మూడుసార్లు తలాక్ అనడం ద్వారా విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేసే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం
న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ అనడం ద్వారా విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేసే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన షరయా బానో అనే మహిళ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రతివాదిగా కోర్టులో వాదనకు సిద్ధమైంది.
ఆల్ ఇండియా ముస్లిం విమెన్ పర్సనల్ లా బోర్డు(ఏఐఎండబ్ల్యూపీఎల్‌బీ) చీఫ్ షైస్తా అంబార్ సైతం ‘తలాక్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సంప్రదాయాన్ని చాలామంది ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా తలాక్‌ను, బహు భార్యత్వాన్ని వ్యతిరేకించింది. కేవలం తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే షరియా చట్టంతో మహిళలు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారని స్పష్టంచేసింది.