృష్టించొద్దని రెహ్మానీ అభ్యర్థించారు. తలాక్ దుర్వినియోగమైన మహిళలకు బోర్డు అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు అస్మా జహ్రా మాట్లాడుతూ.. తలాక్ విషయం మత సంబంధమైనది కాదని, సామాజిక సంబంధమైనది చెప్పారు. భారత్‌లో మహిళల సమస్యలు ఒకటేనని, ఈ అంశంలో ‘ముస్లిం లా’ని ఒక్కటే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. బాబ్రీ వివాదంపై...: రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనను ఏఐఎమ్‌పీఎల్‌బీ తిరస్కరిం చింది. సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు మాత్రమే తమకు సమ్మతమని స్పష్టం చేసింది. కోర్టు వెలుపల ఒప్పందాలను అంగీకరించబోమని రెహ్మానీ చెప్పారు. ఈ మేరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరిం చుకోవాలని గత మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని నాడు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ చెప్పారు. -
అయోధ్యపై మేం రెడీ: ముస్లిం లాబోర్డు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సూచనల మేరకు అయోధ్యలో రామమందిరం అంశాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మంగళవారం కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. కేసును త్వరగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థనపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన మౌలానా ఖలీద్ రషీద్ స్పందించారు. న్యాయస్థానం సూచనల మేరకు కోర్టు బయట రామమందిర వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. -
ట్రిపుల్ తలాక్ క్రూరమైనది
ముస్లిం పర్సనల్ లా సవరణలకు అవకాశం ఉందా? ► ముస్లిం మహిళల బాధలు తగ్గించేందుకు సవరణలు అవసరం ► తీర్పును స్వాగతించిన కేంద్రం, మహిళా పర్సనల్ లా బోర్డు ► దీని వల్ల న్యాయ వ్యవస్థ అంతరాత్మ క్షోభిస్తోంది ► అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అలహాబాద్: ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ వల్ల న్యాయ వ్యవస్థ అంత రాత్మ తీవ్రంగా క్షోభిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల బాధలు తగ్గించేలా ముస్లిం పర్సనల్ లాలో సవరణ లకు అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’కు ప్రస్తు తం చాలా డిమాండ్ ఉందని, ఇది ఒక దేశంగా భారత్ ఉండకుండా అడ్డుకుంటోందని ఆందో ళన వ్యక్తం చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అరుునా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అతీతం కాదని వ్యాఖ్యా నించింది. ‘‘కోర్టులను ఈ అంశం ఆందోళన కు గురిచేస్తోంది. ముస్లిం మహిళలు ఈ క్రూరమైన, నిరంకుశమైన విధానంతో ఇంకెం త కాలం బాధలు పడాలి? ఇలాంటి భార్యల పట్ల వారి పర్సనల్ లా ఇంకా క్రూరంగానే ఉందా? వారి బాధలను తీర్చే విధంగా పర్సనల్ లాకు సవరణలు చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఈ అరాచకత్వం న్యాయ వ్యవస్థ అంతరాత్మను క్షోభకు గురిచేస్తోంది’’ అని న్యాయమూర్తి సునీత్ కుమార్ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గత నెలలో తీర్పు వెలువరించింది. భారత్ లోని ముస్లిం చట్టాలు.. మత ప్రవక్త, పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పిన అంశాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇదే పద్ధతి భార్యలకు విడాకులు ఇచ్చే విషయంలోనూ కొనసాగు తోందని పేర్కొంది. ఆధునిక, లౌకికవాద దేశంలో చట్టం ఉద్దేశం.. సామాజిక మార్పును తీసుకురావడమేనని తెలిపింది. భారత్‌లో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉందని, ఇం దులోని ఎక్కువ మంది ముఖ్యంగా మహిళలను పురాతన ఆచారాలు, సామాజిక కట్టుబాట్ల పేరిట పర్సనల్ లాలోని ఆంక్షలతో నియంత్రించడం తగదని చెప్పింది. ‘ఇస్లాం లో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడి నప్పుడు మాత్రమే విడాకులకు అనుమతి ఉంది. సయోధ్య కుదిర్చే మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే పెళ్లిని రద్దు చేయడానికి తలాక్ లేదా ఖోలా ద్వారా విడాకులకు ముందుకు వెళ్లొచ్చు’ అని పేర్కొంది. అరుుతే ప్రస్తుతం ముస్లిం భర్తలు ఇస్లామిక్ ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ తక్షణ విడాకులకు ప్రయ త్నిస్తున్నారని చెప్పింది. తన భార్య నిజాయతీగా, విధేయురాలై ఉన్నంత వరకూ ఒక వ్యక్తి ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం లేదని ఖురాన్ చెపుతోందని నవంబర్ 5న జారీ చేసిన ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది. ఇస్లామిక్ చట్టం పెళ్లిని రద్దు చేసేందుకు మగవారికి ప్రాథమికంగా అవకాశమిస్తోం దని, ఆమె ప్రవర్తన సరిగా లేకపోరుునా, విధేయత చూపించకపోరుునా, పెళ్లి తర్వాత జీవితం సంతృప్తికరంగా లేకపోరుునా విడాకు లు ఇవ్చొచ్చని, అరుుతే ప్రస్తుతం ఎటువంటి తీవ్ర కారణాలు లేకుండానే మగవారు విడాకులు ఇస్తున్నారని, మతపరంగానూ.. అలాగే చట్టపరంగానూ వీరు తమ విడాకులను సమర్థించుకోలేక పోతున్నారంది. యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ట్రిపుల్ తలాక్‌కు మద్దతుగా నిలిచింది. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని ప్రకటించింది. స్వాగతించిన కేంద్రం, మహిళా లా బోర్డు ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం, ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. మహిళలకు న్యాయం జరగాలని, అందరూ అంగీకరి స్తారని చెప్పారు. -
‘తలాక్’ రద్దుకు ఒప్పుకోవద్దు
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ అనడం ద్వారా విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేసే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించింది. తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన షరయా బానో అనే మహిళ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ప్రతివాదిగా కోర్టులో వాదనకు సిద్ధమైంది. ఆల్ ఇండియా ముస్లిం విమెన్ పర్సనల్ లా బోర్డు(ఏఐఎండబ్ల్యూపీఎల్బీ) చీఫ్ షైస్తా అంబార్ సైతం ‘తలాక్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సంప్రదాయాన్ని చాలామంది ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా తలాక్‌ను, బహు భార్యత్వాన్ని వ్యతిరేకించింది. కేవలం తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే షరియా చట్టంతో మహిళలు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారని స్పష్టంచేసింది. -
‘మేం సూర్య నమస్కారాలు చేయడం నేరం’
లక్నో: పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యోగాను అదే పద్ధతిలో ముస్లింలు చేయడం పెద్ద నేరమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లాంను విశ్వసించేవారు అల్లా ముందే ప్రార్థిస్తారని, కానీ ప్రస్తుత పద్ధతిలో సూర్య నమస్కారాలతో యోగా చేయడం వల్ల అల్లాతో పాటు ఇతరులనూ ఆరాధించినట్లు అవుతుందని బుధవారం బోర్డు ప్రతినిధి రహీమ్ ఖురేషీ చెప్పారు. యోగాను మతానికి ముడిపెట్టరాదని, ఆరోగ్య వ్యాయామంగానే చూడాలన్న మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి నఖ్వీ వ్యాఖ్యలను ఆయన తిరస్కరించారు. యోగాలో ఓమ్‌ను ఉచ్చరిస్తూ, చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేస్తారని, ఇస్లాంను పాటించేవారు అల్లా ముందు తప్ప ఎవరి ముందైనా మోకరిల్లుతారా? అంటూ ప్రశ్నించారు.