భిన్న మతాలున్న భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి వీలుకాదు | Uniform Civil Code not impliment in India says All India Muslim Personal Labor Board | Sakshi
Sakshi News home page

భిన్న మతాలున్న భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి వీలుకాదు

Published Mon, Nov 22 2021 6:29 AM | Last Updated on Mon, Nov 22 2021 6:29 AM

Uniform Civil Code not impliment in India says All India Muslim Personal Labor Board - Sakshi

కాన్పూర్‌: భిన్న మతాలకు నెలవైన భారత సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనువైనది కాదని, ఉపయుక్తకరం కూడా కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) పేర్కొంది. నచ్చిన మతాన్ని అనుసరించొచ్చని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు ఉమ్మడి పౌరస్మృతి విరుద్ధమని (భంగకరమని) అభిప్రాయపడింది. ‘‘భారత్‌ బహుళా విశ్వాసాలను ఆచరించే దేశం.

ఏ విశ్వాసాలనైనా నమ్మే, ఏ మతాన్నైనా ఆచరించే, ప్రచారం చేసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. యూసీసీ దిశగా ఏ ప్రయత్నం జరిగినా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమే’’ అని ఆదివారం ముగిసిన తమ 27వ సదస్సులో ముస్లిం బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఉమ్మడి పౌరస్మృతిని రుద్దే ప్రయత్నం ప్రత్యక్షంగా, పరోక్షంగా... పాక్షికంగా, సంపూర్ణంగా ఇలా ఏరూపంలో చేసినా అది తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాబోదని తెలిపింది. ఏఐఎంపీఎల్‌బీ అధ్యక్షుడిగా మౌలానా రబే హసన్‌ నద్వీ బోర్డు ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement